పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : అమృతము పంచుట

  •  
  •  
  •  

8-311-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శాంతా లోకనములు
నా శీతల భాషణములు నా లాలితముల్
రాశి పరంపర లగుచుం
బాములై వారి నోళ్ళు బంధించె నృపా!

టీకా:

ఆ = ఆ; శాంత = శాంతమైన; ఆలోకనములున్ = చూపులు; శీతల = చల్లని; భాషణములున్ = మాటలు; ఆ = ఆ; లాలితముల్ = సౌకుమార్యములు; రాశి = బహుళ; పరంపరలు = వరుసలుగా; అగుచున్ = అగుచు; పాశములు = తాళ్లవలె; ఐ = అయ్యి; వారి = వారి యొక్క; నోళ్ళు = నోళ్ళను; బంధించెన్ = కట్టివేసినవి; నృపా = రాజా.

భావము:

ఓ రాజా పరీక్షిత్తూ! ఆ జగన్మోహినీదేవి మెరుగారు చూపులు, చల్లని పలుకులు, బుజ్జగింపులు కట్టుతాళ్ళలా సాగి సాగి రాక్షసుల నోళ్ళను కట్టేశాయి.