పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : నారదుని పూర్వజన్మంబు

  •  
  •  
  •  

7-478-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఖిలాధారుఁ డజాది దుర్లభుఁడు బ్రహ్మంబైన విష్ణుండు నీ
మం దర్చితుఁడై నివాసగతుఁ డై ర్త్యాకృతిన్ సేవ్యుఁ డై
ఖి యై చారకుఁ డై మనోదయితుఁ డై సంబంధి యై మంత్రి యై
సుదుండయ్యె భవన్మహామహిమ దాఁ జోద్యంబు ధాత్రీశ్వరా!

టీకా:

అఖిలాధారుండు = శ్రీహరి {అఖిలాధారుడు - అఖిలమున (సమస్తమున)కు ఆధారమైనవాడు, విష్ణువు}; అజాదిదుర్లభుడు = శ్రీహరి {అజాదిదుర్లభుడు - అజ (బ్రహ్మదేవుడు) ఆది (మున్నగువారికిని) దుర్లభుడు (అందనివాడు), విష్ణువు}; బ్రహ్మంబు = శ్రీహరి {బ్రహ్మము - పరబ్రహ్మస్వరూపి, విష్ణువు}; ఐన = అయిన; విష్ణుండు = శ్రీహరి; నీ = నీ యొక్క; మఖము = (అశ్వమేధ)యాగము; అందున్ = లో; అర్చితుడు = పూజింపబడినవాడు; ఐ = అయ్యి; నివాసగతుడు = ఇంటనుండువాడు; ఐ = అయ్యి; మర్త్య = మానవ; ఆకృతిన్ = రూపముతో; సేవ్యుడు = కొలువబడినవాడు; ఐ = అయ్యి; సఖి = మిత్రుడు; ఐ = అయ్యి; చారకుడు = సేవకుడు; ఐ = అయ్యి; మనోదయితుడు = మనసునకు ప్రియుడు; ఐ = అయ్యి; సంబంధి = చుట్టము; ఐ = అయ్యి; మంత్రి = మంత్రాంగముచెప్పువాడు; ఐ = అయ్యి; సుఖదుడు = సౌఖ్యమును యిచ్చువాడు; అయ్యెన్ = అయ్యెను; భవత్ = నీ యొక్క; మహిమన్ = గొప్పదనము; తాన్ = ఆది; చోద్యంబు = అద్భుతమైనది; ధాత్రీశ్వరా = రాజా {ధాత్రీశ్వరు - ధాత్రి (భూమి)కి ఈశ్వరుడు, రాజు}.

భావము:

ఓ భూపాలోత్తమా! ధర్మరాజా! ఒక విషయం నాకు చాలా సంతోషంగా ఉంది. నిఖిలమైన లోకాలకూ ఆధారభూతుడు, బ్రహ్మదేవుడు మున్నగు వారికి కూడ దుర్లభ్యం అయిన పరబ్రహ్మ స్వరూపుడూ అయిన శ్రీమహావిష్ణువు, నీవు చేసిన యజ్ఞంలో ఆరాధింపబడ్డాడు. నీ ఎదుట ఉండి శ్రీకృష్ణునిగా మానరూపంలో పూజింపబడ్డాడు. మీ మిత్రుడుగా, మీ కార్యనిర్వావాహకుడుగా, మనోనాథుడుగా, ఆప్తబాంధవుడుగా, మార్గదర్శకుడుగా ఉండి సర్వతోముఖంగా సర్వసుఖాలూ సమకూర్చాడు. అందంతా నీ పూర్వజన్మలలో నీవు చేసుకున్న పుణ్యాల ఫలం.”