పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : బలిని బంధించుట

  •  
  •  
  •  

8-642-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యిట్లు వామనుండు పలుక సత్యభంగ సందేహ విషదిగ్ధ శల్య నికృత్త హృదయుం డయ్యును విషణ్ణుండుఁ గాక వైరోచని ప్రసన్న వదనంబుతోడఁ జిన్ని ప్రోడ వడుగున కి ట్లనియె.

టీకా:

అని = అని; ఇట్లు = ఈ విధముగ; వామనుండు = వామనుడు; పలుకన్ = అనగా; సత్యభంగ = ఆడినమాట బోటగు ననెడి; సందేహ = అనుమానము యనెడి; విషత్ = విషము; దిగ్ధ = పూయబడిన; శల్య = బాణము; నికృత్త = గుచ్చుకొన్న; హృదయుండు = హృదయము కలవాడు; అయ్యును = అయినప్పటికిని; విషణ్ణుండు = దిగులుపడ్డవాడు; కాక = కాకుండ; వైరోచని = బలిచక్రవర్తి; ప్రసన్న = నిర్మలమైన; వదనంబు = ముఖము; తోడన్ = తోటి; చిన్ని = వామనుడు; ప్రోడ = బుద్ధిశాలియైన; వడుగున్ = బ్రహ్మచారి; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇలా పలికిన వామనుడి మాటలు వినిన బలిచక్రవర్తికి సత్యభంగం అవుతుంది ఏమో అనే సందేహం కలిగింది. అది విషబాణంలా మనసును గాయపరచింది. అయినా అతడు దిగులుచెందకుండా ప్రసన్నమైన ముఖంతో బుద్ధిశాలి అయిన వామనుడితో ఇలా అన్నాడు.