పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : పూర్ణి

  •  
  •  
  •  

7-481-మాలి.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ణిదుహితృరంతా! ర్మమార్గానుగంతా!
నిరుపమనయవంతా! నిర్జరారాతిహంతా!
గురుబుధసుఖకర్తా! కుంభినీచక్రభర్తా!
సుభయపరిహర్తా! సూరిచేతోవిహర్తా!

టీకా:

ధరణిదుహితృరంతా = శ్రీరామా {ధరణిదుహితృరంతుడు - ధరణీ (భూదేవి) దుహితృ (కుమార్తె) యైన సీతతో రంతుడు (క్రీడించువాడు), రాముడు}; ధర్మమార్గానుగంతా = శ్రీరామా {ధర్మమార్గానుగంతుడు - ధర్మమార్గ (ధర్మమార్గమును) అనుగంతుడు (అనుసరించువాడు), రాముడు}; నిరుపమనయవంతా = శ్రీరామా {నిరుపమనయవంతుడు - నిరుపమ (సాటిలేని) నయవంతుడు (నీతిగలవాడు), రాముడు}; నిర్జరారాతిహంతా = శ్రీరామా {నిర్జరారాతిహంత - నిర్జరారాతి (దేవతలశత్రువులగు రాక్షసులను) హంత(చంపినవాడు), రాముడు}; గురుబుధసుఖకర్తా = శ్రీరామా {గురుబుధసుఖకర్త - గురు (గురువులకు) బుధ (జ్ఞానులకు) సుఖ (సౌఖ్యమును) కర్త (ఏర్పరచినవాడు), రాముడు}; కుంభినీచక్రభర్తా = శ్రీరామా {కుంభినీచక్రభర్త - కుంభినీ (భూ) చక్ర (మండలమునకు) భర్త (నాథుడు), రాముడు}; సురభయపరిహర్తా = శ్రీరామా {సురభయపరిహర్త - సుర (దేవతల) భయ (భయమును) పరిహర్త (పోగొట్టినవాడు), రాముడు}; సూరిచేతోవిహర్తా = శ్రీరామా {సూరిచేతోవిహర్త - సూరి (జ్ఞానుల) చేతః (చిత్తములలో) విహర్త (క్రీడించువాడు), రాముడు}.

భావము:

భూదేవి పుత్రిక సీతాదేవితో క్రీడించువాడా! ధర్మమార్గమునందే చరించువాడా! సాటిలేని నీతిగలవాడా! దేవతలకు శత్రువులైన రాక్షసుల సంహరించినవాడా! గురువులకు పెద్దలకు జ్ఞానులకు సాధువులకు సుఖసౌఖ్యములను సమకూర్చువాడా! భూమండలమును ఏలిన చక్రవర్తి! దేవతల భీతిని తొలగించువాడా! పరమ జ్ఞానుల చిత్తములలో విహరించువాడా! శ్రీరామచంద్ర ప్రభో! కరుణించుము.