పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : 1స్వాయంభువ మనువు చరిత్ర

  •  
  •  
  •  

8-7-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రథమ మనువైన స్వాయంభువునకు నాకూతి దేవహూతు లను నిరువురుఁ గూఁతులు గలరు; వారిఁకి గ్రమంబునఁ గపిల యజ్ఞ నామంబుల లోకంబులకు ధర్మజ్ఞాన బోధంబు జేయుకొఱకు హరి పుత్రత్వంబు నొందె; నందుఁ గపిలుని చరిత్రంబు మున్నఁ జెప్పంబడియె; యజ్ఞుని చరిత్రంబు చెప్పెద వినుము.

టీకా:

ప్రథమ = మొదటి (1); మనువు = మనువు; ఐన = అయిన; స్వాయంభువున్ = స్వాయంభువున; కున్ = కు; ఆకూతి = ఆకూతి {ఆకూతి - అభిప్రాయము, తలపు}; దేవహూతులు = దేవహూతి {దేవహూతి - దేవుని హూతి (పిలుపు)}; అను = అనెడి; ఇరువురు = ఇద్దరు (2); కూతులున్ = పుత్రికలు; కలరు = ఉన్నారు; వారి = వారల; కిన్ = కు; క్రమంబునన్ = వరుసగా; కపిల = కపిలుడు; యజ్ఞ = యజ్ఞుడు; నామంబులన్ = అనెడి పేర్లతో; లోకముల్ = ప్రపంచమున; కున్ = కు; ధర్మ = ధర్మమును; జ్ఞాన = జ్ఞానమును; బోధంబున్ = బోధించుట; చేయు = చేసెడి; కొఱకున్ = కోసము; హరి = నారాయణుడు; పుత్రత్వంబున్ = కొడుకగుటను; ఒందెన్ = పొందెను; అందున్ = వారిలో; కపిలుని = కపిలుని; చరిత్రంబు = చరిత్రను; మున్న = ఇంచకు ముందు; చెప్పంబడియె = చెప్పబడినది; యజ్ఞుని = యజ్ఞుని యొక్క; చరిత్రంబు = చరిత్రను; చెప్పెదన్ = చెప్పెదను; వినుము = ఆలకించుము.

భావము:

విను పరీక్షిన్మహారాజా! మొదటి మనువు స్వాయంభువుడు. అతనికి ఇరువురు కుమార్తెలు. వారి పేర్లు దేవహూతి, ఆకూతి. విష్ణుమూర్తి లోకాలకు ధర్మాన్నీ, జ్ఞానాన్నీ బోధించడం కోసం దేవహూతియందు కర్దమునికి కపిలుడు. ఆకూతియందు రుచిప్రజాపతికి యజ్ఞుడు అనే పేర్లతో అవతరించాడు. కపిలుడి చరిత్ర ఇంతకు ముందు చెప్పాను. ఇక యజ్ఞుని చరిత్ర చెప్తాను.

8-8-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రూపాపతి కామభోగ విరతిన్ సంత్యక్త భూ భారుఁడై
తియుం దానును గాన కేఁగి, శతవర్షంబుల్ సునందానదిన్
వ్రతియై యేక పదస్థుఁడై నియతుఁడై వాచంయమస్ఫూర్తితో
దోషుండు తపంబుజేసె భువనఖ్యాతంబుగా భూవరా!

టీకా:

శతరూపాపతి = స్వాయంభువమనువు {శతరూప పతి - శతరూప యొక్క భర్త, స్వాయంభువుడు}; కామ = కామములు; భోగ = భోగములు యెడల; విరతిన్ = విరక్తితోను; సంత్యక్త = విడిచిపెట్టేసిన; భూ = రాజ్యము యొక్క; భారుడు = భారము గలవాడు; ఐ = అయ్యి; సతియున్ = భార్యయును; తానున్ = తను; కానన్ = అడవి; కిన్ = కి; ఏగి = వెళ్ళి; శత = నూరు; వర్షంబుల్ = సంవత్సరములు; సనంద = సునంద అనెడి; నదిన్ = నదివద్ద; వ్రతి = నిష్ఠ గలవాడు; ఐ = అయ్యి; ఏకపదస్థుడు = ఒంటికాలిపై నిలిచిన వాడు; ఐ = అయ్యి; నియతుఁడు = నియమములు గలవాడు; ఐ = అయ్యి; వాచంయమ = మౌనుల యొక్క {వాచంయముడు – మౌనవ్రతము గలవాడు, మౌని}; స్ఫూర్తి = రీతి; తోన్ = తోటి; గత = పోయిన; దోషుండు = దోషములు గలవాడు; తపంబున్ = తపస్సును; చేసెన్ = చేసెను; భువన = విశ్వమంతా; విఖ్యాతంబుగా = పేరుపొందునట్లు; భూవరా = రాజా .

భావము:

ఓ రాజా! శతరూప భర్త అయిన స్వాయంభువ మనువు కామ భోగాల యందు విరక్తుడై, రాజ్య భారాన్నీ విడిచిపెట్టి, తన భార్య శతరూపతోపాటు, అడవికి వెళ్ళాడు. సునందా నది దగ్గర, పవిత్రమైన నియమ నిష్ఠలతో, మౌనంగా ఒంటి కాలి మీద నిలబడి, నూరేళ్లు విశ్వవిఖ్యాతమైన తపస్సు చేసాడు.

8-9-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు తపంబు జేయుచు స్వాయంభువ మనువు తన మనంబులోన.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; తపంబున్ = తపస్సు; చేయుచున్ = చేస్తూ; స్వాయంభువ = స్వాయంభువుడు యనెడి; మనువు = మనువు; తన = తన యొక్క; మనంబు = మనస్సు; లోనన్ = అందు;

భావము:

ఈ విధంగా తపస్సు చేస్తూ, స్వాయంభువ మనువు తన మనసులో భగవంతుని ఇలా ప్రార్థించాడు.

8-10-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సృష్టిచే నెవ్వఁడు చేతనపడకుండు?-
సృష్టి యెవ్వని చేఁతచే జనించు?
గములు నిద్రింప జాగరూకత నొంది;-
యెవ్వఁడు బ్రహ్మాండ మెఱుఁగుచుండు?
నాత్మ కాధారంబు ఖిలంబు నెవ్వఁడౌ?-
నెవ్వని నిజధనం బింతవట్టుఁ
బొడగాన రాకుండఁ బొడఁగను? నెవ్వెడే;-
నెవ్వని దృష్టికి నెదురులేదు?

8-10.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నన వృద్ధి విలయ సంగతిఁ జెందక
యెవ్వఁ డెడపకుండు నెల్ల యెడలఁ?
న మహత్త్వతత్త్వ సంజ్ఞఁ నెవ్వఁడు దాన
విశ్వరూపుఁ డనఁగ విస్తరిల్లు?"

టీకా:

సృష్టి = ప్రకృతి; చేన్ = చేత; ఎవ్వఁడు = ఎవడైతే; చేతనపడక = చైతన్యమునొందక, లోబడక; ఉండున్ = ఉండునో; సృష్టి = సృష్టి; ఎవ్వని = ఎవని; చేత = కృత్యము, పని; చేన్ = చేత; జనించు = సృష్టింపబడునో; జగములు = లోకములు; నిద్రింపన్ = నిద్రపోతుండగ, నశించగ; జాగరూకతన్ = మేలుకొనుటను, చైతన్యమును; ఒంది = కలిగి; ఎవ్వడు = ఎవడైతే; బ్రహ్మాండమున్ = బ్రహ్మాండమును; ఎఱుగుచున్ = తెలిసి; ఉండున్ = ఉండునో; ఆత్మ = ఆత్మల; కిన్ = కు; ఆధారంబున్ = ఆధారభూత; అఖిలంబు = సర్వస్వము; ఎవ్వడేని = ఎవడైతే; ఎవ్వని = ఎవని యొక్క; నిజ = స్వంత; ధనంబు = ఐశ్వర్యము; ఇంతపట్టున్ = కొంచముకూడ; పొడగాన = దర్శించ; రాకుండున్ = సాధ్యపడదో; పొడగనున్ = దర్శించుటకు; ఎవ్వడేని = ఎవనికైనను; ఎవ్వని = ఎవని యొక్క; దృష్టి = కంటిచూపున; కిన్ = కు; ఎదురు = ఎదురు; లేదు = లేదో.
జనన = సృష్టి; వృద్ధి = స్థితి; విలయ = లయమగుటలను; సంగతి = చేరుటలు; చెందక = లోనుగాకుండగ; ఎవ్వడు = ఎవడైతే; ఎడపకుండున్ = ఎడతెగక; ఎల్ల = అన్ని; యెడల = తావులందు; తన = తనయొక్క; మహత్ = మహత్తు యనెడి; తత్త్వసంజ్ఞన్ = తత్త్వముచే; ఎవ్వడు = ఎవడైతే; తాన = తనే; విశ్వరూపుడు = విశ్వమేతనరూపమైనవాడు; అనగ = అన్నవిధముగ; విస్తరిల్లు = వృద్ధిపొందునో.

భావము:

“ఎవడైతే సృష్టి వలన చైతన్యం పొందకుండా, తన చైతన్యం వలన సృష్టి చేస్తాడో, లోకాలు నిద్రిస్తుండగా తాను మేల్కొని బ్రహ్మాండాన్ని తెలుసుకుంటాడో, తనకు తానే ఆధారమై ఉండి సమస్తమూ తానే అయి ఉంటాడో, తన రూపం కనబడకుండా తన ప్రభావాన్ని రూపొందిస్తాడో, తన సంకల్పానికి ఎదురు లేనివాడు ఎవడో, ఆది మధ్యాంతాలు లేకుండా అన్నిచోట్లా చేరి ఉంటాడో,తన మహిమ చూపుతూ శాశ్వతుడై విశ్వరూపుడుగా వర్ధిల్లుతాడో” అంటూ స్తుతిస్తూ...

8-11-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని మఱియు "నిరహంకృతుండును నిర్గతబుద్ధుండును నిరాశియుఁ బరిపూర్ణుండును ననన్య ప్రేరితుండును నృశిక్షాపరుండును నిజమార్గ సంస్థితుండును నిఖిలధర్మ భావనుండును నైన పరమేశ్వరునకు నమస్కరించెద" నని యుపనిషదర్థంబులు పలుకుచున్న మనువుం గనుంగొని.

టీకా:

అని = అని; మఱియున్ = ఇంకను; నిరహంకృతుండును = అహంకారములేనివాడు; నిర్గతబుద్ధుండును = వికసించిన బుద్ధుకలవాడు; నిరాశియున్ = కామములు లేనివాడు; పరిపూర్ణుండును = పరిపూర్ణమైనవాడు; అనన్యప్రేరితుండును = స్వతంత్రుడు {అనన్యప్రేరితుండు - అన్య (ఇతరులు) అన్య (కానివానిచే) ప్రేరితుండు (ప్రేరేపింపబడువాడు), స్వతంత్రుడు}; నృ = నరులకు, ఇతరులకు; శిక్షాపరుండును = బోధించువాడును; నిజ = తన యొక్క; మార్గ = ధర్మమునందు; సంస్థితుండును = బాగా స్థిరముగ నున్నవాడు; నిఖిల = సమస్తమైన; ధర్మభావనుండును = ధర్మ స్వరూపుడును; ఐన = అయిన; పరమేశ్వరున్ = భగవంతుని {పరమేశ్వరుడు - పరమ (అత్యుత్తమమైన) ఈశ్వరుడు (ప్రభువు), భగవంతుడు}; కున్ = కి; నమస్కరించెదను = నమస్కరింతును; అని = అని; ఉపనిషత్ = ఉపనిషత్తులకు చెందిన; అర్థంబులున్ = పరమార్థములను; పలుకుచున్ = చెప్పుచున్న; మనువున్ = మనువును; కనుంగొని = చూసి.

భావము:

ఇంకా ఇలా ప్రార్థించాడు. “అహంకారరహితుడో, సంపూర్ణ బుద్దివికాసము గలవాడో, ఆశలు లేకుండా పరిపూర్ణుడై ఉంటాడో, ఇతరుల ప్రేరణ లేకుండా ఇతరులకు బోధిస్తుంటాడో, తన దారి వదలకుండా సకల ధర్మాలకూ కారణమై ఉంటాడో ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేస్తున్నాను.” ఈ విధంగా ఉపనిషత్తుల ధర్మాన్ని ప్రకటిస్తూ ధ్యానంలో ఉన్న స్వాయంభువ మనువును చూసి...

8-12-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్కసులు దినఁగఁ గడఁగిన
వెక్కసముగ యజ్ఞనామ విష్ణుఁడు వారిం
క్కడిచెఁ జక్రధారల
మిక్కుటముగ వేల్పులెల్ల మేలని పొగడన్.

టీకా:

రక్కసులు = రాక్షసులు; తిననన్ = భక్షించవలె నని; కడగినన్ = యత్నించగా; వెక్కసముగన్ = దుస్సహముగా; యజ్ఞ = యజ్ఞుడు యనెడి; నామ = పేరుగల; విష్ణుండు = నారాయణుడు; వారిన్ = వారిని; చక్కడిచెన్ = సంహరించెను; చక్ర = చక్రాయుధపు; ధారలన్ = పదునులతో; మిక్కుటముగన్ = అధికముగా; వేల్పులు = దేవతలు; ఎల్లన్ = అందరును; మేలు = మంచిది; అని = అని; పొగడన్ = స్తుతించగా.

భావము:

ధ్యానంలో నిమగ్నమై ఉన్న స్వాయంభువ మనువును భక్షించడానికి రాక్షసులు ప్రయత్నించారు. వారిని విష్ణుమూర్తి అవతారం అయిన యజ్ఞుడు తన చక్రాయుధంతో సంహరించాడు. అది చూసి దేవతలు అందరూ ఆయనను పొగిడారు.

8-13-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇది ప్రథమ మన్వంతరం; బింక ద్వితీయ మన్వంతరంబు వినుము.

టీకా:

అది = అది; ప్రథమ = మొదటి (1); మన్వంతరంబు = మన్వంతరము సంగతి; ఇంకన్ = ఇక; ద్వితీయ = రెండవ (2); మన్వంతరంబు = మన్వంతరముగురించి; వినుము = వినుము.

భావము:

పరీక్షిత్తూ! ఇది ప్రథమ మన్వంతరం సంగతి; ఇక రెండవ మన్వంతరం విషయం చెప్తాను విను.