పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : సముద్ర మథన యత్నము

  •  
  •  
  •  

8-198-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు సమాకర్షణస్థానభాగనిర్ణయంబు లేర్పఱచుకొని దేవతలు పుచ్ఛంబును; బూర్వదేవతలు ఫణంబులుం బట్టి పయోరాశి మధ్యంబునం బర్వతంబు పెట్టి; పరమాయత్తచిత్తులై యమృతార్థంబు త్రచ్చుచున్న సమయంబున.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; సమాకర్షణ = లాగబడెడి; స్థాన = స్థానములను; భాగ = పంచుకొనెడి; నిర్ణయంబులు = నిర్ణయములు; ఏర్పఱచుకొని = నియమించుకొని; దేవతలు = దేవతలు; పుచ్ఛంబును = తోకను; పూర్వదేవతలు = రాక్షసులు; ఫణంబులున్ = పడగలను; పట్టి = పట్టుకొని; పయోరాశి = సముద్రము; మధ్యంబునన్ = మధ్యలో; పర్వతంబున్ = పర్వతమును; పెట్టి = పెట్టి; పరమ = మిక్కిలి; ఆయత్త = లగ్నమైన; చిత్తులు = మనసుగలవారు; ఐ = అయ్యి; అమృత = అమృతము; అర్థంబున్ = కోసము; త్రచ్చుచున్న = చిలుకుతున్న; సమయంబునన్ = సమయము నందు.

భావము:

ఇలా వరుసలు కట్టి లాగే స్థానాలను ఏర్పాటు చేసుకున్నారు. క్షీరసాగరం మధ్యన మంథర పర్వతాన్ని ఉంచి, దేవతలు నాగరాజు వాసుకి తోక భాగము, రాక్షసులు పడగలభాగం పట్టుకునిచిలుకుతున్నారు.ఇంతలో...