పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : బలియఙ్ఞమును విస్తరించుట

  •  
  •  
  •  

8-688-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అద్భుత వర్తనుఁడగు హరి
సద్భావితమైన విమలచరితము వినువాఁ
డుద్భట విక్రముఁడై తుది
నుద్భాసితలీలఁ బొందు నుత్తమ గతులన్.

టీకా:

అద్భుత = అద్భుతమైన; వర్తనుడు = నడవడిక కలవాడు; అగు = అయిన; హరి = విష్ణుని; సద్భావితము = చక్కగాతెలిపెడిది; అయిన = ఐన; విమల = నిర్మలమైన; చరితము = చరిత్ర; విను = వినెడి; వాడు = వాడు; ఉద్భట = అధికమైన; విక్రముడు = పరాక్రమము కలవాడు; ఐ = అయ్యి; తుదిన్ = చివరికి; ఉద్భాసిత = మిక్కిలి ప్రకాశించెడి; లీలన్ = విధముగా; పొందున్ = పొందును; ఉత్తమ = దివ్య; గతులన్ = పదములను.

భావము:

అత్యద్భుత మైన లీలలతోకూడిన విష్ణుమూర్తి నిర్మల వర్తనములను గురించి తెలిపే ఈపుణ్య చరిత్రను వినేవాడు గొప్ప భాగ్యవంతుడు అవుతాడు. చివరకి ప్రకాశించే ప్రభావంతో దివ్యలోకాలను పొందుతాడు.