పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామను డవతరించుట

  •  
  •  
  •  

8-510-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ముంపుఁగొని విరుల వానల
జొంపంబులు గురియు సురలు, సుమనోమధువుల్
తుంర లెగయఁ బరాగపు
రొంపుల భూభాగమతి నిరూషిత మయ్యెన్.

టీకా:

ముంపుగొని = గుంపులుగూడి; విరుల = పూల; వానలన్ = వానలను; జొంపంబులన్ = పొదరిండ్లు; కురియు = వర్షించెను; సురలు = దేవతలు; సుమనస్ = పూల; మధువుల్ = మకరందము; తుంపరలు = బిందువులు; ఎగయన్ = ఎగురుతుండగ; పరాగపు = పుప్పొటి; రొంపులన్ = గుట్టలతో, బురదలతో; భూభాగము = భూమండలము; అతి = మిక్కిలి; నిరూషితము = నిండిపోయినది; అయ్యెన్ = అయినది.

భావము:

వామనుడు జన్మించడంతో, పొదరిండ్లు విశేషంగా పూలజల్లులు విరజల్లాయి. దేవతలు కురిపించిన పూలవానల మకరంద బిందువులు అంతటా వ్యాపించాయి. పుప్పొడుల కుప్పలతో భూభాగం నిండిపోయింది.