పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనునికి దాన మిచ్చుట

  •  
  •  
  •  

8-600-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దనుజలోకనాథు దయిత వింధ్యావళి
రాజవదన మదమరాళ గమన
వటుని కాళ్ళుఁ గడుగ వరహేమ ఘటమున
జలముఁ దెచ్చె భర్త సన్న యెఱిఁగి.

టీకా:

దనుజలోక = రాక్షసులందరికి; నాథు = రాజుయొక్క; దయిత = భార్య; వింధ్యావళి = వింధ్యావళి; రాజవదన = చంద్రముఖి; మదమరాళ = రాయంచలవంటి; గమన = నడకలు కలామె; వటుని = బ్రహ్మచారి; కాళ్ళు = పాదములు; కడుగ = కడుగుటకు; వర = శ్రేష్ఠమైన; హేమ = బంగారు; ఘటమునన్ = కలశముతో; జలమున్ = నీటిని; తెచ్చెన్ = తీసుకువచ్చెను; భర్త = పతి; సన్న = సైగను; ఎఱిగి = అర్థముచేసికొని.

భావము:

బలిచక్రవర్తి ఇల్లాలు వింధ్యావళి. ఆమె ముఖము చందమామ వంటిది. ఆమె నడకలు రాజహంస నడకలు. ఆ సందర్భంలో ఆమె భర్త సైగ గమనించింది. బ్రహ్మచారి కాళ్ళు కడగడానికి బంగారు కలశంతో నీళ్ళు తెచ్చింది.