నవమ స్కంధము : భీష్ముని వృత్తాంతము
- ఉపకరణాలు:
ఆ శంతనునకు దాశకన్యక యైన సత్యవతి యందుఁ జిత్రాంగద విచిత్రవీర్యులు పుట్టి; రందుఁ జిత్రాంగదుండు గంధర్వులచే నిహతుండయ్యె మఱియును.
టీకా:
ఆ = ఆ; శంతనున్ = శంతనున; కున్ = కు; దాశ = దాశరాజు యొక్క; కన్యక = పుత్రిక; ఐన = అయిన; సత్యవతి = సత్యవతి; అందున్ = తో; చిత్రాంగద = చిత్రాంగదుడు; విచిత్రవీర్యులున్ = విచిత్రవీర్యుడు; పుట్టిరి = జన్మించిరి; అందున్ = వారిలో; చిత్రాంగదుండు = చిత్రాంగదుడు; గంధర్వుల్ = గంధర్వుల; చేన్ = చేత; నిహతుండు = మరణించినవాడు; అయ్యెన్ = అయ్యెను; మఱియునున్ = ఇంకను.
భావము:
ఆ శంతనునకు దాశరాజు పుత్రిక సత్యవతితో చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు పుట్టారు. వారిలో చిత్రాంగదుడు గంధర్వుల చేతిలో మరణించాడు. ఇంక.