పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనుని సమాధానము

  •  
  •  
  •  

8-561-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తుర భూసురగతిఁ బురు
హూతాదులుఁ దన్ను వేఁడ నొగిఁ గొం డనుచున్
మీ తండ్రి యిచ్చె నాయువు
నేన్మాత్రుఁడవె నీవు నీలోకమునన్?

టీకా:

ఆతుర = ఆపదలోనున్న; భూసుర = బ్రాహ్మణుల; గతిన్ = వలె; పురుహూత = ఇంద్రుడు {పురుహూతుడు - యజ్ఞములందు ప్రచురమైన పిలుపు కలవాడు, ఇంద్రుడు}; ఆదులున్ = మొదలగువారు; తన్ను = తనను; వేడన్ = అర్థించగా; ఒగిన్ = ఒప్పుకొని; కొండు = తీసుకొనండి; అనుచున్ = అనుచు; మీ = మీ యొక్క; తండ్రి = నాన్న; ఇచ్చెన్ = ఇచ్చివేసెను; ఆయువున్ = ఆయుష్షును; ఏతన్మాత్రుడవె = వారికి తీసిపోనివాడవే కదా; నీవున్ = నీవుకూడ; ఈ = ఈ; లోకమునన్ = లోకములో.

భావము:

ఇక మీ తండ్రి మాత్రం సామాన్యుడా ఇంద్రాదులు బ్రహ్మణులవలె బాధ నటిస్తూ అర్థించగా సరే తీనుకోండి అంటూ మీ తండ్రి వారికి తన ఆయుస్సును దానమిచ్చేసాడు. నీవు కూడా వారికి ఏమాత్రం తీసిపోవు.