పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : దూర్వాసుని కృత్య కథ

  •  
  •  
  •  

9-133-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మలలోచనుండు లుల శిక్షింపంగఁ
బాలు చేయ నీవు పాలు పడితి
వైన నింకఁజాలు నాపన్నుఁడై యున్న
పసిఁ గావు మీవు ర్మవృత్తి."

టీకా:

కమలలోచనుండు = నారాయణుడు {కమలలోచనుడు - కమలములవంటి కన్నులుగలవాడు, విష్ణువు}; ఖలులన్ = దుష్టులను; శిక్షింపంగన్ = శిక్షించుటకై; పాలుచేయ = పంపించగా; నీవున్ = నీవు; పాలుపడితివి = పూనుకొంటివి; ఐనన్ = అయినను; ఇంకజాలున్ = ఇకచాలును; ఆపన్నుడు = ఆపదలోచిక్కినవాడు; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; తపసిన్ = మునిని; కావుము = కాపాడుము; ఈవున్ = నీవు; ధర్మవృత్తి = పుణ్యవంతమైనవిధముగ.

భావము:

విష్ణుమూర్తి దుష్టులను శిక్షించుటానికి నిన్ను పంపించాడు. నీవు ఈ పనికి పూనుకున్నావు. సరే, ఇక చాలు ఆపదలో చిక్కిన ఈ ఋషిని ధర్మవృత్తితో కాపాడు.”