పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శశిబిందుని చరిత్ర

  •  
  •  
  •  

9-709-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఆ కన్యక యందు విదర్భునకుఁ గుశుండును గ్రుథుండును రోమపాదుండునుం బుట్టి; రా రోమపాదునకు బభ్రువు బభ్రువునకు విభువు విభువునకుఁ గృతి గృతికి నుశికుండు నుశికునకుం జేది చేది కిఁ జైద్యాదులు పుట్టరి; కృథునకుఁ గుంతి, గుంతికి ధృష్టి, ధృష్టికి నిర్వృతి, నిర్వృతికి దశార్హుండు, దశార్హునకు వ్యోముండు, వ్యోమునకు జీమూతుండు, జీమూతునకు వికృతి, వికృతికి భీమరథుండు, భీమరథునకు నవరథుండు, నవరథునకు దశరథుండు, దశరథునకు శకుని, శకునికిఁ గుంతి, గుంతికి దేవరాతుండు, దేవరాతునకు దేవక్షత్రుండు దేవక్షత్రునకు మధువు మధువునకుఁ గురువశుండు, కురువశునకు ననువు, అనువునకుఁ బురుహోత్రుం, డతనికి నంశు, వతనికి సాత్వతుండు సాత్వతునకు భజమానుండును భజియును దివ్యుండును వృష్ణియు దేవాపృథుండును నంధకుండును మహాభోజుండును నన నేడ్వురు పుట్టి; రందు భజమానునకుఁ బ్రథమభార్య యందు నిమ్రోచి కంకణ వృష్ణులు మువ్వురును, రెండవ భార్య యందు శతజిత్తు సహస్రజిత్తు నయుతజిత్తునన మువ్వురు బుట్టి; రందు దేవాపృథునికి బభ్రువు పుట్టె; వీర లిరువుర ప్రభావంబులఁ బెద్దలు శ్లోకరూపంబునఁ బఠియింతు; రట్టి శ్లోకార్థం బెట్టిదనిన.

టీకా:

ఆ = ఆ; కన్యక = యువతి; అందున్ = తోటి; విదర్భున్ = విదర్భున; కున్ = కు; కుశుండునున్ = కుశుడు; క్రుథుండును = క్రుథుడు; రోమపాదుండునున్ = రోమపాదుడు; పుట్టిరి = జన్మించిరి; ఆ = ఆ; రోమపాదున్ = రోమపాదున; కున్ = కు; బభ్రువు = బభ్రువు; బభ్రువున్ = బభ్రువున; కున్ = కు; విభువున్ = విభువు; విభువున్ = విభువున; కున్ = కు; కృతి = కృతి; కృతి = కృతి; కిన్ = కి; ఉశికుండు = ఉశికుడ; ఉశికున్ = ఉశికున; కున్ = కు; చేది = చేది; చేది = చేది; కిన్ = కి; చైద్య = చైద్యుడు; ఆదులు = మున్నగువారు; పుట్టిరి = జన్మించిరి; కృథున్ = కృథున; కున్ = కు; కుంతి = కుంతి; కుంతి = కుంతి; కిన్ = కి; ధృష్టి = ధృష్టి; ధృష్టి = ధృష్టి; కిన్ = కి; నిర్వృతి = నిర్వృతి; నిర్వృతి = నిర్వృతి; కిన్ = కి; దశార్హుండు = దశార్హుడు; దశార్హున్ = దశార్హున; కున్ = కు; వ్యోముండు = వ్యోముడు; వ్యోమున్ = వ్యోమున; కున్ = కు; జీమూతుండు = జీమూతుడు; జీమూతున్ = జీమూతున; కున్ = కు; వికృతి = వికృతి; వికృతి = వికృతి; కిన్ = కి; భీమరథుండు = భీమరథుడు; భీమరథున్ = భీమరథున; కున్ = కు; నవరథుండున్ = నవరథుడు; నవరథున్ = నవరథున; కున్ = కు; దశరథుండు = దశరథుడు; దశరథున్ = దశరథున; కున్ = కు; శకుని = శకుని; శకుని = శకుని; కిన్ = కి; కుంతి = కుంతి; కుంతి = కుంతి; కిన్ = కి; దేవరాతుండు = దేవరాతుడు; దేవరాతున్ = దేవరాతున; కున్ = కు; దేవక్షత్రుండున్ = దేవక్షత్రుడు; దేవక్షత్రున్ = దేవక్షత్రున; కున్ = కు; మధువు = మధువు; మధువున్ = మధువున; కున్ = కు; కురువశుండున్ = కురువశుడు; కురువశున్ = కురువశున; కున్ = కు; అనువున్ = అనువు; అనువున్ = అనువున; కున్ = కు; పురుహోత్రుండు = పురుహోత్రుడు; అతని = అతని; కిన్ = కి; అంశువు = అంశువు; అతని = అతని; కిన్ = కి; సాత్వతుండు = సాత్వతుడు; సాత్వతున్ = సాత్వతున; కున్ = కు; భజమానుండునున్ = భజమానుడు; భజియునున్ = భజి; దివ్యుండునున్ = దివ్యుడు; వృష్ణియున్ = వృష్ణి; దేవాపృథుండునున్ = దేవాపృథుడు; అంధకుండునున్ = అంధకుడు; మహాభోజుండునున్ = మహాభోజుడు; అనన్ = అనగా; ఏడ్వురుని = ఏడుగురు (7); పుట్టిరి = జన్మించిరి; అందున్ = వారిలో; భజమానున్ = భజమానున; కున్ = కు; ప్రథమ = మొదటి (1); భార్య = భార్య; అందున్ = తోటి; నిమ్రోచి = నిమ్రోచి; కంకణ = కంకణుడు; వృష్ణులు = వృష్ణుడులు; మువ్వురునున్ = ముగ్గురు (3); రెండవ = రెండవ (2); భార్య = భార్య; అందున్ = తోటి; శతజిత్తు = శతజిత్తు; సహస్రజిత్తు = సహస్రజిత్తు; అయుతజిత్తు = అయుతజిత్తు; అనన్ = అనెడి; మువ్వురున్ = ముగ్గురు (3); పుట్టిరి = జన్మించిరి; అందున్ = వారిలో; దేవాపృథుని = దేవాపృథుని; కిన్ = కి; బభ్రువు = బభ్రువు; పుట్టెన్ = జన్మించెను; వీరల = వీరు; ఇరువుర = ఇద్దరి (2); ప్రభావంబులన్ = ప్రభావములను; శ్లోక = శ్లోకముల; రూపంబునన్ = రూపమునందు; పఠియింతురు = కీర్తించెదరు; అట్టి = అటువంటి; శ్లోకా = శ్లోకములకు; అర్థంబు = అర్థము; ఎట్టిది = ఎలాంటిది; అనినన్ = అనినచో.

భావము:

ఆ యువతి యందు విదర్భునకు కుశుడు, క్రుథుడు, రోమపాదుడు జన్మించారు; ఆ రోమపాదునకు బభ్రువు; బభ్రువునకు విభువు; విభువునకు కృతి; కృతికి ఉశికుడ; ఉశికునకు చేది; చేదికి చైద్యుడు మున్నగువారు జన్మించారు; కృథునకు కుంతి; కుంతికి ధృష్టి; ధృష్టికి నిర్వృతి; నిర్వృతికి దశార్హుడు; దశార్హునకు వ్యోముడు; వ్యోమునకు జీమూతుడు; జీమూతునకు వికృతి; వికృతికి భీమరథుడు; భీమరథునకు నవరథుడు; నవరథునకు దశరథుడు; దశరథునకు శకుని; శకునికి కుంతి; కుంతికి దేవరాతుడు; దేవరాతునకు దేవక్షత్రుడు; దేవక్షత్రునకు మధువు; మధువునకు కురువశుడు; కురువశునకు అనువు; అనువునకు పురుహోత్రుడు; అతనికి అంశువు; అతనికి సాత్వతుడు; సాత్వతునకు భజమానుడు, భజి, దివ్యుడు, వృష్ణి, దేవాపృథుడు, అంధకుడు, మహాభోజుడు అని ఏడుగురు కుమారులు జన్మించారు. వారిలో భజమానునకు మొదటి భార్య తోటి నిమ్రోచి, కంకణుడు, వృష్ణుడు అని ముగ్గురు; రెండవ భార్య తోటి శతజిత్తు, సహస్రజిత్తు, అయుతజిత్తు అని ముగ్గురు; జన్మించారు. వారిలో దేవాపృథునికి బభ్రువు జన్మించాడు. వీరు ఇద్దరి ప్రభావాలను శ్లోకాలతో కీర్తిస్తారు. అటువంటి శ్లోకాలకు అర్థం ఎలాంటిది అంటే...