అష్టమ స్కంధము : వామనునికి దాన మిచ్చుట
- ఉపకరణాలు:
"ఇది యేమి వేఁడితని నీ
మది వగవక ధారపోయుమా; సత్యము పెం
పొదవఁగ గోరిన యర్థం
బిది యిచ్చుట ముజ్జగంబు లిచ్చుట మాకున్."
టీకా:
ఇది = దీనిని; ఏమి = దేనికి; వేడితి = అడిగితిని; అని = అని; నీ = నీ యొక్క; మదిన్ = మనసున; వగవక = చితించకుండ; ధారపోయుమా = దానమిమ్ము; సత్యమున్ = సత్యము; పెంపొదవన్ = పెంపొందేవిధముగ; కోరిన = అడిగిన; అర్థంబు = కోరిక; ఇది = ఇది; ఇచ్చుట = ఇచ్చుట; ముజ్జగంబులున్ = ముల్లోకములను; ఇచ్చుట = ఇచ్చుట; మాకున్ = మాకు.
భావము:
“నేనెందుకు దీనిని అడిగానని నీ మనస్సులో చింతించకుండా దానమియ్యి. సత్యం పెంపొందే విధంగా దాన మియ్యి. ఈ మూడడుగులూ ఇస్తే మాకు మూడు లోకాలూ ఇచ్చినట్లే.”