సప్తమ స్కంధము : ప్రహ్లాదాజగర సంవాదము
- ఉపకరణాలు:
ననుఁ బోటి జడగృహస్థుఁడు
మునివల్లభ! యిట్టి పదవి మోదంబున నే
యనువునఁ జెందును వేగమ
వినిపింపుము నేఁడు నాకు విజ్ఞాననిధీ!
టీకా:
ననున్ = నా; పోటి = వంటి; జడ = అజ్ఞానియైన; గృహస్థుడు = గృహస్తాశ్రమమున ఉండువాడు; ముని = మునులలో; వల్లభ = ప్రభూ; యిట్టి = ఇటువంటి; పదవి = స్థితి; మోదంబునన్ = సంతోషముతో; ఏ = ఎట్టి; అనువునన్ = రీతిగ; చెందును = పొందగలడో; వేగమ = శ్రీఘ్రమే; వినిపింపుము = చెప్పుము; నేడు = ఇప్పుడు; నా = నా; కున్ = కు; విజ్ఞాన = విశిష్ట జ్ఞానమునకు; నిధీ = నెలవైనవాడా.
భావము:
“ఓ నారద మునీశ్వరా! నీవు గొప్ప జ్ఞాననిధివి. నీవు చెప్పిన ఈ పరమార్థం, ప్రబోధం బాగా నచ్చింది. కానీ నా బోటి అజ్ఞాని అయిన గృహస్థుడు అటువంటి పదవిని ఎలా అందుకోగలడో ఆ మార్గం ఇప్పుడు నాకు త్వరగా చెప్పు.”