పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనుని విప్రుల సంభాషణ

  •  
  •  
  •  

8-524-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని తెలియంజెప్పిన బ్రాహ్మణులవచనంబు లాలకించి లోకంబులకుం బ్రీతి పుట్టింపఁ బయనంబై లాభవచనంబులుఁ గైకొని తల్లిఁదండ్రుల వీడ్కొని శుభముహూర్తంబునం గదిలి.

టీకా:

అని = అని; తెలియన్ = తెలియునట్లు; చెప్పిన = చెప్పగా; బ్రాహ్మణుల = విప్రుల; వచనంబులన్ = మాటలను; ఆలకించి = విని; లోకంబుల్ = లోకముల; కున్ = కు; ప్రీతి = మేలు; పుట్టింపన్ = కలిగించుటకై; పయనంబు = ప్రయాణము; ఐ = అయ్యి; లాభవచనంబులు = ఆశీర్వాదములు; కైకొని = తీసుకొని; తల్లిదండ్రులన్ = తల్లిదండ్రులనుండి; వీడ్కొని = పోవననుజ్ఞపొంది; శుభ = శుభకరమైన; ముహూర్తంబునన్ = సమయమునందు; కదిలి = బయలుదేరి.

భావము:

ఆ విధంగా తెలియపరచిన బ్రాహ్మణుల మాటలు విని లోకాలకు మేలు కలిగించడంకోసం వామనుడు ప్రయాణం అయ్యాడు. మంచి ముహుర్తములో, పెద్దల దీవనలూ తల్లితండ్రుల అనుమతి పొంది బయలుదేరాడు.