పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : బలియఙ్ఞమును విస్తరించుట

  •  
  •  
  •  

8-684-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పా లడుగఁడు మే లడుగం
డేలఁడు భిక్షించి యన్నకిచ్చెఁ ద్రిజగమున్
వేలుపులతల్లి కడపటి
చూలుం బోలంగఁ గలరె సొలయని తమ్ముల్.

టీకా:

పాలు = వంతు, భాగము; అడుగడు = కావాలనడు; మేలు = లాభమును; అడుగండు = కావాలనడు; ఏలడు = పెత్తనము చెలాయించడు; భిక్షించి = యాచనచేసి; అన్న = అన్న; కిన్ = కి; ఇచ్చెన్ = ఇచ్చెను; త్రిజగమున్ = ముల్లోకములను; వేలుపులతల్లి = అదితి {వేలుపులతల్లి - దేవతల అమ్మ, అదితి}; కడపటి = ఆఖరి, కడగొట్టు; చూలున్ = సంతానమును; పోలంగగలరె = సాటిరాగలరా లేరు; సొలయని = వెనుదీయని; తమ్ముల్ = తమ్ముళ్ళు.

భావము:

దేవతలతల్లి అదితికి కడపటివాడైన కొడుకు వామనుడు భిక్షం అడిగి సంపాదించిన ముల్లోకాలూ తన అన్నకే ఇచ్చేసాడు. అందులో భాగాన్ని అడగలేదు. లాభాన్ని అడగలేదు. ఆవిధంగా అన్నల కోసం ఎంత శ్రమపడే తమ్ముళ్ళు అయినా వామనునితో సరిపోలగలరా?