పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామను డవతరించుట

  •  
  •  
  •  

8-512-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

" మహానుభావుఁ డెట్లింత కాలంబు
నుదర మందు నిలిచి యుండె" ననుచు
దితి వెఱఁగుపడియె నానంద జయశబ్ద
ములను గశ్యపుండు మొగి నుతించె.

టీకా:

ఈ = ఈ యొక్క; మహానుభావుడు = గొప్పవాడు; ఎట్లు = ఎలా; ఇంత = ఇన్ని; కాలంబు = రోజులు; ఉదరము = గర్భము; అందున్ = లో; నిలిచి = స్థిరముగ; ఉండెన్ = ఉన్నాడు; అనుచున్ = అనుచు; అదితి = అదితి; వెఱగు = ఆశ్చర్య; పడియెన్ = పోయెను; ఆనంద = సంతోషపు; ఆనంద = ఆనందపు; జయశబ్దములనున్ = జయజయధ్వానములను; కశ్యపుండు = కశ్యపుడు; మొగిన్ = పూని; నుతించెన్ = స్తుతించెను.

భావము:

“ఇంతటి మహానుభావుడు ఇంతకాలమూ నా కడుపులో ఎలా ఉన్నాడా” అని వామనుడిని చూసి అదితి ఆశ్చర్యపడింది. ఆనందంతో కూడిన జయజయ శబ్దాలతో కశ్యపుడు స్వామిని పూని సంస్తుతించాడు.