పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : యయాతి బస్తోపాఖ్యానము

 •  
 •  
 •  

9-568-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

జ మొకం డడవిలో రుగుచుం దాఁ గర్మ-
లమున నూతిలోలికి జాఱి
లోఁగెడి ఛాగి నాలోకించి కామి యై-
కొమ్మున దరిఁ గొంత గూలఁ ద్రోచి
వెడలింపనచ్ఛాగి విభునిఁగాఁ గోరిన-
గుఁగాక యని తాను దియుఁ దిరుగ
నెన్నియేనిని దన్ను నెంత కామించిన-
న్నిటికిని భర్త యై తనర్చి

9-568.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వాని నే ప్రొద్దు రతులకు శలఁ జేసి
సొరిదిఁ గ్రీడించి క్రీడించి చొక్కిచొక్కి
కాముఁ డనియెడి దుస్సహగ్రహముకతన
జిత్త మేమఱి మత్తిల్లి చెల్లఁ జిక్కి.

టీకా:

అజము = మేకపోతు {అజ - మేకపోతు, అజము - కొన్ని పనసలు గల వేదభాగము, అనువాకము}; ఒకండు = ఒకటి; అడవి = అడవి; లోనన్ = లోపల; అరుగుచున్ = తిరుగుతు; తాన్ = అది; కర్మ = చేసుకొన్న కర్మల; ఫలంబునన్ = ఫలితముగా; నూతి = నుయ్యి; లోపలి = లోపలి; కిన్ = కి; జాఱి = పడిపోయి; లోగెడి = అణగిపోతున్న; ఛాగిన్ = ఆడుమేకను; ఆలోకించి = చూసి; కామి = కామించినది; ఐ = అయ్యి; కొమ్మునన్ = కొమ్ముతో; దరిన్ = గట్టును; కొంతన్ = కొంతవరకు; కూలద్రోచి = కూలగొట్టి; వెడలింపన్ = బయటకుతేగా; ఆ = ఆ; ఛాగి = ఆడుమేక; విభునిన్ = భర్త; కాన్ = కమ్మని; కోరినన్ = అడుగగా; అగుగాక = అలాగే; అని = అని; తానున్ = తను; అదియున్ = అది; తిరుగన్ = జతకట్టితిరుగుతుడగ; ఎన్నియేనినిన్ = ఎన్నివిధములైన; తన్నున్ = తనను; ఎంత = ఎంత; కామించినన్ = ప్రేమించిన; అన్నిటి = అన్నిటి; కినిన్ = కి; భర్త = భర్త; ఐ = అయ్యి; తనర్చి = తృప్తిపరచి.
వానిన్ = దానిని; ఏ = ఎల్ల; ప్రొద్దు = వేళలందు; రతుల్ = సురత; వశలన్ = పరవశలును; చేసి = చేసి; సొరిదిని = క్రమముగ; క్రీడించిక్రీడించి = బాగా విహరించి; చొక్కిచొక్కి = మిక్కిలి అలసిపోయి; కాముడు = మన్మథుడు; అనియెడు = అనెడి; దుస్సహ = సహింపలేని; గ్రహము = పెనుభూతము; కతనన్ = వలన; చిత్తమున్ = మనసు; ఏమఱి = ఏమరుపాటుచెంది; మత్తిల్లి = మదించి; చెల్లన్ = పూర్తిగా; చిక్కి = చిక్కుకుపోయి.

భావము:

అడవిలో ఒక మేకపోతు తిరుగుతుండేది. కర్మవశాత్తూ ఒక బావిలో పడి దుఖించే ఒక పెంటిమేకను చూసింది. దానిని కామించి, తన కొమ్ముతో గట్టును కొంత కూల్చి బయటకు తెచ్చింది. ఆ ఆడుమేక భర్త కమ్మని అడిగింది. మగమేక అలాగే అంది. అవి రెండూ అలా జతకట్టి తిరుగుసాగాయి. తనను కామించి వచ్చిన పెంటిమేకలు అన్నింటితోనూ జత కడుతూ వాటిని కూడ తృప్తిపరచసాగింది. ఎప్పుడూ వాటిని అన్నింటిని సురత పరవశలును చేస్తూ, విహరిస్తూ, మిక్కిలి అలసిపోయింది. మన్మథుడు అనెడి పెనుభూతము వలన చిత్తం ఏమరుపాటు చెంది, మత్తిల్లింది.