పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : శివుని గరళ భక్షణకై వేడుట

  •  
  •  
  •  

8-229-మత్త.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బాహుశక్తి సురాసురుల్ చని పాలవెల్లి మథింప హా
లాలంబు జనించె నేరి కలంఘ్య మై భువనంబు గో
లాలంబుగఁ జేసి చిచ్చును లాగముం గొని ప్రాణిసం
దోమున్ బ్రతికింపవే దయ దొంగలింపఁగ నీశ్వరా!

టీకా:

బాహు = భుజ; శక్తిన్ = బలముతో; సుర = దేవతలు; అసురుల్ = రాక్షసులు; చని = వెళ్ళి; పాలవెల్లిన్ = పాలసముద్రమును; మథింపన్ = చిలుకగా; హాలాహలంబున్ = హాలాహలవిషము; జనించెన్ = పుట్టెను; ఏరికిన్ = ఎవరికిని; అలంఘ్యము = దాటరానిది; ఐ = అయ్యి; భువనంబున్ = లోకములను; కోలాహలంబుగన్ = లబలబలాడునదిగా; చేసి = చేసి; చిచ్చును = అగ్నితాపము; లాగమున్ = లాఘవముగా; కొని = స్వీకరించి; ప్రాణి = జీవ; సందోహమున్ = జాలమును; బ్రతికింపవే = కాపాడుము; దయ = దయ; తొంగలింపన్ = అతిశయించు, ప్రకాశించు, వికసించు, వర్ధిల్లు, స్రవించగా; ఈశ్వరా = శంకరుడా.

భావము:

ఓ పరమేశ్వరా! దేవతలూ, రాక్షసులూ కలిసి భుజబలాలతో పాల సముద్రాన్ని మథించారు. దానిలో నుంచి హాలాహలం అనే మహా విషం పుట్టింది. లోకాలను క్షోభ పెడుతోంది. అతలాకుతలం చేస్తోంది. ఎవరూ దానిని అడ్డుకోలేకుండా ఉన్నారు. అతిశయించిన దయ జాలువారగా ప్రాణికోటిని అనుగ్రహించు. ఆ హాలాహల విషాన్ని పరిగ్రహించు.
('శివా! నీ దయ అతిశయించునట్లు, వికసించునట్లు ప్రకాశింప జేయవయ్యా దయాసాగరా, అలా నీ దయ వర్షించకపోతే లోకాలు ఈ హాలాహల విషాగ్నికి కాగిపోతాయయ్యా.' ఇంతటి చిక్కనైన భావాన్ని 'దయ దొంగిలింపన్' (దయ + దొంగలింపగా) కాపాడవయా అనే భావ ప్రకటనతో అలవోకగా చెప్పిన పోతనామాత్యులకు ప్రణామములు.)