పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదాజగర సంవాదము

  •  
  •  
  •  

7-439-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లే ని యెవ్వరి నడుగను
రా ని చింతింపఁ బరులు ప్పించినచోఁ
గా ని యెద్దియు మానను
ఖేము మోదమును లేక క్రీడింతు మదిన్.

టీకా:

లేదు = ఈవస్తువు లేదు; అని = అని; ఎవ్వరిన్ = ఎవరిని; అడుగను = అడగను; రాదు = దొరకదు; అని = అని; చింతింపన్ = బాధపడను; పరులు = ఇతరులు; రప్పించినచో = తెప్పించిన యెడల; కాదు = కాదు; అని = అని; ఎద్దియున్ = దేనిని; మానను = మానివేయను; ఖేదము = దుఃఖము; మోదమునున్ = సంతోషములు; లేక = లేకుండగ; క్రీడింతున్ = విహరించెదను; మదిన్ = మనసునందు.

భావము:

నాకు ఏ వస్తు వైనా లేదు అని మరొకరిని అడగను. ఏదైనా సరే నాకు దొరక లేదు అని బాధపడను. ఎవరు ఏమి తెప్పించి పెట్టినా వద్దని వదిలేయను, కర్మారబ్ధమైన దేనినైన వలదు అనను. చిత్తంలో దుఃఖం గాని, సుఖం గాని లేక ఆనందిస్తు ఉంటాను.
– (ప్రహ్లాద అజగర సంవాద ఘట్టంలో అజగరవ్రతధారి యైన ముని ప్రహ్లాదునికి తన గురించి చెప్తున్న సందర్భంలోది ఈ పద్యం. అజగర వ్రత నియమాలు అప్రయత్నం; అయాచితం, అవాఛితం, అనింద్యం, అక్రోధనం మొదలైన లక్షణాలతో అజగరంలా ఉండటం. అజగరం అంటే కొండచిలువ. అది ఆహారం కోసం ఎటూ వెళ్ళదు. ఒకచోట కదలకుండా ఉంటుంది. ఎప్పుడు దొరికితే అప్పుడే దొరికిన ఆహారం చిన్న పెద్ద అని, మంచి చెడు అని లేకుండ రుచి పచుల పట్టింపు లేక మింగుతుంది. కొన్ని నెలలు దొరకకపోయినా అలా నిరాహారంగానే ఉంటుంది. అయినా పెద్ద దేహంతో మిల మిల మెరుస్తు ఉంటుంది.)