పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : రాక్షసుల సుతల గమనంబు

  •  
  •  
  •  

8-676-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"వత్స! ప్రహ్లాద! మేలు నీ వారు నీవు
సొరిది మనుమనిఁ దోడ్కొని సుతలమునకుఁ
బయనమై పొమ్ము నే గదాపాణి నగుచుఁ
జేరి రక్షింప దురితంబు చెంద దచట."

టీకా:

వత్స = కుమారా; ప్రహ్లాదా = ప్రహ్లాదుడా; మేలు = సంతోషము; నీవారు = నీవారు; నీవున్ = నీవు; సొరిదిన్ = క్రమముగా; మనుమనిన్ = మనుమడిని; తోడ్కొని = వెంటబెట్టుకొని; సుతలమున్ = సుతలమున; కున్ = కు; పయనము = బయలుదేరినవాడవు; ఐ = అయ్యి; పొమ్ము = వెళ్ళుము; నేన్ = నేను; గదా = గదాయుధము; పాణిని = చేతధరించినవానిని; అగుచున్ = అగుచు; చేరి = వచ్చి; రక్షింపన్ = కాపాడుతుండగా; దురితంబు = ఏకష్టము; చెందదు = కలుగదు; అచటన్ = అక్కడ.

భావము:

“నాయనా! ప్రహ్లాదా! మంచిది. నీవు నీమనుమనితోపాటు నీవారితోపాటు సుతలలోకానికి వెళ్ళు. నేను గదాహస్తుడనై వచ్చి మిమ్ములను కాపాడుతాను. అక్కడ మీకు ఏకష్టమూ కలుగదు.