పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : విశ్వగర్భుని ఆవిర్భావము

  •  
  •  
  •  

8-158-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యిట్లు దేవగణసమేతుండై యనేక విధంబులం గీర్తించుచు నున్న పరమేష్ఠి యందుఁ గరుణించి దయాగరిష్ఠుండగు విశ్వగర్భుం డావిర్భవించె.

టీకా:

అని = అని; ఇట్లు = ఈ విధముగా; దేవ = దేవతల; గణ = సమూహముతో; సమేతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; అనేక = వివిధ; విధంబులన్ = రకములుగా; కీర్తించుచున్ = స్తుతించుచు; ఉన్న = ఉన్నట్టి; పరమేష్ఠి = బ్రహ్మదేవుని {పరమేష్ఠి - శ్రేష్ఠమైన స్థానమగు సత్యలోకమున యుండువాడు, బ్రహ్మ}; అందున్ = ఎడల; కరుణించి = దయకలిగి; దయా = కృపజేయుటయందు; గరిష్ఠుండు = గొప్పవాడు; అగు = అయిన; విశ్వగర్భుండు = నారాయణుడు {విశ్వగర్భుడు - విశ్వములు తన గర్భమునగలవాడు, విష్ణువు}; ఆవిర్భవించె = ప్రత్యక్షమయ్యెను;

భావము:

దేవతా సమూహాలతో కూడి బ్రహ్మదేవుడు ఇలా అనేక రకాలుగా విష్ణుమూర్తిని స్తోత్రం చేసాడు. అంతట కరుణించి విశ్వాలు అన్నిటినీ తన గర్భంలో ధరించే ఆ మహానుభావుడు ప్రత్యక్షం అయ్యాడు.

8-159-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వేయర్కులు గూడిగట్టి కదుపై యుద్యత్ప్రభాభూతితో
నొరూపై చనుదెంచుమాడ్కి హరి దా నొప్పారె; నా వేలుపుల్
విలాలోకనులై; విషణ్ణమతులై; విభ్రాంతులై మ్రోలఁ గా
శంకించిరి కొంత ప్రొద్దు; విభుఁ గానం బోలునే వారికిన్.

టీకా:

ఒకవేయు = ఒకవెయ్యి (1000); అర్కులున్ = సూర్యులు; కూడికట్టి = కలిపివేసి; కదుపు = ముద్ద; ఐ = అయ్యి; ఉద్యత్ = పెంచబడిన; ప్రభా = కాంతులనెడి; భూతి = సంపదల; తోన్ = తోటి; ఒకరూపు = ఒకటిగా పోతబోసినది; ఐ = అయ్యి; చనుదెంచు = వస్తున్న; మాడ్కిన్ = విధముగా; హరి = నారాయణుడు; తాన్ = తను; ఒప్పారెన్ = ప్రకాశించెను; ఆ = ఆ; వేలుపుల్ = దేవతలు; వికల = చెదిరిన; ఆలోకనులు = చూపులుగలవారు; ఐ = అయ్యి; విషణ్ణ = విషాదముపొందిన; మతులు = మనస్సులుగలవారు; ఐ = అయ్యి; విభ్రాంతులు = తికమకనొందినవారు; ఐ = అయ్యి; మ్రోలన్ = ఎదురుగానున్నది; కానక = చూడలేక; శంకించిరి = అనుమానపడిరి; కొంత = కొంచెము; ప్రొద్దు = సమయము; విభున్ = ప్రభువును; కానన్ = చూచుట; పోలునే = సాధ్యమా కాదు; వారి = వారి; కిన్ = కి.

భావము:

అలా ప్రత్యక్షమైన మహావిష్ణువు రూపు వెయ్యి సూర్యుల తేజస్సు ఒకటిగా పోతపోసిన ప్రకాశ వైభవంతో ప్రకాశిస్తోంది. చూస్తున్న దేవతల చూపులు చెదిరి పోయాయి. స్వామిని చూడగానే కొంతసేపు భయపడ్డారు, ఆశ్చర్యచకితులు అయ్యారు. వారికి ప్రభువును చూడటం సాధ్యం కాదు కదా!

8-160-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అప్పుడు.

టీకా:

అప్పుడు = అప్పుడు.

భావము:

ఆ సమయంలో విష్ణుమూర్తి ఎలా ఉన్నాడు అంటే.

8-161-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హా కిరీట కేయూ కుండల పాద-
టక కాంచీలతా కంకణాది
కౌస్తుభోపేతంబుఁ గౌమోదకీ శంఖ-
క్ర శరాసన సంయుతంబు
రకతశ్యామంబు రసిజ నేత్రంబుఁ-
ర్ణాభరణ కాంతి గండ యుగముఁ
లిత కాంచనవర్ణ కౌశేయవస్త్రంబు-
శ్రీ వనమాలికా సేవితంబు

8-161.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నై మనోహరంబునై దివ్యసౌభాగ్య
మైన యతని రూపు ర్ష మెసఁగ
జూచి బ్రహ్మ హరుఁడు సురలును దానును
బొంగి నమ్రుఁ డగుచుఁ బొగడఁ దొడఁగె.

టీకా:

హార = హారములు; కిరీట = కిరీటములు; కేయూర = భుజకీర్తులు; కుండల = చెవికుండలములు; పాదకటక = కాలి అందెలు; కాంచీలత = మొలతాడు; కంకణ = కంకణములు; ఆది = మున్నగునవి; కౌస్తుభ = కౌస్తుభమణితో; ఉపేతంబున్ = కూడినది; కౌమోదకీ = కౌమోదకీ గద; శంఖ = శంఖము; చక్ర = చక్రము; శరాసన = విల్లు; సంయుతంబున్ = కలిగినది; మరకత = మరకతమణివంటి; శ్యామంబున్ = నల్లనిమేనుగలది; సరసిజ = పద్మములవంటి; నేత్రంబున్ = కన్నులుగలది; కర్ణాభరణ = చెవికుండలముల; కాంతిన్ = కాంతులుగల; గండ = చెక్కళ్ళ; యుగమున్ = జంట; కలిత = పొందబడినది; కాంచన = బంగారు; వర్ణ = రంగుగల; కౌశేయ = పట్టు; వస్త్రంబున్ = బట్టలు; శ్రీవనమాలికా = సుందరమైన ఆకులు పువ్వులు చేర్చికట్టిన తోమాలె చే, వైజయంతిమాలచేత; సేవితంబున్ = కొలువబడుచున్నది; ఐ = అయ్యి.
మనోహరంబున్ = మనోహరమైనది; ఐ = అయ్యి; దివ్య = గొప్ప; సౌభాగ్యము = సౌభాగ్యవంతము; ఐన = అయినట్టి; అతని = అతని; రూపు = ఆకృతి; హర్షము = సంతోషము; ఎసగన్ = అతిశయించగా; చూచి = చూసి; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; హరుడు = పరమశివుడు; సురలునున్ = దేవతలు; తానునున్ = తను; పొంగి = సంతోషిముతో పొంగిపోయి; నమ్రుడు = నమ్రతచూపువాడు; అగుచున్ = అగుచు; పొగడన్ = స్తుతించుట; తొడగెన్ = ప్రారంభించెను.

భావము:

భగవంతుడు శ్రీహరి హారాలు, కిరీటాలు, భుజకీర్తులు, కుండలాలు, కాలి అందెలు, మొలనూలు, కంకణాలు, కౌస్తుభరత్నము, కొమోదకీ గద, శంఖము, చక్రము, విల్లు ధరించి దర్శనం ఇచ్చాడు. మరకత మణి వంటి నల్లని మేను, కాంతులీనే పద్మాల వంటి కళ్ళు, చెక్కిళ్ళపై ప్రతిఫలిస్తున్న తళతళలాడే మకర కుండలాల కాంతులూ కలిగి ఉన్నాడు. బంగారురంగు పట్టు వస్త్రం ధరించి ఉన్నాడు. మెడలో వైజయంతీమాల ప్రకాశిస్తూ ఉంది. ఎంతో అందంగా ఉన్న స్వామి రూపాన్ని బ్రహ్మదేవుడు, శివుడు, దేవతలు సంతోషంతో పొంగిపోతూ దర్శించుకున్నారు. బ్రహ్మదేవుడు భగవంతునికి నమస్కారం చేసి ఇలా స్తోత్రం చేయటం మొదలెట్టాడు.

8-162-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"జనస్థితిలయ దూరుని
మునినుతు నిర్వాణసుఖసముద్రుని సుగుణుం
నుతనునిఁ బృథుల పృథులుని
ఘాత్ము మహానుభావు భినందింతున్.

టీకా:

జనన = సృష్టి; స్థితి = స్థితి; లయ = లయములు; దూరుని = లేనివానిని; ముని = మునులచే; నుతున్ = కీర్తింపబడువానిని; నిర్వాణ = మోక్ష; సుఖ = సౌఖ్యమునకు; సముద్రుని = సముద్రమువంటివానిని; సుగుణున్ = సుగుణములుగలవానిని; తను = సూక్ష్మమైన వానికంటె; తనున్ = సూక్ష్ముని; పృథుల = అతి పెద్దవానికంటెను; పృథులుని = పెద్దవానిని; అనఘాత్మున్ = పుణ్యాత్ముని; మహానుభావున్ = గొప్పవానిని; అభినందింతున్ = స్తుతించెదను.

భావము:

జనన మరణాదులు లేనివాడవు, మహర్షులచే కీర్తింపబడువాడవు, మోక్షసౌఖ్యాన్ని సమృద్ధిగా అందించే వాడవు, సుగుణ మయుడవు, సూక్ష్మమైన అన్నిటి కంటే బహు సూక్ష్ముడవు, మిన్నలను అన్నింటిని మించిన మిన్నవు, పుణ్యాత్ముడవు అయిన నిన్ను స్తుతిస్తున్నాము.

8-163-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పురుషోత్తమ! నీ రూపము
మశ్రేయంబు భువన పంక్తుల కెల్లన్
స్థివైదిక యోగంబున
రుసను మీ యంద కానచ్చెను మాకున్.

టీకా:

పురుషోత్తమ = నారాయణ {పురుషోత్తముడు - పురుషులలో ఉత్తముడు, విష్ణువు}; నీ = నీ యొక్క; రూపము = స్వరూపము; పరమ = అత్యుత్తమమైన; శ్రేయంబు = శుభప్రదమైనది; భువన = లోకముల; పంక్తుల్ = సమూహముల; కున్ = కు; ఎల్లన్ = సమస్తమునకు; స్థిర = చెదరని; వైదిక = వేదోక్త; యోగంబునన్ = యోగమువలన; వరుసను = క్రమముగ; మీ = మీ; అంద = లోనే; కానవచ్చెను = కనబడెను; మా = మా; కున్ = కు.

భావము:

ఓ పరమపురుషా! శ్రీమహావిష్ణూ! నీ రూపం సమస్తమైన భువనాలకూ శ్రేయోదాయకం అయినది. ఆ రూపం శాశ్వతమైన వేద మంత్రంతో కూడి మీ యందే మాకు కనబడుచున్నది.

8-164-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మొలును నీలోఁ దోఁచెను;
దుదియును నటఁ దోఁచె; నడుమ దోఁచెను; నీవే
మొలు నడుమ దుది సృష్టికిఁ
దియఁగ ఘటమునకు మన్ను తి యగు మాడ్కిన్.

టీకా:

మొదలును = సృష్టికి ఆది; నీ = నీ; లోన్ = అందే; తోచెనున్ = కనబడెను; తుదియునున్ = అంతముకూడ; అటన్ = అక్కడనే; తోచెన్ = కనబడెను; నడుమన్ = రెంటిమధ్యదికూడ; తోచెను = కనబడెను; నీవే = నీవుమాత్రమే; మొదలు = ఆది; నడుమ = మధ్య; తుది = అంతములు; సృష్టి = సృష్టి; కిన్ = కి; కదియంగ = సరిగచూసినచో; ఘటమున్ = కుండ; కున్ = కు; మన్ను = మట్టి; గతి = కారణము; అగు = అయ్యెడి; మాడ్కిన్ = వలె.

భావము:

కుండకు మన్నే ఆధారం, కనుక కారణభూతం. దీనిని ఘటపటన్యాయం అంటారు. అలాగే, ఈ సృష్టికి మొదలూ, మధ్య, అంతమూ నీలోనే ప్రకాశితమవు తున్నాయి. ఈ సృష్టి ఆది,మధ్య, అంతములను మూడుదశలకు కారణభూతం నీవే.
విశేష వివరణ -కుండలు ఎన్ని రకాలైనా ఎన్నైనా అన్నీ మట్టియొక్క రూపాలే, మట్టి అంతా ఒక్కటే. అందుచేత కుండకు ఆధారం మట్టి,పటములు అంటే వస్త్రాలు ఎన్ని రకాలైనా ఎన్నైనా అన్నీ దారాలయొక్క రూపాలే, దారాలు అన్నీ ఒక్కటే. అందుచేత పటమునకు ఆధారం దారం,ఇలా ఆధారభూతాల గురించి చెప్పే న్యాయం “ఘటపటన్యాయం”.

8-165-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నీ మాయ చేత విశ్వము
వేమాఱు సృజింతు వనుచు విష్ణుఁడ వనుచున్
ధీమంతులు గుణపద విని
నేమంబున సగుణుఁడైన నినుఁ గాంతు రొగిన్.

టీకా:

నీ = నీ యొక్క; మాయ = మాయ; చేత = వలన; విశ్వము = భువనము; వేమాఱు = అనేకసార్లు; సృజింతువు = సృష్టించెదవు; అనుచున్ = అనుచు; విష్ణుడవు = విశ్వమును వ్యాపించి యుండు వాడవు; అనుచున్ = అనుచు; ధీమంతులు = జ్ఞానులు; గుణ = గుణములందలి; పదవిన్ = సంపదవలన; నేమంబునన్ = నియమములతో; సగుణుండు = గుణములుగలవాడు; ఐన = అయిన; నిన్నున్ = నిన్ను; కాంతురు = దర్శింతురు; ఒగిన్ = క్రమముగ.

భావము:

ప్రపంచాన్ని నీ మాయచేత అనేక మార్లు సృష్టించి, త్రిగుణాలతో కూడినవాడవై ప్రపంచమంతా నిండి వుంటావు. అందుచేత గుణసంపన్నులైన వారు నిన్ను విష్ణువు అను పేర పరిగణిస్తూ, గుణవంతుడవైన నిన్ను దర్శిస్తారు.

8-166-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న్న మవని యందు మృతంబు గోవుల
యందు వహ్ని సమిధలందు నమర
యోగవశతఁ బొందు నోజను బుద్ధిచే
గుణు నిన్నుఁ గాంతు రాత్మవిదులు.

టీకా:

అన్నము = ఆహారమును; అవని = భూమి; అందున్ = లోను; అమృతంబు = పాలను; గోవుల = ఆవుల; అందున్ = లోను; వహ్ని = అగ్నిని; సమిధలు = కట్టెల; అందున్ = లోను; అమరన్ = పొందికైన; యోగవశతన్ = యోగసాధనవలన; పొందు = పొందెడి; ఓజనున్ = ప్రకాశముతో కలిగిన; బుద్ధి = తెలివి; చేన్ = చేత; అగుణున్ = గుణరహితుని; నిన్నున్ = నిన్ను; కాంతురు = దర్శించెదరు; ఆత్మవిదులు = ఆత్మజ్ఞానులు.

భావము:

భూమిలో ఆహారాన్నీ, ఆవులలో పాలనూ, కఱ్ఱలలో అగ్నిని కనుగొనే విధంగానే ఆత్మజ్ఞానం కలవారు తమ బుద్ధిద్వారా గుణరహితుడవైన నిన్ను ఈ విశ్వంలో దర్శిస్తారు.

8-167-మత్త.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టులేక బహుప్రకార విన్న చిత్తులమైతి; మే
మెట్టకేలకు నిన్నుఁ గంటి మభీప్సితార్థము వచ్చుఁ; బె
న్వెట్టయైన దవానలంబున వేఁగు నేనుఁగు మొత్తముల్
నిట్టవేర్చిన గంగలోపల నీరు గాంచిన చాడ్పునన్.

టీకా:

పట్టు = ఆధారము; లేక = లేకపోవుటచేత; బహు = అనేక; ప్రకార = విధములుగ; విపన్న = బాధచెందుతున్న; చిత్తులము = మనసుగలవారము; ఐతిమి = అయిపోతిమి; మేమున్ = మేము; ఎట్టకేలకున్ = చిట్టచివరకు; నిన్నున్ = నిన్ను; కంటిమి = దర్శించితిమి; అభీప్సితార్థము = కోరికలు; వచ్చున్ = తీరును; పెన్ = మిక్కిలి; వెట్ట = వేడిమిగలది; ఐన = అయినట్టి; దవానలంబునన్ = దావానలమునందు; వేగున్ = తపించిపోతున్న; ఏనుగు = ఏనుగుల; మొత్తముల్ = సమూహములు; నిట్టవేర్చిన = ఉప్పొంగుతున్న; గంగ = గంగానది; లోపల = అందలి; నీరున్ = నీటిని; కాంచిన = చూచిన; చాడ్పునన్ = విధముగా.

భావము:

మేము దిక్కులేని వారము అయ్యాము. అనేకరకాల కష్టాలతో కలత చెందిన మనసులు కలవారమై బాధలు పడుతున్నాము. కార్చిచ్చు యొక్క మిక్కిలి వేడిమి ధాటికి తపించిన ఏనుగుల మంద ఉప్పొంగుతున్న గంగలోని నీళ్ళు కనుగొన్న విధంగా, చిట్టచివరికి నిన్ను దర్శించ గలిగాము. ఇక మా కోరికలు నెరవేరితీరుతాయి.

8-168-మత్త.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నీకు నే మని విన్నవింతుము నీవు సర్వమయుండవై
లోమెల్లను నిండి యుండగ లోకలోచన! నీ పదా
లోనంబు శుభంబు మాకును లోకపాలకు లేను నీ
నావాసులు నీవ వహ్నిఁ దర్చు కేతుతతిక్రియన్."

టీకా:

నీ = నీ; కున్ = కు; ఏమని = ఏమని; విన్నవింతుము = మనవిచేసుకొనెదము; నీవు = నీవు; సర్వ = అన్నిటను; మయుండవు = ఉండెడివాడవు; ఐ = అయ్యి; లోకము = లోకము; ఎల్లను = అంతటను; నిండి = నిండి; ఉండగన్ = ఉండగా; లోక = లోకములను; లోచన = సదా వీక్షించు వాడ; నీ = నీ యొక్క; పద = పాదములను; ఆలోకనంబు = దర్శించుట; శుభంబు = శుభము; మా = మా; కును = కు; లోకపాలకుల్ = లోకపాలకులు; ఏనున్ = నేను; ఈ = ఈ; నాకవాసులు = దేవతలు {నాకవాసులు - నాకము (స్వర్గలోకము)న వాసులు (నివసించెడివారు), దేవతలు}; నీవ = నీవే; వహ్నిన్ = అగ్నియందు; తనర్చు = అతిశయించెడి; కేతు = అగ్నికణముల, కాంతి; తతి = సమూహము; క్రియన్ = వలె.

భావము:

శ్రీమన్నారాయణా! లోకమంతటా నిండి ఉండే నీవు మహాత్ముడవు. లోకాలన్నీ అనుక్షణం వీక్షిస్తూ ఉంటావు. అట్టి నీకు మేము మనవి చేసుకోవలసిన పని లేదు. నీ పాదదర్శనం మాకు శుభమును కలిగిస్తుంది. అగ్నిలోని విస్ఫులింగాలవలె నేనూ, ఈ లోకపాలకులూ, దేవతలూ నీలోని అంశలమే.”

8-169-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని కమలసంభవ ప్రముఖులు వినుతి చేసి రని" చెప్పి నరేంద్రునకు శుకుం డిట్లనియె.

టీకా:

అని = అని; కమలసంభవ = బ్రహ్మదేవుడు; ప్రముఖులు = మొదలగువారు; వినుతి = స్తోత్రము; చేసిరి = చేసిరి; అని = అని; చెప్పి = చెప్పి; నరేంద్రున్ = నరేంద్రున; కున్ = కు; శుకుండు = శుకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇలా విష్ణుమూర్తి నాభి కమలంలో పుట్టిన బ్రహ్మదేవుడు మున్నగు దేవతా ప్రముఖులు శ్రీమహావిష్ణువును ప్రార్థించారు” అని చెప్పి శుకమహర్షి పరీక్షిన్మహారాజుకు మరల ఇలా చెప్పసాగాడు.