అష్టమ స్కంధము : వామనునికి దాన మిచ్చుట
- ఉపకరణాలు:
ఇట్లు ధరణీసుర దక్షిణ చరణ ప్రక్షాళనంబు చేసి వామపాదంబు గడిగి తత్పావన జలంబు శిరంబునం జల్లుకొని వార్చి దేశ కాలాది పరిగణ నంబు చేసి.
టీకా:
ఇట్లు = ఈ విధముగ; ధరణీసుర = బ్రాహ్మణుని {ధరణీసురుడు - భూమిపైదేవత, విప్రుడు}; దక్షిణ = కుడి; చరణ = పాదమును; ప్రక్షాళనము = కడుగుట; చేసి = చేసి; వామ = ఎడమ; పాదంబున్ = పాదమును; కడిగి = కడిగి; తత్ = ఆ; పావన = పవిత్రమైన; జలంబున్ = నీటిని; శిరంబునన్ = తలపైన; చల్లుకొని = ప్రోక్షించుకొని; వార్చి = ఆచమనముచేసి; దేశ = ప్రదేశము; కాల = కాలము; ఆది = మున్నగువాని; పరిగణన = ఎంచిపలుకుట; చేసి = చేసి.
భావము:
అదేవిధంగా ఆ చక్రవర్తి వామనుని కుడి పాదాన్ని పిమ్మట ఎడమ పాదాన్ని కడిగాడు. పవిత్రమైన ఆ జలాలను నెత్తి మీద చల్లుకున్నాడు. ఆచమనం చేసాడు. దేశమూ కాలమూ మొదలైన వాటిని లెక్కించి (సంకల్పం చెప్పుకుని). . .