అష్టమ స్కంధము : బలియఙ్ఞమును విస్తరించుట
- ఉపకరణాలు:
అని యిట్లు శుకుండు రాజునకు వామనావతారచరితంబు చెప్పె" నని సూతుండు మునులకుం జెప్పిన విని, వార లతని కిట్లనిరి.
టీకా:
అని = అని; ఇట్లు = ఈ విధముగ; శుకుండు = శుకుడు; రాజున్ = రాజున; కున్ = కు; వామనావతార = వామనావతారముయొక్క; చరితంబున్ = చరిత్రను; చెప్పెను = చెప్పెను; అని = అని; సూతుండు = సూతుడ; మునుల్ = మునుల; కున్ = కు; చెప్పిన = చెప్పగా; విని = విని; వారల్ = వారు; అతని = అతని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:
అని ఈ విధంగా శుకబ్రహ్మ పరీక్షిత్తు మహారాజునకు వామనావతార చరిత్రను చెప్పెను” అని సూతమహర్షి శౌనకాది మహర్షులకు చెప్పాగా వినిన వారు సూతునితో ఇలా అన్నారు.