పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనుని భిక్ష కోరు మనుట

  •  
  •  
  •  

8-551-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని ధర్మయుక్తంబుగాఁ బలికిన వైరోచని వచనంబులు విని సంతోషించి యీశ్వరుం డిట్లనియె.

టీకా:

అని = అని; ధర్మయుక్తంబుగాన్ = ధర్మబద్ధముగా; పలికిన = అడిగిన; వైరోచని = బలిచక్రవర్తి {వైరోచని - విరోచనుని పుత్రుడు, బలి}; వచనంబులు = మాటలు; విని = విని; సంతోషించి = ఆనందించి; ఈశ్వరుండు = భగవంతుడు; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.

భావము:

ఇలా ధర్మబద్ధంగా బలిచక్రవర్తి పలికిన పలుకులకు సంతోషించిన భగవంతుడైన వామనుడు ఇలా అన్నాడు.