పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాద చరిత్రము

  •  
  •  
  •  

7-183-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శోధింపంబడె సర్వశాస్త్రములు రక్షోనాథ! వే యేటికిన్
గాథల్ మాధవశేముషీతరణి సాంత్యంబునం గాక దు
ర్మేధన్ దాఁటఁగ వచ్చునే సుతవధూమీనోగ్ర వాంఛా మద
క్రోధోల్లోల విశాల సంసృతి మహా ఘోరామితాంభోనిధిన్."

టీకా:

శోధింపంబడె = పరిశోధింపబడినవి; సర్వ = సమస్తమైన; శాస్త్రములున్ = చదువులును; రక్షోనాథ = రాక్షసరాజా; వేయి = అనేక మాటలు; ఏటికిన్ = ఎందులకు; గాథల్ = కథలు; మాధవ = నారాయణుని; శేముషి = చింత యనెడి; తరణి = నావ; సాంగత్యంబునన్ = సంబంధమువలన; కాక = కాకుండగ; దుర్మేధన్ = దుష్టబుద్ధితో; దాటగన్ = తరించుటకు; వచ్చునే = అలవి యగునా యేమి; సుత = పిల్లలు; వధూ = పెండ్లాము యనెడి; మీన = జలజంతువులు; ఉగ్ర = తీవ్రమైన; వాంఛ = కోరికలు; మద = గర్వము; క్రోధ = కోపము యనెడి; ఉల్లోల = పెద్ద తరంగములు గల; విశాల = విస్తారమైన ; సంసృతి = సంసారము యనెడి; మహా = గొప్ప; ఘోర = ఘోరమైన; అమిత = కడలేని; అంభోనిధిన్ = సముద్రమును;

భావము:

ఓ తండ్రీ! దానవేంద్రా! శాస్త్రాలు, కథలూ, గాథలూ అన్ని చదివి మధించాను. ఈ సంసారం ఒక భయంకరమైన మహా సముద్రం వంటిది; ఈ సంసార సాగరంలో భార్యా పుత్రులు తిమింగలాలు; కామం, క్రోధం మొదలైనవి ఉగ్రమైన కెరటాలు. ఇలాంటి ఘోరమైన సముద్రాన్ని దాటాలంటే అతి తెలివి, అనవసరమైన వాదప్రతివాదాలు తోటి సాధ్యం కాదు; ఈ చదువు సంధ్యలు ఏవీ, ఎందుకూ పనికి రావు; ఒక్క హరిభక్తి అనే నౌక మాత్రమే తరింపజేయగలదు.”