పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామను డవతరించుట

  •  
  •  
  •  

8-513-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత నవ్విభుండు సాయుధసాలంకారంబగు తన దివ్యరూపంబు నుజ్జగించి రూపాంతరం బంగీకరించి కపటవటు చందంబున నుపనయనవయస్కుండైన వామన బాలకుండై తల్లి ముంగటఁ గుమార సముచితాలాపంబు లాడుఁచు గ్రీడించు సమయంబున నదితియుం దనయ విలోకన పరిణామ పారవశ్యంబున.
^విష్ణు మూర్తి పరికరాదులు

టీకా:

అంతన్ = అంతట; ఆ = ఆ; విభుండు = భగవంతుడు; సాయుధ = ఆయుధములుగల; సాలంకారంబు = అలంకారములుగలది; అగు = అయిన; తన = తన యొక్క; దివ్య = దివ్యమైన; రూపంబున్ = స్వరూపమును; ఉజ్జగించి = ఉపసంహరించి; రూప = స్వరూపమునందు; అంతరంబున్ = మార్పును; అంగీకరించి = స్వీకరించి; కపట = మాయా; వటు = బ్రహ్మచారి; చందంబునన్ = వలె; ఉపనయన = వడుగు చేయదగిన; వయస్కుండు = వయసు గలవానిగ; ఐన = అయినట్టి; వామన = పొట్టి; బాలకుండు = చిన్నబాలుడు; ఐ = అయ్యి; తల్లి = అమ్మకు; ముంగటన్ = ఎదురుగ; కుమార = పుత్రునికి; సముచిత = తగిన; ఆలాపంబులు = పలుకులు; ఆడుచున్ = పలుకుచు; క్రీడించు = విహరించెడి; సమయంబునన్ = సమయమునందు; అదితియున్ = అదితి; తనయ = పుత్రుని; విలోకన = చూచుటవలన; పరిణామ = కలిగిన; పారవశ్యంబునన్ = మైమరపుతో.

భావము:

అటుపిమ్మట వామనుడు ఆయుధాలూ అలంకారాలు కలిగిన తన దివ్య రూపాన్ని వదిలిపెట్టి, కపట బ్రహ్మచారిగా మారురూపాన్ని పొందాడు. పొట్టి బాలుడుగా, వడుగు చేయదగిన వయస్సు కలవాడుగా అయ్యాడు. ఆ కొడుకుని చూచి అదితి ఆనందంతో మైమరచి, పారవశ్యమున. . .