పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : యయాతి చరిత్రము

  •  
  •  
  •  

9-517-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

" లోకేశుముఖంబునం గలిగె బ్రాహ్మణ్యంబు బ్రహ్మంబునా
మేలై వైదికమార్గముల్ దెలుపుచున్; మిన్నంది యందున్ మహా
శీలుర్ భార్గవు; లందు శుక్రుఁడు సుధీసేవ్యుండు; నే వానికిం
జూలన్ నా వలువెట్లు గట్టితివి రక్షోజాతవై చేటికా!

టీకా:

ఆ = ఆ; లోకేశు = బ్రహ్మదేవుని {లోకేశు - లోకములకు ప్రభువు, బ్రహ్మ}; ముఖంబునన్ = మోమునుండి; కలిగెన్ = పుట్టినది; బ్రాహ్మణ్యంబున్ = బ్రాహ్మణకులము; బ్రహ్మంబున్ = పరబ్రహ్మ; నా = వలె; మేలు = ఉత్తమమైనది; ఐ = అయ్యి; వైదిక = వేదముల యొక్క; మార్గముల్ = విధానములను; తెలుపున్ = తెలియజేయును; మిన్నంది = అతిశయించి; అందున్ = వారిలో; మహా = గొప్ప; శీలుర్ = నియమవంతులు; భార్గవుల్ = భృగువంశీయులు; అందున్ = వారిలో; శుక్రుడు = శుక్రుడు; సుధీ = బుద్ధిమంతులచేత; సేవ్యుండు = పూజింపబడెడివాడు; నేన్ = నేను; వాని = అతని; కిన్ = కి; చూలన్ = పుట్టినామెను; నా = నా యొక్క; వలువన్ = వస్త్రమును; కట్టితివి = కట్టుకొంటివి; రక్షస్ = రాక్షసవంశమున; జాతవు = పుట్టినామెవు; ఐ = అయ్యి; చేటికా = దాసీ.

భావము:

ఆ బ్రహ్మదేవుడి ముఖం నుండి బ్రాహ్మణకులం పుట్టింది. వారిలో గొప్ప నియమవంతులై వేదవిధానాలు చెప్పే ఉత్తమమైనది భృగువంశీయులు. వారిలో విఙ్ఞులచే పూజింపబడు వాడు శుక్రుడు. నేను అతనికి పుట్టినామెను. దాసీ! రాక్షస వంశంలో పుట్టిన నువ్వు నా వస్త్రం ఎందుకు కట్టుకున్నావు.