నవమ స్కంధము : ఋశ్యశృంగుని వృత్తాంతము
- ఉపకరణాలు:
ఆడుచుఁ జెవులకు నింపుగఁ
బాడుచు నాలోక నిశితబాణౌఘములన్
వీడుచు డగ్గఱ నోడుచుఁ
జేడియ లా తపసికడకుఁ జేరిరి కలఁపన్.
టీకా:
ఆడుచున్ = నటనలుచేయుచు; చెవుల్ = చెవుల; కున్ = కు; ఇంపుగ = ఆనందముకలుగునట్లు; పాడుచున్ = పాటలు పాడుతు; ఆలోక = చూపులనెడి; నిశిత = వాడియైన; బాణ = బాణముల; ఓఘములన్ = పరంపరరలను; వీడుచున్ = వదులుతు; డగ్గఱన్ = దగ్గరగా; ఓడుచున్ = తిరుగుతు; చేడియలు = కాంతలు; ఆ = ఆ; తపసి = ఋషి; కడ = దగ్గర; కున్ = కు; చేరిరి = చేరిరి; కలపన్ = కలయుటకోసము .
భావము:
మనోహరమైన ఆటపాటలతో వాడి చూపులతో దగ్గరగా మెలగుతూ జంకుతూ కాంతలు ఆ ఋషి దగ్గరకు చేరారు.