పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పరశురాముని కథ

  •  
  •  
  •  

9-490-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శాంతచిత్తుఁ డగుచు సంగవిముక్తుఁడై
వ్యుఁడై మహేంద్రర్వతమున
నున్నవాఁడు రాముఁ డోజతో గంధర్వ
సిద్ధవరులు నుతులు చేయుచుండ.

టీకా:

శాంతచిత్తుండు = శాంతి చెందిన; చిత్తుడు = మనసు గలవాడు; అగుచున్ = అగుచు; సంగ = ఐహిక బంధముల నుండి; విముక్తుడు = విడివడినవాడు; ఐ = అయ్యి; భవ్యుడు = దివ్యమైనవాడు; ఐ = అయ్యి; మహేంద్ర = మహేంద్ర; పర్వతమున = పర్వతముపైన; ఉన్నవాడు = ఉన్నాడు; రాముడు = పరశురాముడు; ఓజస్ = ఓజస్సు; తోన్ = తోటి; గంధర్వ = గంధర్వులు; సిద్ధ = సిద్ధులలో; వరులు = ఉత్తములు; నుతులు = స్తోత్రములు; చేయుచుండ = చేస్తుండగా.

భావము:

గంధర్వులు సిద్ధులు తన పవిత్ర చరిత్ర స్తుతిస్తూ ఉండగా, పరశురాముడు శాంతచిత్తుడై, ఐహికబంధాల నుండి విడివడి, తేజోవంతుడై తపస్సు చేసుకుంటూ ఈనాటికి మహేంద్ర పర్వతంపై ఉన్నాడు.