పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : దేవయాని యయాతి వరించుట

  •  
  •  
  •  

9-529-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నుఁ బాణిగ్రహణం బొనర్చితికదా నా భర్తవున్ నీవ దై
నియోగం బిది తప్పదప్పురుషతా వాక్యంబు సిద్ధంబు సౌ
ఖ్యనివాసున్ నిను మాని యొండువరునిం గాంక్షింప నే నేర్తునే?
జం బానెడి తేఁటి యన్యకుసుమావాసం బపేక్షించునే?

టీకా:

ననున్ = నన్ను; పాణిగ్రహణంబున్ = చెయ్యిపట్టుకొనుట; ఒనర్చితి = చేసితివి; కదా = కదా; నా = నా యొక్క; భర్తవున్ = భర్తవి; నీవ = నీవే; దైవ = దేవుని; నియోగంబున్ = నిర్ణయము; ఇది = ఇది; తప్పదు = తప్పదు; ఆ = ఆ; పురుషతా = పురుషుని యొక్క, కచుని యొక్క; వాక్యంబు = పలుకు; సిద్ధంబు = పొల్లుపోదు; సౌఖ్య = సౌఖ్యములకు; నివాసున్ = నివాసమైన; నినున్ = నిన్ను; మాని = వదలిపెట్టి; ఒండు = మరియొక; వరునిన్ = భర్తను; కాంక్షింపన్ = వరించుట; నేన్ = నేన్; నేర్తునే = చేయగలనా, లేను; వనజంబు = పద్మములపై; ఆనెడి = వాలెడి; తేటి = మధుపము; అన్య = ఇతర; కుసుమ = పూలమీద; ఆవాసంబున్ = ఉండుటను; అపేక్షించునే = కోరునా.

భావము:

నా చెయ్యి పట్టుకున్నావు కనుక పాణిగ్రహణం జరిగినట్లే అందుచేత నీవే నా భర్తవి. ఇది దైవ నిర్ణయం తప్పదు. ఆ కచుడి శాపం పొల్లుపోదు. పద్మాలపై వాలె మధుపము ఇతర పూలపై వాలుతుందా. సౌఖ్యాలకు నివాసమైన నిన్ను వదలిపెట్టి మరియొకరిని భర్తగా వరించలేను.