పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : మత్స్యావతార కథా ప్రారంభం

 •  
 •  
 •  

8-702-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"క దినంబున శతయోజనమాత్రము-
విస్తరించెదు నీవు; వినము చూడ
మిటువంటి ఝషముల నెన్నఁడు నెఱుఁగము-
మీనజాతుల కిట్టి మేను గలదె?
యేమిటి కెవ్వఁడ? వీ లీలఁ ద్రిప్పెదు-
రుణ నాపన్నులఁ గావ వేఁడి
యంభశ్చరంబైన రివి నే నెఱిఁగితి-
వ్యయ! నారాయణాభిధాన!

8-702.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నన సంస్థితి సంహార తురచిత్త!
దీనులకు భక్తులకు మాకు దిక్కు నీవ;
నీదు లీలావతారముల్ నిఖిలభూత
భూతి హేతువుల్ మ్రొక్కెదఁ బురుషవర్య!

టీకా:

ఒక = ఒక్క; దినంబునన్ = రోజులోనే; శత = నూరు; యోజన = యోజనముల; మాత్రము = మేర; విస్తరించెదు = పెరుగెదవు; నీవు = నీవు; వినము = వినలేదు; చూడము = చూడలేదు; ఇటువంటి = ఇలాంటి; ఝషములన్ = చేపలను; ఎన్నడున్ = ఎప్పుడుకూడ; మీనజాతుల్ = చేపలజాతుల; కున్ = కు; ఇట్టి = ఇంతటి; మేను = దేహము; కలదె = ఉంటుందా, ఉండదు; ఏమిటి = దేని; కిన్ = కోసము; ఎవ్వడవు = ఎవరవు; ఈ = ఈ; లీలన్ = విధముగ; త్రిప్పెడున్ = తిప్పలుపెడుతుంటివి; కరుణన్ = దయతో; ఆపన్నులన్ = దీనులను; కావన్ = కాపాడుటకు; వేడి = కోరి; అంభశ్చరంబు = జలచరము; ఐన = అయిన; హరివి = నారాయణుడవు; నేన్ = నేను; ఎఱిగితిన్ = తెలిసికొంటిని; అవ్యయ = నాశములేనివాడ; నారాయణ = నారాయణుడు; అభిదాన = అనెడిపేరు కలవాడ.
జననసంస్థితిసంహారచతురచిత్త = నారాయణ {జననసంస్థితిసంహారచతురచిత్త - జనన (సృష్టి) సంస్థితి (స్థితి) సంహార (లయ) చతుర (నైపుణ్యము కల) చిత్త (చిత్తముకలవాడ), విష్ణువు}; దీనుల్ = ఆపన్నుల; కున్ = కు; భక్తుల్ = భక్తుల; కున్ = కు; మా = మా; కున్ = కు; దిక్కు = శరణము; నీవ = నీవే; నీదు = నీ యొక్క; లీలావతారముల్ = క్రీడావతారములు; నిఖిల = సర్వ; భూత = జీవుల; భూతి = మేలు; హేతువుల్ = కలిగించెడివి; మ్రొక్కెదన్ = నమస్కరించెదను; పురుషవర్య = పురుషోత్తమ.

భావము:

“ఒక్క రోజులో నూరు యోజనాల మేర పెరిగిపోయావు. ఇలాంటి చేపలను మేము ఎప్పుడూ కనివిని ఎరుగము. ఝషజాతులకు ఎక్కడా ఇలాంటి శరీరం ఉండదు. నీవు ఎవరవు? ఎందుకోసం నన్ను తిప్పలమ్మట తిప్పుతున్నావు. దీనులను కాపాడటానికి ఈ మహా మీన రూపం ధరించిన నీవు విష్ణువే అని తెలుసుకున్నాను. అచ్యుతా! నారాయణా! పురుషోత్తమా! లోకాలను సృష్టించి పోషించి లయం చేసుకునే మహానుభావుడవు నీవే. దీనులకు, భక్తులకు నీవే దిక్కు. మహిమాన్వితమైన నీ లీలావతారాలు సర్వ ప్రాణులకూ మేలు కలిగిస్తాయి. అటువంటి నీకు మ్రొక్కుతున్నాను.