పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : గరళ భక్షణము

  •  
  •  
  •  

8-232-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని మఱియు నభినందించుచున్న ప్రజాపతి ముఖ్యులం గని సకల భూత సముండగు నద్దేవదేవుండుఁ దన ప్రియసతి కిట్లనియె.

టీకా:

అని = అని; మఱియున్ = ఇంకను; అభి = మిక్కిలిగ; నందించుచున్న = స్తోత్రముచేయుచున్న; ప్రజాపతి = బ్రహ్మదేవుడు; ముఖ్యులన్ = మున్నగువారిని; కని = చూసి; సకల = సర్వ; భూత = ప్రాణులను; సముండు = సమానంగా చూచెడివాడు; అగు = అయిన; ఆ = ఆ; దేవుండు = దేవుడు; తన = తన యొక్క; ప్రియ = ఇష్టమైన; సతి = భార్య; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇలా తనను స్తుతిస్తున్న బ్రహ్మాది దేవతలను చూసి, సర్వప్రాణులనూ సమానంగా ఆదరించే పరమ విభుడు, శంకరుడు తన అనుంగు భార్యతో ఇలా అన్నాడు....

8-233-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"కంటే జగముల దుఃఖము;
వింటే జలజనిత విషము వేఁడిమి; ప్రభువై
యుంకు నార్తుల యాపద
గెంటింపఁగ ఫలము గాదె కీర్తి మృగాక్షీ!

టీకా:

కంటే = చూసితివా; జగముల = లోకముల యొక్క; దుఃఖమున్ = దుఃఖమును; వింటే = విన్నావా; జల = నీటిలో; జనిత = పుట్టిన; విషము = విషము యొక్క; వేడిమిన్ = సెగ; ప్రభువు = విభుడు; ఐ = అయ్యి; ఉంటన్ = ఉన్నందుల; కున్ = కు; ఆర్తుల = దుఃఖితుల; ఆపదన్ = కష్టమును; గెంటింపగన్ = తొలగించుటవలన; ఫలము = ఫలితముగా; కాదె = కలుగదా; కీర్తి = కీర్తి; మృగాక్షీ = సుందరీ {మృగాక్షి - మృగ (లేడి)వంటి అక్షి (కన్నులు కలామె), అందమైన స్త్రీ}.

భావము:

“ఓ లేడి కన్నుల సుందరీ! సతీదేవీ! చూడు లోకాలు ఎంత దుఃఖంలో ఉన్నాయో! ఎంత తీవ్ర ప్రభావంతో ఉన్నాయో! నీళ్ళలో పుట్టినది ఆ హాలాహల విషం. శక్తిసామర్థ్యాలుగల ప్రభువు ప్రజల కష్టాన్ని తొలగించాలి. దానితో కీర్తి వస్తుంది.

8-234-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రాణేచ్ఛ వచ్చి చొచ్చిన
ప్రాణుల రక్షింపవలయుఁ బ్రభువుల కెల్లం
బ్రాణుల కిత్తురు సాధులు
బ్రాణంబులు నిమిష భంగుము లని మగువా!

టీకా:

ప్రాణేచ్ఛన్ = ప్రాణముకాపాడగోరి; వచ్చి = వచ్చి; చొచ్చిన = ఆశ్రయించిన; ప్రాణులన్ = జీవులను; రక్షింపవలయున్ = కాపాడవలెను; ప్రభుల్ = ప్రభువుల; కున్ = కు; ఎల్లన్ = అందరకు; ప్రాణుల్ = జీవులను; కున్ = కు; ఇత్తురు = ఇచ్చెదరు; సాధులు = ఉత్తములు; ప్రాణంబులున్ = ప్రాణములను; నిమిష = నిమిషములో; భంగురములు = నశించునవి; అని = అని; మగువా = ఇంతీ.

భావము:

ఓ మగువా! పార్వతీ దేవి! ప్రాణభయంతో ఆశ్రయించిన జీవులను కాపాడటం ప్రభువుల కర్తవ్యం. ప్రాణాలు నిమిషంలో నశించి పోయేవి. అందువలనే ఉత్తములు ప్రాణులకు తమ ప్రాణాలను అర్పించుటకు సైతం వెనుకాడరు.

8-235-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హితము జేయు నెవ్వఁడు
మ హితుం డగును భూత పంచకమునకుం
హితమె పరమ ధర్మము
హితునకు నెదురులేదు ర్వేందుముఖీ!

టీకా:

పర = ఇతరులకు; హితమున్ = సహాయమును; చేయున్ = చేయును; ఎవ్వడు = ఎవరైతే; పరమ = అత్యంత; హితుండు = ప్రీతిపాత్రుడు; అగును = అగును; భూతపంచకమునకు = పంచభూతములకు {పంచభూతములు - పృథ్వి, తేజస్సు, జలము, వాయువు, ఆకాశము.}; పరహితమె = పరోపకారము చేయుటే; పరమ = అత్యుత్తమ; ధర్మము = ధర్మము; పరహితున్ = పరోపకారి; కున్ = కి; ఎదురు = తిరుగు; లేదు = లేదు; పర్వేందుముఖీ = సుందరీ, పార్వతీ {పర్వేందుముఖి - పర్వము (పున్నమి) నాటి ఇందు (చంద్రునివంటి) ముఖి (ముఖము కలది), సౌందర్యవతి}.

భావము:

ఓ సౌందర్యరాశీ! పార్వతీదేవీ!ఇతరులకు సాయం చేసేవాడు, పంచభూతాలకు పరమాప్తుడు అయి ఉంటాడు. పరోపకారమే పరమోత్తమ ధర్మం. పరోపకారికి ఎక్కడా తిరుగు లేదు.

8-236-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రి మది నానందించిన
రిణాక్షి! జగంబులెల్ల నానందించున్
రియును జగములు మెచ్చఁగ
ళము వారించు టొప్పుఁ మలదళాక్షీ!

టీకా:

హరి = విష్ణువు; మదిన్ = మనసును; ఆనందించినన్ = ఆనందపడితే; హరిణాక్షీ = సుందరీ {హరిణాక్షి - హరిణము (లేడి)వంటి అక్షి (కన్నులుగలామె), అందమైన స్త్రీ}; జగంబుల్ = లోకములు; ఎల్లన్ = సమస్తమును; ఆనందించున్ = సంతోషించును; హరియును = విష్ణువు; జగములున్ = లోకములు; మెచ్చగన్ = సంతోషించగా; గరళమున్ = విషమును; వారించుట = అదుపుచేయుట; ఒప్పున్ = తగును; కమలదళాక్షీ = సుందరీ {కమలదళాక్షి - కమలముల దళ (రేకుల) వంటి అక్షి (కన్నులుగలామె), అందమైనస్త్రీ}.

భావము:

ఓ మృగాక్షీ! ఉమాదేవీ! ఓ పద్మాక్షి! విష్ణుమూర్తిని తృప్తిపరిస్తే, లోకాలు అన్నీ తృప్తి చెందుతాయి. ఆ విష్ణుమూర్తీ, లోకాలూ సంతోషించేలా హాలాహల విషాన్ని అదుపు చేయడం మంచిపని.

8-237-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శిక్షింతు హాలహలమును
క్షింతును మధురసూక్ష్మ లరసము క్రియన్
క్షింతుఁ బ్రాణి కోట్లను
వీక్షింపుము నీవు నేఁడు వికచాబ్జముఖీ!"

టీకా:

శిక్షింతున్ = దండించెదను; హాలాహలమున్ = హాలాహలవిషమును; భక్షింతును = ఆరగించెదను; మధుర = తీయని; సూక్ష్మ = చిన్న; ఫల = పండు; రసము = రసము; క్రియన్ = వలె; రక్షింతున్ = కాపాడెదను; ప్రాణి = జీవ; కోట్లను = జాలమును; వీక్షింపుము = చూడుము; నీవు = నీవు; నేడు = ఇప్పుడు; వికచాబ్జముఖీ = సుందరీ {వికచాబ్జముఖి - వికచ (వికసించిన) అబ్జ (పద్మము) వంటి ముఖి (ముఖముగలామె), అందమైన స్త్రీ}.

భావము:

వికసించిన పద్మం వంటి మోము గల సతీదేవీ! హాలాహలాన్ని దండిస్తాను. చాలా చిన్న తియ్యని పండు రసంవలె హాలాహలాన్ని మింగుతాను. ఇవాళ ఈ జీవలోకం సమస్తాన్ని కాపాడతాను. నువ్వు చూస్తూ ఉండు.

8-238-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పలికిన ప్రాణవల్లభునకు వల్లభ "దేవా! దేవర చిత్తంబు కొలంది నవధరింతురు గాక!" యని పలికె" నని చెప్పిన యమ్మునీంద్రునకు నరేంద్రుం డిట్లనియె.

టీకా:

అని = అని; పలికిన = అనిన; ప్రాణవల్లభున్ = భర్త; కున్ = కు; వల్లభ = భార్య; దేవా = దేవా; దేవర = ప్రభువు యొక్క; చిత్తంబు = మనసు; కొలందిన్ = ప్రకారము; అవధరింతుగాక = ధరింతురుగాక; అని = అని; పలికెన్ = అనెను; అని = అని; చెప్పిన = పలుకగా; ఆ = ఆ; ముని = మునులలో; ఇంద్రున్ = ఉత్తమున; కున్ = కు; నరేంద్రుడు = రాజు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇలా “హాలాహలం మింగుతాను” అంటున్న తన భర్త అయిన భవునితో, ప్రియభార్య భవానీదేవి ఇలా అంటోంది. “స్వామీ! మీ మనస్సుకు తగినట్లు చేయండి.” ఇలా చెప్తున్న శుక మహర్షితో పరీక్షిన్మహారాజు ఇలా అడిగాడు.

8-239-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"రన్ లోకహితార్థమంచు నభవుం "డౌఁ గాక" యం చాడెఁ బో
రుల్ భీతిని "మ్రింగవే" యనిరి వో యంభోజగర్భాదులుం
ముఁ గావన్ హర! "లెమ్ము లెమ్మనిరి" వో తాఁ జూచి కన్గంట న
య్యు ప్రాణేశ్వరు నెట్లు మ్రింగుమనె నయ్యుగ్రానలజ్వాలలన్."

టీకా:

అమరన్ = చక్కగా; లోక = లోకములకు; హిత = మేలు; అర్థము = కలిగించును; అంచున్ = అనుచు; భవుండు = శంకరుడు {భవుడు - సమస్తము తానే యైనవాడు, శివుడు}; ఔగాక = అలాగే, అగుగాక; అంచున్ = అనుచు; ఆడెబో = పలికితే పలికి ఉండవచ్చు; అమరుల్ = దేవతలు; భీతిని = భయముతో; మ్రింగవే = మ్రింగేయమని; అనిరివో = అంటే అని ఉండవచ్చు; అంభోజగర్భ = బ్రహ్మదేవుడు {అంభోజగర్భుడు - అంభోజము (పద్మము) నందు గర్భుడు (పుట్టినవాడు), బ్రహ్మ}; ఆదులున్ = మొదలగువారు; తమున్ = తమను; కావన్ = కాపాడుడకు; హర = శంకరుడు; లెమ్ములెమ్ము = ప్రారంభింపుము; అనిరివో = అంటే అని ఉండవచ్చు; తాన్ = అమె; చూచి = చూసి; కన్గంటన్ = కన్నులార చూస్తూ; ఆ = ఆ; ఉమ = ఉమాదేవి; ప్రాణేశ్వరున్ = భర్తను; ఎట్లు = ఏ విధముగ; మ్రింగుము = తినుము; అనెన్ = అనెను; ఆ = ఆ; ఉగ్ర = భీకరమైన; అనల = అగ్ని; జ్వాలలన్ = మంటలను.

భావము:

“భయం చెంది అమరత్వం కోరుతున్న దేవతలు హాలాహలాన్ని “మ్రింగు” అని కోరారే అనుకో! పద్మం గర్భంలో పుట్టిన బ్రహ్మదేవుడు మున్నగువారు తమను కాపాడటానికి “పూనుకోవయ్యా హరా!” అని వేడుకున్నారే అనుకో! ఆ పరమ శివుడు లోకాలకు మేలు జరుగుతుంది కదా అని “సరే” అన్నాడే అనుకో! తన ప్రాణేశ్వరుడైన పరమేశ్వరుడు ఆది అన్నది లేనివాడు కావచ్చు అనుకో, అయినా పార్వతీ దేవి కంటి ఎదురుగా భయంకరమైన అగ్ని జ్వాలలతో కూడిన హాలాహలాన్ని చూస్తూ, “మింగు” అని పరమశివునికి చెప్పింది.”

8-240-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన శుకుం డిట్లనియె.

టీకా:

అనిన = అనగా; శుకుండు = శుకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇలా అడిగిన పరీక్షిత్తుతో శుకముని ఇలా అన్నాడు...

8-241-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"మ్రింగెడి వాఁడు విభుం డని
మ్రింగెడిదియు గరళ మనియు మే లని ప్రజకున్
మ్రింగు మనె సర్వమంగళ
మంళసూత్రంబు నెంత ది నమ్మినదో!

టీకా:

మ్రింగెడి = మింగుతున్న; వాడు = అతను; విభుండు = భర్త; అని = అని; మ్రింగెడిది = మింగేది; గరళమున్ = విషము; అనియున్ = అనితెలిసియు; మేలు = మంచికలుగుతుంది; అని = అని; ప్రజ = లోకుల; కున్ = కు; మ్రింగుము = తినుము; అనెన్ = అనెను; సర్వమంగళ = ఉమాదేవి {సర్వమంగళ - సర్వులకు మంగళము కలిగించునది, పార్వతి}; మంగళసూత్రంబున్ = తాళిబొట్టును; ఎంతన్ = ఎంతగా; మదిన్ = మనసునందు; నమ్మినదో = నమ్మెనోకదా.

భావము:

ఆమె సర్వమంగళ కదా మరి, అంతేకాక ఆమె తన మనస్సులో తన మంగళసూత్రాన్ని అంత గట్టిగా నమ్మింది. కనుకనే మింగేవాడు తన భర్త అని, మింగేది విషం అని తెలిసి కూడ లోకకల్యాణంతో అందరికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే పార్వతీదేవి హాలాహలాన్ని మింగమని పరమ శివునికి చెప్పింది.
గమనిక -(ఇది అసామాన్య శబ్దార్థసౌందర్యభరితమైన పద్యం. శివుడు లోకాలన్నిటినీ దహించి వేస్తున్న ఆ హాలాహలాన్ని మింగాడు అనగానే కాపాడమని అడిగిన గొప్పవాళ్ళు బ్రహ్మాది దేవతలు కనుక లోకమంగళం కోసం మింగాడు. సరే మరి ఆయన భార్య అడ్డుపడకుండా ఎలా ఒప్పుకుంది? భార్య తన భర్త ఇంతటి సాహసానికి పూనుకుంటే చూస్తూ ఊరుకుంటుందా! అందులో ఈవిడ భర్త శరీరంలో సగం పంచుకొన్నావిడ. ఇదే అనుమానం పరీక్షిత్తు అడిగితే శుకుడు చెప్పిన సమాదానం ఈ పద్యం. మ్రింగ్ మ్రింగ్ అంటూ ఎలా ధ్వనిస్తోందో. (పూర్ణానుస్వరపూర్వక గకార ప్రాస) అటుపక్క ఆ గరళానికి, మంగళ మంగళ అంటూ సమాధానాలను వేసిన తీరు పద్యానికి ఎంత అందాన్నిచ్చిందో! మరల మరల ప్రయోగించిన గ’, ళ’ లు, మింగటంలో గళం లోనే ఆపేసాడు అని, శక్తి స్వరూపిణి స్త్రీతో పాలుపంచుకుంటుంటే ఎంతటి కాలకూటవిషం ఎదురొచ్చినా మంగళానికి లోటు ఉండదు అని స్పురిస్తోంది.)

8-242-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చుట్టున్ సురసంఘముల్ జయజయధ్వానంబులన్ బొబ్బిడన్
గంభీర రవంబుతో శివుఁడు "లోద్రోహి! హుం! పోకు ర"
మ్మని కెంగేలఁ దెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలం
ని సర్వంకషమున్ మహావిషము నాహారించె హేలాగతిన్.

టీకా:

తన = తన యొక్క; చుట్టున్ = చుట్టూ; సుర = దేవతల; సంఘముల్ = సమూహములు; జయజయ = జయజయ యనెడి; ధ్వానంబులన్ = శబ్దములతో; బొబ్బన్ = కేకలు; ఇడన్ = వేయగా; ఘన = మిక్కిలి; గంభీర = గంభీరమైన; రవంబు = శబ్దము; తోన్ = తో; శివుడు = శంకరుడు {శివుడు - మంగళప్రదుడు, శంకరుడు}; లోక = లోకములకు; ద్రోహి = హానికలిగించెడివాడా; హుం = హుం; పోకు = వెళ్ళిపోకుము; రమ్ము = రా; అని = అని; కెంగేలన్ = ఎఱ్ఱని అరచేతితో; తెమల్చి = కదిల్చి; కూర్చి = కలిపి; కడిగాన్ = ముద్దగా; అంకించి = చేసి; జంబూ = నేరేడు; ఫలంబు = పండు; అని = వలెగ్రహించి; సర్వంకషమున్ = అన్నిటిని నాశనము చేయునది; మహా = గొప్ప; విషమున్ = విషమును; ఆహారించెన్ = మింగెను; హేలా = క్రీడ; గతిన్ = వలె.

భావము:

దేవతలు మహాదేవుని చుట్టూ చేరి “జయ జయ” ధ్వానాలు చేశారు. పరమ శివుడు మేఘ గంభీర కంఠస్వరంతో “ఓహో! లోకద్రోహీ! పారిపోకు రా! రా!” అని, సర్వనాశనము చేసే ఆ హాలాహాల మహావిషాన్ని తన చేయి చాచి పట్టుకుని, ముద్ద చేసి, నేరేడు పండునోట్లో వేసుకున్నంత సుళువుగా, విలాసంగా భుజించాడు.

8-243-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అయ్యవిరళ మహాగరళదహన పాన సమయంబున.

టీకా:

ఆ = ఆ; అవిరళ = అంతులేని, ప్రచండమైన; మహా = గొప్ప; గరళ = విష; దహన = అగ్నిని; పాన = తాగెడి; సమయంబునన్ = సమయము నందు.

భావము:

పరమ శివుడు అలా అతి భీకరమైన మహా విషాగ్నిని మ్రింగే సమయంలో. . . .

8-244-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లం బాఱవు పాఁప పేరు; లొడలన్ ర్మాంబుజాలంబు పు
ట్టదు; నేత్రంబులు నెఱ్ఱ గావు; నిజజూటా చంద్రుఁడుం గందఁడున్;
నాంభోజము వాడ; దా విషము నాహ్వానించుచో డాయుచోఁ
దిలుండై కడి జేయుచోఁ దిగుచుచో క్షించుచో మ్రింగుచోన్.

టీకా:

కదలన్ = కదలి; పాఱవు = పోవు; పాప = పాముల; పేరుల్ = దండలు; ఒడలన్ = దేహముపైన; ఘర్మ = చెమట; అంబు = నీటిబిందువుల; జాలంబున్ = సమూహముకూడ; పుట్టదు = పుట్టుటలేదు; నేత్రంబులున్ = కన్నులైనను; ఎఱ్రన్ = ఎఱ్ఱగా; కావు = కావు; నిజ = తన యొక్క; జూటా = జటముడి యందలి; చంద్రుడున్ = చంద్రుడుకూడ; కందడున్ = ఎఱ్ఱబారిపోడు; వదన = మోము యనెడి; అంభోజము = పద్మము; వాడదున్ = వాడిపోదు; ఆ = ఆ; విషమున్ = విషమును; ఆహ్వానించుచోన్ = స్వీకరించేటప్పుడు; డాయుచో = దగ్గరకుచేరేటప్పుడు; పదిలుండు = స్థిరుడు; ఐ = అయ్యి; కడిన్ = ముద్దగా; చేయుచోన్ = చేసేటప్పుడు; తిగుచుచోన్ = తీసుకొనేటప్పుడు; భక్షించుచోన్ = తినేటప్పుడు; మ్రింగుచోన్ = మింగేటప్పుడు.

భావము:

మహాదేవుడు ప్రచండమైన ఆ హాలాహలాగ్నిని ఆహ్వానిస్తున్నప్పుడు, దానిని సమిపించే టప్పుడు, పదిలంగా పట్టుకుని ముద్దచేసేటప్పుడు, నోట్లో ఉంచుకునేటప్పుడు, తినేటప్పుడు, మింగేటప్పుడు కాని, ఆయన కంఠహారాలుగా ఉన్న సర్పాలు కదలలేదు, చెమటలు గ్రమ్మ లేదు, కన్నులు ఎఱ్ఱబార లేదు, సిగలోని చంద్రుడు కందిపోలేదు, ఆయన ముఖ పద్మం వడల లేదు.

8-245-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రము లోకంబులకును
నం బగు టెఱిఁగి శివుఁడు టుల విషాగ్నిం
గుదురుకొనఁ గంఠబిలమున
దిలంబుగ నిలిపె సూక్ష్మలరసము క్రియన్.

టీకా:

ఉదరము = కడుపు; లోకంబుల్ = లోకముల; కును = కు; సదనంబు = నివాసము; అగుటన్ = అయ్య ఉండుటను; ఎఱిగి = తెలిసి; శివుడు = శంకరుడు; చటుల = భయంకరమైన; విష = విషము యొక్క; అగ్నిన్ = అగ్నిని; కుదురుకొనగన్ = కుదురుగానుండునట్లు; కంఠ = గొంతు యనెడి; బిలమునన్ = గుహ యందు; పదిలంబుగా = జాగ్రత్తగా; నిలిపెన్ = కదలకుండ ఉంచెను; సూక్ష్మ = చిన్న; ఫలరసము = పండురసము; క్రియన్ = వలె.

భావము:

పరమేశ్వరుడి ఉదరం సమస్త లోకాలకూ నివాసం కనుక. ఆయన ఆ భీకరమైన విషాగ్నిని ఉదరంలోనికి పోనివ్వకుండా, ఏదో చిన్న పండును ఉంచుకున్నట్లుగా, తన కంఠ బిలంలో కుదురుగా ఉండేలా జాగ్రత్తగా నిలుపుకున్నాడు.

8-246-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మెచ్చిన మచ్చిక గలిగిన
నిచ్చిన నీవచ్చుఁ గాక యిచ్చ నొరులకుం
జిచ్చుఁ గడిగొనఁగ వచ్చునె
చిచ్చఱరూ పచ్చుపడిన శివునకుఁ దక్కన్.

టీకా:

మెచ్చిన = శ్లాఘించినచో; మచ్చిక = నచ్చుట; కలిగినన్ = కలిగినచో; ఇచ్చినన్ = ఇస్తే; ఈవచ్చు = ఇవ్వచ్చు; కాక = కాని; ఇచ్చన్ = ఇష్టపూర్తిగా; ఒరుల్ = ఇతరుల; కున్ = కు; చిచ్చున్ = అగ్నిని; కడిగొనగన్ = తినబోవుటకు; వచ్చునె = సాధ్యమా; చిచ్చఱ = అగ్నివంటిరౌద్రము; రూపచ్చుపడిన = మూర్తీభవించిన; శివున్ = శంకరుని; కున్ = కి; తక్కన్ = తప్పించి.

భావము:

మెచ్చినప్పుడూ, నచ్చినప్పుడూ ఇచ్చవచ్చినంత ఎవరికైనా ఇవ్వవచ్చు. కానీ, ఇతరుల కోసం భగభగ మండే చిచ్చును కోరి కబళంచేసి మింగటం అన్నది, ఆ చిచ్చర కన్ను గల పరమ శివుడైన హరునికి తప్పించి ఎవరికి సాధ్యం అవుతుంది?

8-247-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుఁడు గళమునందు హాలహలము బెట్టఁ
ప్పుఁ గలిగి తొడవు రణి నొప్పె;
సాధురక్షణంబు జ్జనులకు నెన్న
భూషణంబు గాదె భూవరేంద్ర!

టీకా:

హరుడు = శంకరుడు {హరుడు - ప్రళయకాలమున సర్వమును హరించువాడు, భక్తులపీడను హరించువాడు, శివుడు}; గళమున్ = కంఠము; అందున్ = లో; హాలాహలమున్ = హాలాహలవిషమును; పెట్టన్ = పెట్టుటచే; కప్పు = నలుపు; కలిగి = కలిగి; తొడవు = అలంకారము; కరణిన్ = వలె; ఒప్పెన్ = చక్కగనుండెను; సాధు = సాధుజనుల; రక్షణంబున్ = కాపాడుట; సజ్జనుల్ = మంచివారి; కున్ = కి; ఎన్నన్ = ఎంచిచూడగా; భూషణంబు = అలంకారము; కాదె = కదా ఏమిటి; భూవరేంద్ర = మహారాజా {భూవరేంద్రుడు - భూవరుల (రాజుల)లో వరుడు (శ్రేష్ఠుడు), మహారాజు}.

భావము:

ఓ రాజోత్తమా! పరీక్షిత్తూ! హరుడు హాలాహలాన్ని కడుపులోకి మ్రింగకుండా కుత్తుకలో నిలుపుకోవడంతో ఆయన కంఠంమీద నల్లమచ్చ ఏర్పడి ఒక ఆభరణంగా నప్పింది. ఆలోచించి చూస్తే ఉత్తములకు సాధు సంరక్షణ అలంకారమే కదా.

8-248-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తదనంతరంబ

టీకా:

తదనంతరంబ = ఆ తరువాత.

భావము:

అలా హరుడు హాలాహలం భుజించాక. . .

8-249-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ళంబుఁ గంఠబిలమున
రుఁడు ధరించుటకు మెచ్చి యౌ నౌ ననుచున్
రియు విరించియు నుమయును
సునాథుఁడుఁ బొగడి రంత సుస్థిరమతితోన్.

టీకా:

గరళంబున్ = విషమును; కంఠబిలమునన్ = గొంతుకలో; హరుడు = శివుడు; ధరించుట = తాల్చుట; కున్ = కు; మెచ్చి = మెచ్చుకొని; ఔనౌన్ = మేలుమేలు; అనుచున్ = అనుచు; హరియున్ = విష్ణుమూర్తి; విరించియును = బ్రహ్మదేవుడు {విరించి - హంసలచే వహింపబడువాడు, బ్రహ్మ}; ఉమయును = ఉమాదేవి {ఉమ - రక్షించునట్టి యామె, పార్వతి}; సురనాథుడు = ఇంద్రుడు {సురనాథుడు - సుర (దేవతలకు) నాథుడు (ప్రభువు), ఇంద్రుడు}; పొగిడిరి = స్తుతించిరి; అంతన్ = అంతట; సుస్థిర = నిలకడగల; మతి = మనస్సుల; తోన్ = తోటి.

భావము:

శంకరుడు విషాగ్నిని తన గొంతులో ధరించటం చూసి, విష్ణువు,బ్రహ్మ, పార్వతీదేవి, దేవేంద్రుడు అచ్చమైన మనస్సుతో“మేలు, మేలు” అని మెచ్చుకున్నారు.

8-250-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హాలాహల భక్షణ కథ
హేలాగతి విన్న వ్రాయ నెలమిఁ బఠింపన్
వ్యాళానల వృశ్చికముల
పాలై చెడ రెట్టిజనులు యవిరహితులై.

టీకా:

హాలాహల = హాలాహలమును; భక్షణ = మింగిన; కథన్ = వృత్తాంతమును; హేలాగతిన్ = సంతోషముగా; విన్నన్ = వినినచో; వ్రాయన్ = వ్రాసినచో; ఎలమిన్ = పూనికతో; పఠించినన్ = చదివినచో; వ్యాళ = సర్పముల; అనల = అగ్ని; వృశ్చికములన్ = తేళ్లకు; పాలు = గురి; ఐ = అయ్యి; చెడరు = చెడిపోరు; ఎట్టి = ఎటువంటి; జనులున్ = వారైనను; భయ = భయము; విరహితులు = పూర్తిగాపోయినవారు; ఐ = అయ్యి.

భావము:

ఎలాంటి వారైనా ఈ హాలాహల భక్షణం కథను మనస్ఫూర్తిగా విన్నా, వ్రాసినా, చదివినా భయానికి గురికారు. వారికి పాముల వల్ల, తేళ్ళ వలన, అగ్ని వల్ల కష్టాలు కలుగవు.