పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : బలియఙ్ఞమును విస్తరించుట

  •  
  •  
  •  

8-689-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తగిలి మానుష పైతృక దైవ కర్మ
వేళలందుఁ ద్రివిక్రమ విక్రమంబు
లెక్కడెక్కడఁ గీర్తింతు రెవ్వరేనిఁ
బొందుదురు నిత్య సౌఖ్యంబు భూవరేంద్ర!

టీకా:

తగిలి = పూని; మానుష = మానవసంబంధమైన; పైతృక = పితృసంబంధమైన; దైవ = దైవసంబంధమైన; కర్మ = కార్యములను చేసెడి; వేళలు = సమయములందు; త్రివిక్రమ = త్రివిక్రముని; విక్రమంబుల్ = వర్తనలను; ఎక్కడెక్కడన్ = ఎక్కడైనను; కీర్తింతురు = కీర్తించెదరో; ఎవ్వరేనిన్ = ఎవరైతేవారు; పొందుదురు = పొందెదరు; నిత్య = ఎల్లప్పుడును; సౌఖ్యంబు = సుఖములను; భూవరేంద్ర = మహారాజ {భూవరేంద్ర - భూవరు (రాజుల)లో ఇంద్రుడు, మహారాజు}.

భావము:

పరీక్షిన్మహారాజా! మానవులకూ పితృదేవతలకూ దేవతలకూ సంబంధించిన పుణ్యకార్యాలు చేసే సమయాలలో ఎవరైతే త్రివిక్రముని చరిత్రను కీర్తిస్తుంటారో, వారు ఎప్పుడూ సర్వ సుఖాలూ పొందుతూ ఉంటారు.