అష్టమ స్కంధము : వామనుని విప్రుల సంభాషణ
- ఉపకరణాలు:
ఇట్లు కృతకృత్యుండైన మాయామాణవకుండు దేశాంతర సమాగతు లగు బ్రాహ్మణులం గొందఱ నవలోకించి యిట్లనియె.
టీకా:
ఇట్లు = ఈ విధముగ; కృతకృత్యుండు = కార్యక్రమము పూర్తిచేసినవాడు; ఐన = అయిన; మాయా = కపట; మాణవకుడు = బాలకుడు {మాణవకుడు - వ్యు. మను + అణ్ (అల్పార్థే) + క. ణత్వమ్, నిపా, త.ప్ర., పిల్లవాడు, ఆంధ్ర శబ్ధ రత్నాకరము}; దేశాంతర = ఇతర ప్రాంతముల నుండి; సమాగతులు = వచ్చినవారు; అగు = అయిన; బ్రాహ్మణులన్ = విప్రులను; కొందఱన్ = కొంతమందిని; అవలోకించి = చూసి; ఇట్లు = ఇలా; అనియె = అడిగెను.
భావము:
ఈ విధంగా ఉపనయనం పూర్తై కృతకృత్యుడు అయిన మాయాబ్రహ్మచారి ఇతర దేశాలనుండి వచ్చిన కొందరు బ్రాహ్మణులను చూసి ఇలా అడిగాడు.