పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామను డవతరించుట

  •  
  •  
  •  

8-518-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భిక్షాపాత్రిక నిచ్చెను
క్షేశుఁడు వామనునకు; క్షయ మనుచున్
సాక్షాత్కరించి పెట్టెను
భిక్షునకు భవాని పూర్ణభిక్ష నరేంద్రా!

టీకా:

భిక్షాపాత్రికన్ = చిన్నభిక్షాపాత్రను; ఇచ్చెను = ఇచ్చెను; యక్షేశుడు = కుబేరుడు; వామనున్ = వామనుని; కున్ = కి; అక్షయము = అక్షయము; అనుచున్ = అనుచు; సాక్షాత్కరించి = ప్రత్యక్షమై; పెట్టెను = పెట్టెను; భిక్షున్ = బ్రహ్మచారి; కున్ = కి; భవాని = అన్నపూర్ణాదేవి; పూర్ణ = పూర్తి; భిక్షన్ = భిక్షను; నరేంద్రా = రాజా.

భావము:

పరీక్షన్మహారాజా! యక్షుల ప్రభువు అయిన కుబేరుడు వామనుడికి భిక్షాపాత్ర ఇచ్చాడు. జగన్మాత పార్వతీదేవి ప్రత్యక్షమై అక్షయం అంటూ ఆ బ్రహ్మచారికి పూర్ణభిక్ష పెట్టింది.