పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనుని భిక్షాగమనము

  •  
  •  
  •  

8-525-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రక్షీణ దివిజ వల్లభ
రక్షాపరతంత్రుఁ డగుచు రాజీవాక్షుం
డా క్షణమున బలి యింటికి
భిక్షాగమనంబు జేసెఁ బేదఱికముతోన్.

టీకా:

ప్రక్షీణ = మిక్కిలిదీనుడైన; దివిజవల్లభ = దేవేంద్రుని; రక్షా = కాపాడుటయందు; పరతంత్రుడు = నిమగ్నమైనవాడు; అగుచున్ = అగుచు; రాజీవాక్షుండు = హరి; ఆ = ఆ; క్షణమునన్ = వెంటనే; బలి = బలి యొక్క; ఇంటికిన్ = నివాసమున; కిన్ = కు; భిక్షా = యాచించుటకు; ఆగమనంబున్ = చేరుటను; చేసెన్ = చేసెను; పేదఱికము = పేదరికము; తోను = తోటి.

భావము:

వామనుడు మిక్కిలి దీనుడై ఉన్న దేవేంద్రుడిని కాపాడాలి అనుకున్నాడు. వెంటనే బలిచక్రవర్తిని దానం అడగడానికి నిశ్చయించుకుని, పేదరికాన్ని ప్రదర్శిస్తూ బలి నివాసానికి బయలుదేరాడు.