పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : బలి దాన నిర్ణయము

  •  
  •  
  •  

8-595-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మేరువు దల క్రిం దైనను
బారావారంబు లింకఁ బాఱిన లోలో
ధారుణి రజమై పోయినఁ
దారాధ్వము బద్ధమైనఁ దప్పక యిత్తున్.

టీకా:

మేరువు = మేరుపర్వతము; తలక్రింద = తలకిందులు; ఐనన్ = అయిపోయినసరే; పారావారంబులు = సముద్రములు; ఇంకబాఱినన్ = ఇంకిపోయినసరే; లోలోన్ = లోపలలోపలే; ధారుణి = భూమండలము; రజము = పొడి; ఐపోయినన్ = అయిపోయినసరే; తారాధ్వము బద్దమైనన్ = ఆకాశము కుంచించుకుపోయినాసరే {తారాధ్వము బద్దమైనన్ - తారలకు అధ్వము (త్రోవ), ఆకాశము; బద్దము హద్దు పరిమితికలది, ఐనన్ - ఐనా సరే; అపరిమితమైన ఆకాశం పరిమితమైనది అగుట అంటే కుంచించుకుపోవుట జరిగినప్పటికి, గమనిక -బద్దలైనన్ అన లేదు బద్దమైనన్ అన్నారు కనుక ముక్కలవ్వడం కాడు కుంచించుకుపోవడమే సరి}; తప్పక = తప్పకుండ; ఇత్తున్ = ఇచ్చెదను.

భావము:

మేరుపర్వతం తిరగబడితే బడవచ్చు, సప్తసముద్రాలు ఇంకిపోతే పోవచ్చు, ఈ భూమండలం అంతా తనలో తనే పొడిపొడి అయితే కావచ్చు, పరిమితులులేని ఆకాశం హద్దులేర్పడి కుంచించుకుపోవుట జరిగితే జరగవచ్చు, కాని నేను మాత్రం ఇస్తానన్న దానం తప్పకుండా ఇస్తాను.