పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : కల్పాంత వర్ణన

 •  
 •  
 •  

8-711-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

తదనంతరంబ

టీకా:

తదనంతరంబ = ఆతరువాత.

భావము:

తరువాత. . . .

8-712-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మున్ను పోయిన కల్పాంతమున నరేంద్ర!
బ్రహ్మ మనఁగ నైమిత్తిక ప్రళయ వేళ
నింగిపై నిట్టతొలఁకు మున్నీటిలోనఁ
గూలె భూతాళి జగముల కొలఁదు లెడలి.

టీకా:

మున్ను = ఇంతకుముందు; పోయిన = గడచిపోయినట్టి; కల్ప = కల్పము; అంతమునన్ = చివర; నరేంద్ర = రాజా; బ్రహ్మము = బ్రహ్మప్రళయము; అనగన్ = అనబడెడి; నైమిత్తికప్రళయ = నైమిత్తికప్రళయపు; వేళన్ = సమయమునందు; నింగి = ఆకాశము; పైన్ = మీదకు; నిట్టన్ = నిక్కెడి, ఎగసెడి; తొలకు = అలలుకలిగిన; మున్నీటి = సముద్రము; లోనన్ = లో; కూలెన్ = కూలిపోయినవి; భూత = జీవ; అళి = రాశులన్ని; జగముల = లోకముల; కొలదులు = సరిహద్దులు; ఎడలి = చెరిగిపోయి.

భావము:

పరీక్షిత్తు మహారాజా! గడచిపోయిన కల్పం అంతం కాగా, బ్రహ్మప్రళయం అనే నైమిత్తిక ప్రళయం ఏర్పడింది. సముద్రాలు చెలియలి కట్టలు దాటాయి. నిట్టనిలువుగా ఆకాశమంత లేచిన అలల సముద్రంలో లోకాల సరిహద్దులు చెరిగిపోయాయి. ప్రాణులు సమస్తం కూలిపోయాయి.

8-713-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అంత న మ్మహారాత్రి యందు

టీకా:

అంతన్ = అప్పుడు; ఆ = ఆ; మహారాత్రి = బ్రహ్మప్రళయపు; అందున్ = సమయమున.

భావము:

అట్టి బ్రహ్మదేవుని రాత్రి సమయం అయిన మహా ప్రళయ కాలంలో.

8-714-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నెఱి నెల్లప్పుడు నిల్చి ప్రాణిచయమున్ నిర్మించి నిర్మించి వీఁ
పియన్ నీల్గుచు నావులించుచు నజుం డే సృష్టియున్ మాని మే
నొఱఁగన్ ఱెప్పలు మూసి కేల్ దలగడై యుండంగ నిద్రించుచున్
గుఱు పెట్టం దొడఁగెం గలల్ గనుచు నిర్ఘోషించుచున్ భూవరా!

టీకా:

నెఱిన్ = పూర్తిగా; ఎల్లప్పుడు = ఎడతెగకుండ; నిల్చి = పూని; ప్రాణి = జీవ; చయమున్ = జాలమును; నిర్మించినిర్మించి = సృష్టిచేసిచేసి; వీపు = వీపు; ఇఱయన్ = నలిగిపోగా; నీల్గుచున్ = ఒళ్ళువిరుచుకొంటు; ఆవులించుచున్ = ఆవలిస్తూ; ఉండెన్ = ఉండెను; అజుండు = బ్రహ్మదేవుడు {అజుడు - జన్మములేనివాడు, బ్రహ్మ}; ఏ = ఎలాంటి; సృష్టియున్ = సృష్టికూడ; మాని = చేయకుండ; మేను = దేహము; ఒఱగన్ = వాలిపోగా; ఱెప్పలు = కనురెప్పలు; మూసి = మూసికొని; కేల్ = చెయ్యి; తలగడ = తలదిండు; ఐ = అయ్యి; ఉండంగన్ = ఉండగా; నిద్రించుచున్ = నిద్రపోతూ; గుఱు = గురకలు; పెట్టన్ = పెట్టుట; తొడగెన్ = మొదలిడెను; కలల్ = కలలు; కనుచున్ = కంటూ; నిర్ఘోషించుచున్ = గట్టిగా చప్పుడు చేస్తూ; భూవరా = రాజా.

భావము:

రాజ్యాన్ని ఏలే రాజా పరీక్షిత్తూ! అవిశ్రాంతంగా కూర్చుని ఓర్పుతో ప్రాణులను సృష్టించి జన్మించుట లేని వాడు అగు బ్రహ్మదేవుడు అలసిపోయాడు. వీపు నడుము నొచ్చసాగాయి. అతడు ఒళ్ళువిరుచుకుంటూ, ఆవులిస్తూ సృష్టికార్యాన్ని ఆపాడు. నడుం వాల్చి, కళ్ళు మూసికొని, చెయ్యి తలగడగా పెట్టుకున్నాడు. గురకలు పెడుతూ కలలు కంటూ ఒళ్ళుతెలియని నిద్రపోయాడు.

8-715-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

లసి సొలసి నిదుర నందిన పరమేష్ఠి
ముఖము నందు వెడలె మొదలి శ్రుతులు
పహరించె నొక హగ్రీవుఁ డను దైత్య
టుఁడు; దొంగఁ దొడర రుల వశమె?

టీకా:

అలసి = అలసిపోయి; సొలసి = సోలిపోయి; నిదురన్ = నిద్రలో; అందిన = పడిన; పరమేష్టి = బ్రహ్మదేవుని; ముఖమున్ = ముఖము; అందున్ = నుండి; వెడలెన్ = వెలువడినవి; మొదలిశ్రుతులున్ = వేదములు; అపహరించెన్ = దొంగిలించెను; ఒక = ఒకానొక; హయగ్రీవుడు = హయగ్రీవుడు; అను = అనెడి; దైత్య = రాక్షస; భటుడున్ = వీరుడు; దొంగన్ = దొంగతనము; తొడరన్ = యత్నించుటకు; పరుల = ఇతరులకు; వశమె = సాధ్యమా కాదు.

భావము:

అలా బాగా అలసిపోయిన బ్రహ్మదేవుడు నిద్రపోయాడు. అతని ముఖాలనుండి వేదాలు వెలువడినాయి. హయగ్రీవుడు అనే రాక్షసవీరుడు వాటిని దొంగిలించాడు. ఆ హయగ్రీవుడికి తప్ప అలా దొంగతనం చేయడం ఇతరులకు సాధ్యం కాదు.

8-716-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

దువులుఁ దన చేఁ బడినం
దువుచుఁ బెన్ బయల నుండ శంకించి వడిం
దువుల ముదుకఁడు గూరుకఁ
దువుల తస్కరుఁడు చొచ్చె లనిధి కడుపున్.

టీకా:

చదువులున్ = వేదములు; తన = తన యొక్క; చేన్ = చేతిలో; పడినన్ = పడగా; చదువుచున్ = అధ్యయనముచేస్తూ; పెన్ = పూర్తిగా; బయలన్ = బహిఃప్రదేశమునందు; ఉండన్ = ఉండుటకు; శంకించి = బెదిరి; వడిన్ = శీఘ్రముగా; చదువులముదుకడు = బ్రహ్మదేవుడు {చదువులముదుకడు - చదువుల (వేదజ్ఞానమునందు) ముదుకడు (వృద్ధుడు), బ్రహ్మ}; కూరుకన్ = నిద్రించగా; చదువుల = వేదముల; తస్కరుడు = దొంగతనముచేసినవాడు; చొచ్చెన్ = దూరెను; జలనిధి = సముద్రపు; కడుపున్ = గర్భములోనికి.

భావము:

అలా వేదాలను చెరపట్టిన హయగ్రీవుడు వాటిని చదువసాగాడు. బయటి ప్రపంచంలో ఉండటానికి భయపడిన అతడు బ్రహ్మదేవుడు నిద్రలో ఉండటం గమనించి, వేగంగా సమద్రంలోకి వెళ్ళిపోయాడు.

8-717-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇట్లు వేదంబులు దొంగిలి దొంగరక్కసుండు మున్నీట మునింగిన, వాని జయింపవలసియు, మ్రానుదీఁగెల విత్తనంబుల పొత్తరలు పె న్నీట నాని చెడకుండ మనుపవలసియు నెల్ల కార్యంబులకుం గావలి యగునా పురుషోత్తముం డ ప్పెను రేయి చొరుదల యందు.

టీకా:

ఇట్లు = ఇలా; వేదంబులున్ = వేదములను; దొంగిలి = దొంగతనముచేసి; దొంగ = దొంగయైన; రక్కసుండు = రాక్షసుండు; మున్నీటన్ = సముద్రమునందు; మునింగినన్ = మునుగగా; వాని = అతనిని; జయింపవలసియున్ = జయించవలసి ఉండి; మ్రాను = వృక్షముల; తీగెల = తీవెల; విత్తనంబుల = విత్తనముల; పొత్తరంబులు = కట్టలు; పెన్నీటన్ = సముద్రమునందు; నాని = నానిపోయి; చెడకుండన్ = చెడిపోకుండ; మనుపవలసియున్ = కాపాడవలసి ఉండి; ఎల్ల = సమస్తమైన; కార్యంబుల్ = పనులు; కావలి = కాపాడెడివాడు; అగున్ = అయిన; ఆ = ఆ; పురుషోత్తముండు = విష్ణుమూర్తి; ఆ = ఆ; పెనురేయి = ప్రళయకాలపురాత్రి; చొరుదల = ప్రవేశము; అందు = లో.

భావము:

ఈ విధంగా వేదాలను అపహరించుకుపోయి సముద్రంలో మునిగిన ఆ రాక్షసదొంగ హయగ్రీవుడిని జయించడం కోసమూ; వృక్షాలూ, తీగలూ అన్నింటి విత్తనాలు సమస్తం సముద్రంలో తడసిపోయి పాడయిపోకుండా రక్షించడం కోసమూ; జగత్తులోని సమస్త కార్యములకు స్థితికారుడు అయిన శ్రీమహావిష్ణువు ఆ ప్రళయకాల ఆరంభంలో మీనరూపం ధరించాడు. . .

8-718-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కుఱుగఱులు వలుఁద మీసలు
చిఱుదోకయుఁ బసిఁడి యొడలు సిరిగల పొడలున్
నెఱి మొగము నొక్క కొమ్మును
మిఱుచూపులుఁ గలిగి యొక్క మీనం బయ్యెన్.

టీకా:

కుఱు = కురుచైన, పెద్ద; గఱులున్ = రెక్కలు; వలుద = పెద్దపెద్ద; మీసలు = మీసములు; చిఱు = చిన్న; తోకయున్ = తోక; పసిడి = బంగారు; ఒడలు = దేహము; సిరిగల = అందమైన; పొడలున్ = మచ్చలు; నెఱి = నిండైన; మొగమున్ = ముఖము; ఒక్క = ఒక; కొమ్మునున్ = కొమ్ము; మిఱు = మిరిమిట్లుగొలిపెడి; చూపులున్ = చూపులు; కలిగి = కలిగిన; ఒక్క = ఒక; మీనంబు = చేప; అయ్యెన్ = రూపుదాల్చెను.

భావము:

అలా విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తాడు. చిన్నచిన్న రెక్కలూ, పెద్దపెద్ద మీసాలూ, పొట్టితోకా, బంగారపు రంగు శరీరమూ, శ్రీకరమైన మచ్చలూ, చక్కని ముఖమూ, ఒక కొమ్మూ, మిరుమిట్లుగొలిపే చూపులు తోటి ఆ మహామత్స్యరూపం విరాజిల్లుతోంది.