అష్టమ స్కంధము : రాక్షసుల సుతల గమనంబు
- ఉపకరణాలు:
"ఎన్నడు లోకపాలకుల నీ కృపఁ జూడని నీవు నేఁడు న
న్నున్నతుఁ జేసి నా బ్రతుకు నోజయు నానతి యిచ్చి కాచి తీ
మన్నన లీ దయారసము మాటలు పెద్దఱికంబుఁ జాలవే?
పన్నగతల్ప! నిన్నెఱిఁగి పట్టిన నాపద గల్గనేర్చునే?"
టీకా:
ఎన్నడున్ = ఎప్పుడు; లోక = లోకములను; పాలకులన్ = పరిపాలించెడివారినికూడ; ఈ = ఇంత; కృపన్ = దయతో; చూడని = చూడనట్టి; నీవు = నీవు; నేడు = ఇవాళ; నన్నున్ = నన్ను; ఉన్నతున్ = గొప్పవానినిగ; చేసి = చేసి; నా = నా యొక్క; బ్రతుకున్ = జీవితమును; ఓజయున్ = తేజస్సును; ఆనతియిచ్చు = కలుగజేసి; కాచితి = కాపాడితివి; ఈ = ఇట్టి; మన్ననలు = గౌరవించుటలు; ఈ = ఇట్టి; దయారసమున్ = కరుణ; మాటలు = మాటలు; పెద్దఱికంబున్ = మర్యాదలు; చాలవే = సరిపోవా, సరిపోవును; పన్నగతల్ప = శేషశాయి; నిన్నున్ = నిన్ను; ఎఱిగి = తెలిసి; పట్టినన్ = ఆశ్రయించినచో; ఆపద = కష్టము; కల్గనేర్చునే = కలుగగలదా, కలుగదు.
భావము:
“ఓ శేషశాయిశయనా! శ్రీమహావిష్ణూ! నీవు దిక్పాలకుల మీద కూడా ఏనాడూ ఇంతటి దయచూపలేదు. ఈనాడు నన్ను గొప్పగా గౌరవించావు. నా జీవితానికి తేజస్సును ఇచ్చి కాపాడావు. ఈ మన్ననా, ఈ కరుణా, ఈ మాటలు, మర్యాదా నాకు చాలు. నిన్ను తెలుసుకొని ఆశ్రయించినవారికీ ఎన్నడూ కష్టాలు కలుగవు.”