పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామను డవతరించుట

  •  
  •  
  •  

8-516-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"పురు డీ బోటికి నిందిర
పురు డంబిక గాక యొరులు పురుడే?" యనుచున్
బురుటాలికిఁ బది దినములు
పురుడు ప్రవర్తించి రెలమిఁ బుణ్యపు గరితల్.

టీకా:

పురుడు = సమానురాలు, సాటి; ఈ = ఈ; బోటి = ఇల్లాలు; కిన్ = కి; ఇందిర = లక్ష్మీదేవి; పురుడు = సమానురాలు, సాటి; అంబిక = పార్వతీదేవి; కాక = అంతే తప్పించి; ఒరులు = ఇతరులు; పురుడే = సమానులా, సాటికాగలరా; అనుచున్ = అనుచు; పురుటాలి = బాలంతరాలి; కిన్ = కి; పది = పది (10); దినములు = రోజులు; పురుడు = పురుటిశుద్ధి; ప్రవర్తించిరి = నడిపించిరి; ఎలమిన్ = అతిశయించి; పుణ్యపుగరితల్ = ముత్తైదువలు.

భావము:

“ఈ ఇల్లాలికి లక్ష్మి పార్వతులే సరిజోడియైన వారు. ఇతరులు సరిజోడి కాదు.” అంటూ పెద్ద ముత్తైదువలు బాలెంతరాలైన అదితికి పది రోజులు పురుడు నడిపినారు.