పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరాముని కథనంబు

  •  
  •  
  •  

9-324-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లొప్పుచున్న యప్పురంబు ప్రవేశించి, రాజమార్గంబున రామచంద్రు డరుగుచున్న సమయంబున.

టీకా:

ఇట్లు = ఇలా; ఒప్పుచున్న = చక్కగా ఉన్నట్టి; ఆ = ఆ; పురంబున్ = పట్టణమును; ప్రవేశించి = ప్రవేశించి; రాజమార్గంబున = ముఖ్యవీథమ్మట; రామచంద్రుడు = శ్రీరాముడు; అరుగుచున్న = వేంచేయుచున్న; సమయంబునన్ = సమయమునందు.

భావము:

ఇలా ముస్తాబయిన ఆ పట్టణం ప్రవేశించి రాజమార్గంలో శ్రీరాముడు వేంచేస్తున్న సమయంలో.