పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : వర్ణాశ్రమ ధర్మంబులు

  •  
  •  
  •  

7-413-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శౌర్యము దానశీలముఁ బ్రసాదము నాత్మజయంబుఁ దేజమున్
ధైర్యము దేవభక్తియును ర్మము నర్థముఁ గామమున్ బుధా
చార్యముకుందసేవలును త్కృతియుం బరితోషణంబు స
ద్వీర్యము రక్షణంబుఁ బృథివీవరశేఖర! రాజచిహ్నముల్.

టీకా:

శౌర్యము = మగటిమి; దాన = దానముఇచ్చెడి; శీలమున్ = స్వభావము; ప్రసాదమున్ = ప్రసన్నత {ప్రసాదము - కోపాదులు లేక సౌమ్యతతో యుండుట, ప్రసన్నత}; ఆత్మజయంబున్ = మనోనిగ్రహము; తేజమున్ = ప్రకాశము; ధైర్యము = దిట్టదనము; దేవ = దేవతల యెడ; భక్తియును = భక్తి; ధర్మమున్ = మంచినడవడి, ధర్మనిష్ఠ; అర్థమున్ = ప్రయోజనము,అర్థసంపాదన; కామమున్ = ఇచ్ఛ; బుధా = జ్ఞానుల; ఆచార్య = గురువుల; ముకుంద = నారాయణుల {ముకుందుడు - మోక్షమునిచ్చువాడు, విష్ణువు}; సేవలును = సేవించుటలు; సత్కృతియున్ = మంచిపనులుచేయుట; పరితోషణంబున్ = సంతోషపరచుట; సద్వీర్యము = న్యాయమైనపరాక్రమము; రక్షణంబున్ = శిష్టపాలనము; పృథివీవరశేఖర = మహారాజా {పృథివీవరశేఖర - పృథివి (భూమి)కి వరుడు రాజు వారిలో శేఖరుడు (శ్రేష్ఠుడు), మహారాజు}; రాజ = రాచవానికి; చిహ్నములు = ఉండదగిన లక్షణములు.

భావము:

మహారాజా! ధర్మరాజ! క్షత్రియుల లక్షణాలు శౌర్యం; దానము; ప్రసన్నత; మనోనిగ్రహము; తేజస్సు; ధర్మనిష్ఠ; అర్థ సంపాదన; ఇచ్ఛా; బుధసేవ; ఆచార్యసేవ; విష్ణుసేవ; సత్కార్యాచరణ; సంతోషపరచుట; వీర్యం; సంరక్షణ.