పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : త్రిపురాసుర సంహారము

  •  
  •  
  •  

7-387-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హుమాయుఁడైన మయుచే
వితం బగు హరుని యశము విఖ్యాత జయా
ముగ నీ భగవంతుఁడు
హితాత్ముఁడు మున్నొనర్చె నుజవరేణ్యా!"

టీకా:

బహు = పలు; మాయుడు = మాయలుగలవాడు; ఐన = అయిన; మయు = మయుని; చేన్ = చేత; విహతంబు = భంగపరచబడిన; హరుని = పరమశివుని {హరుడు - ప్రళయకాలమున సర్వమును హరించువాడు, శివుడు}; యశము = కీర్తిని; విఖ్యాత = ప్రసిద్ధమైన; జయ = గెలుపు; ఆవహము = నెలవైనది; కన్ = అగునట్లు; ఈ = ఈ; భగవంతుడు = హరి; మహితాత్ముడు = హరి {మహితాత్ముడు - మహిత (మహిమ గల) ఆత్ముడు (స్వరూపము గలవాడు), విష్ణువు}; మున్ను = పూర్వము; ఒనర్చెన్ = చేసెను; మనుజవరేణ్యా = రాజా.

భావము:

“నరోత్తమా! ధర్మరాజా! ఒకసారి మాయలమారి అయిన మయుని వలన మహిమాన్వితమైన శివుని యశస్సుకి మచ్చ కలిగింది. అప్పుడు భగవంతుడు శ్రీమహా విష్ణువు శంకరునికి జయం కలిగించి, ఆయన కీర్తికి వన్నెతెచ్చాడు.” అని నారదుడు చెప్పాడు.

7-388-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన ధర్మనందనుం డిట్లనియె.

టీకా:

అనినన్ = అనగా; ధర్మనందనుండు = ధర్మరాజు {ధర్మనందనుడు - యమధర్మరాజు యొక్క కొడుకు, ధర్మరాజు}; ఇట్లు = ఇలా; అనియె = అడిగెను.

భావము:

అలా నారదుడు చెప్పగా విని ధర్మరాజు ఇలా అడిగాడు.

7-389-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ఏ ర్మంబున విభుఁడగు
శ్రీకంఠుని యశము మయునిచే సుడివడియెన్
వైకుంఠుఁ డెవ్విధంబునఁ
గైకొని తత్కీర్తి చక్కఁగా నొనరించెన్."

టీకా:

ఏ = ఎట్టి; కర్మంబునన్ = కార్యమువలన; విభుడు = ప్రభువు; అగు = అయిన; శ్రీకంఠుని = పరమశివుని {శ్రీకంఠుడు - వ్యు. శ్రీ కఠే అస్య, బ.వ్రీ., కంఠమున వన్నెకలవాడు, శివుడు}; యశము = కీర్తి; మయుని = మయుడి వలన; సుడివడియెన్ = చలించినది; వైకుంఠుడు = హరి {వైకుంఠుడు - ఒక యవతారమున వికుంఠ యనెడి యామె పుత్రుడు, కుంఠత్వము (మొక్కపోవుట, మౌఢ్యము) లేనివాడు, విష్ణువు}; ఏ = ఏ; విధంబునన్ = విధముగ; కైకొని = చేపట్టి; తత్ = అతని; కీర్తిన్ = యశస్సును; చక్క = ఒప్ప; కాన్ = అగునట్లు; ఒనరించెన్ = చేసెను.

భావము:

మయుడి ఏ పని వలన నీలకంఠుడైన శంకరుని యశస్సుకు కళంకం ఎలా కలిగింది. వైకుంఠవాసుడు శ్రీహరి ఆ సమస్యను ఎలా పరిష్కరించాడు.

7-390-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన నారదుం డిట్లనియె.

టీకా:

అనినన్ = అనగా; నారదుండు = నారదుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అలా ధర్మరాజు అడుగగా, నారదుడు ఇలా చెప్పసాగాడు

7-391-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"చక్రాయుధ బలయుతు లగు
క్రాదుల కోహటించి శ్రమమున నసురుల్
క్రోధంబున నరిగిరి
విక్రమములు మాని మయుని వెనుకకు నధిపా!

టీకా:

చక్రాయుధ = విష్ణుమూర్తి యొక్క; బల = ప్రాపు, అండ; యుతులు = కలిగినవారు; అగు = అయిన; శక్ర = ఇంద్రుడు {శక్రుడు - దుష్టులను శిక్షించుట యందు శక్తిగలవాడు, ఇంద్రుడు}; ఆదులకున్ = మొదలగువారికి; ఓహటించి = ఓడి; శ్రమమునన్ = కష్టములో; అసురుల్ = రాక్షసులు; సక్రోధంబునన్ = కోపముతోటి; అరిగిరి = వెళ్ళిరి; విక్రమములు = ఎదుర్కొనుటలు; మాని = వదలి; మయుని = మయుని; వెనుక = చాటున, ప్రాపున; కున్ = కు; అధిప = రాజా.

భావము:

ఒకసారి చక్రము ఆయుధముగా కలిగిన శ్రీమహావిష్ణువు అండతో విజృంభిస్తున్న ఇంద్రుడు మొదలైనవారి ఉద్ధృతికి తట్టుకోలేక దానవులు ఓడి భయపడిపోయారు. దానవులకు కోపం వలన మనస్సులు మండిపోయాయి, కానీ దేవతలను ఎదుర్కోలేకపోయారు. వెళ్ళి మయాసురుని వెనుక చేరారు.

7-392-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు రక్కసులు దన వెనుకఁ జొచ్చిన మాయానిలయుండును దుర్ణయుండును నైన మయుండు దన విద్యాబలంబున నయోరజత సువర్ణమయంబులై యెవ్వరికిని లక్షింపరాని గమనాగమనంబులును వితర్కింపరాని కర్కశపరిచ్ఛదంబులును గలిగిన త్రిపురంబుల నిర్మించి యిచ్చిన, నక్తంచరు లందఱు నందుంబ్రవేశించి కామసంచారులై పూర్వవైరంబుఁ దలంచి సనాయకంబు లయిన లోకంబుల నస్తోకంబయిన నిజబలాతిరేకంబున శోకంబు నొందించిన.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; రక్కసులు = రాక్షసులు; తన = తన యొక్క; వెనుకన్ = ఆశ్రయమునకు; చొచ్చిన = చేరగా; మాయా = మాయలకు; నిలయుండును = నివాసమైనవాడు; దుర్ణయుండునున్ = చెడ్డనీతిగలవాడు; ఐన = అయిన; మయుండు = మయుడు; తన = తనయొక్క; విద్యా = యోగవిద్య యొక్క; బలంబునన్ = శక్తిచేత; అయస్ = ఇనుము; రజత = వెండి; సువర్ణ = బంగారములచే; మయంబులు = చేయబడినవి; ఐ = అయ్యి; ఎవ్వరి = ఎవరి; కిన్ = కి యైనను; లక్షింప = ఛేదింప; రాని = శక్యముకాని; గమనాగమనంబులు = రాకపోకలుగలది; వితర్కింప = ఊహించుటకు; రాని = శక్యముకాని; కర్కశ = కఠినములైన; పరిచ్ఛదంబులును = రక్షాకవచములు,పరిజనము; కలిగిన = ఉన్నట్టి; త్రి = మూడు (3); పురంబులన్ = పురములను; నిర్మించి = తయారుచేసి; ఇచ్చినన్ = ఇవ్వగా; నక్తంచరులు = రాక్షసులు {నక్తంచరులు - నక్తన్ (రాత్రులందు) చరులు (తిరుగువారు), రాక్షసులు}; అందఱున్ = అందరు; అందున్ = దానిలో; ప్రవేశించి = చేరి; కామసంచారులు = యధేచ్ఛగాతిరుగువారు; ఐ = అయ్యి; పూర్వ = వెనుకటి; వైరంబు = శత్రుత్వము; తలంచి = తలచుకొని; సనాయకంబులు = లోకపాలురతోకూడినవి; అయిన = ఐన; లోకంబులన్ = లోకములను; అస్తోకంబు = అధికము; అయిన = ఐన; నిజ = తమ; బల = బలము యొక్క; అతిరేకంబునన్ = అతిశయముచేత; శోకంబున్ = దుఃఖము; ఒందించినన్ = చెందించగా.

భావము:

అలా రాకాసి మూకలు తన చెంతచేరి, నీవే దిక్కు అనే సరికి ఆ మాయలమారీ, దుర్మార్గుడూ అయిన మయుడు తన యోగబలంతో ఇనుము, వెండి, బంగారాలతో మూడు పురాలను సిద్ధం చేసాడు. అవి రాకపోకలు తెలియరా నటువంటివీ; రహస్య మార్గాలూ, రక్షణగృహాలూ కలిగినట్టివి. తనను శరణువేడిన రాత్రించరులైన రక్కసులకు ఆ త్రిపురాలను ఇచ్చాడు. వారందరూ ఆ త్రిపురాలలో ప్రవేశించి యథేచ్ఛగా తిరుగసాగారు. తమ వెనుకటి శత్రుత్వం గుర్తుంచుకుని భయంకరమైన తమ పరాక్రమంతో లోకాలను, లోకనాయకులను దుఃఖాలపాలు చేయసాగాడు.

7-393-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లోకాధినాథు లెల్లను
శోకాతురు లగుచు శరణు జొచ్చిరి దుష్టా
నీ విదళనాకుంఠున్
శ్రీకంఠున్ భువనభరణ చిత్తోత్కంఠున్.

టీకా:

లోకాధినాథులు = లోకపాలకులు; ఎల్లను = అందరు; శోక = దుఃఖముచే; ఆతురులు = పీడింపబడినవారు; అగుచున్ = అగుచు; శరణు = రక్షణకై; చొచ్చిరి = ఆశ్రయించిరి; దుష్టానీకవిదళనాకుంఠున్ = పరమశివుని {దుష్టానీకవిదళనాకుంఠుడు - దుష్ట (రాక్షసుల) అనీక (సైన్యమును) విదళన (చీల్చివేయుటయందు) అకుంఠున్ (అనర్గళుడు), శివుడు}; శ్రీకంఠున్ = పరమశివుని {శ్రీకంఠుడు - వ్యు. శ్రీ కఠే అస్య, బ.వ్రీ., కంఠమున వన్నెకలవాడు, శివుడు}; భువనభరణచిత్తోత్కంఠున్ = పరమశివుని {భువనభరణచిత్తోత్కంఠుడు - భువన (లోకములన) భరణ (కాపాడుటయందు) చిత్త (హృదయమున) ఉత్కంఠుడు (ఉత్కంఠగలవాడు), శివుడు}.

భావము:

దిక్పాలకులు అందరు రక్కసుల బాధలు భరించలేక శోకార్తులు అయ్యారు. అపుడు వారందరూ వెళ్ళి లోకశుభంకరుడూ, దుష్టనాశంకరుడూ అయిన శంకరుని శరణువేడారు.

7-394-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు సకలలోకేశ్వరుం డగు మహేశ్వరుం జేరి లోకపాలకులు ప్రణతులై పూజించి కరకమలంబులు ముకుళించి.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; సకలలోకేశ్వరుడు = పరమశివుడు {సకలలోకేశ్వరుడు - ఎల్లలోకములకు ప్రభువు, శివుడు}; మహేశ్వరున్ = పరమశివుని {మహేశ్వరుడు - గొప్పఈశ్వరుడు, శివుడు}; చేరి = చేరి; లోకపాలకులు = లోకేశులు; ప్రణతులు = నమస్కరించినవారు; ఐ = అయ్యి; పూజించి = పూజలుచేసి; కర = చేతులు యనెడి; కమలంబులు = పద్మములు; ముకుళించి = జోడించి.

భావము:

లోకేశ్వరుడగు పరమేశ్వరుని ఇలా చేరి లోకపాలకులు నమస్కరించి పూజించారు.కమలాల వంటి తమ చేతులు జోడించి ఇలా అన్నారు

7-395-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"త్రిపురాలయు లగు దానవు
రాజితు లగుచు మాకు శ్రాంతంబున్
పురాదిపీడఁ జేసెద
రాధికులను వధింపు గజాధీశా!

టీకా:

త్రిపుర = త్రిపురములు; ఆలయులు = నివాసములుగాగలవారు; అగు = అయిన; దానవులు = రాక్షసులు; అపరాజితులు = ఓడింపశక్యముకానివారు; అగుచున్ = అగుచు; మా = మా; కున్ = కు; అశ్రాంతమున్ = ఎల్లప్పుడును; వపుర = శరీరము; ఆది = మొదలగువానికి; పీడన్ = బాధలను; చేసెదరు = కలిగించెదరు; అపరాధికులను = ద్రోహులను; వధింపుము = చంపుము; అగజాధీశ = పరమశివ {అగజాధీశుడు - అగజ (పర్వతునికూతురైన పార్వతి) యొక్క అధీశుడు (భర్త), శివుడు}.

భావము:

“ఓ పార్వతీపతీ! శంకరా! త్రిపురాలలో ఉంటున్న రాక్షసులు చేసే అరాచకాలకు అంతం లేకుండా పోయింది. వాళ్ళు అజేయులై నిత్యం లోకాలను తల్లడిల్ల జేస్తున్నారు. మా ప్రాణాలకు ఆపదలు తెస్తున్నారు. తప్పుజేస్తున్న వారిని శిక్షించు ప్రభూ!

7-396-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దీనులము గాక యుష్మద
ధీనులమై యుండు మేము దేవాహిత దో
ర్లీనుల మైనారము బల
హీనుల మగు మమ్ముఁ గావు మీశాన! శివా!"

టీకా:

దీనులము = అల్పులము; కాక = కాకుండగ; యుష్మత్ = నీకు; అధీనులము = స్వాధీనులము; ఐ = అయ్యి; ఉండు = ఉండెడి; మేము = మేము; దేవాహిత = రాక్షసుల {దేవాహితులు - దేవతలకు అహితులు, రాక్షసులు}; దోః = భుజబలమునకు; లీనులము = లొంగువారము; ఐనారము = అయిపోతిమి; బలహీనులము = శక్తిలేనివారము; అగు = అయిన; మమ్మున్ = మమ్ములను; కావుము = కాపాడుము; ఈశాన = ఈశ్వర; శివా = పరమశివ.

భావము:

నీ అధీనంలో దీనత్యంలేని నిరంతరం దివ్యానందంతో ఉండేవాళ్లం. అలాంటి మేము ఇదిగో ఈ సురారులైన రాక్షసుల చేతిలో పడిపోయి, దీనులమూ బలహీనులమూ కావలసివచ్చింది. మమ్మల్ని కాపాడు పరమశివా! ఈశానప్రభూ!”

7-397-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన భక్తవత్సలుం డగు పరమేశ్వరుండు శరణాగతు లైన గీర్వాణుల వెఱవకుం డని దుర్వారబలంబున బాణాసనంబుఁ గేల నందికొని యొక్క దివ్యబాణంబు సంధించి త్రిపురంబులపయి నేసిన మార్తాండమండలంబున వెలువడు మయూఖజాలంబుల చందంబునఁ దద్బాణంబువలన దేదీప్యమానంబులై యనేక బాణసహస్రంబులు సంభవించి భూ నభోంతరాళంబులు నిండి మండి తెప్పలుగాఁ గుప్పలు గొని త్రిపురంబుల పయిఁ గప్పె; నప్పుడు తద్బాణపావక హేతిసందోహ దందహ్యమాను లై గతాసు లయిన త్రిపురపుర నివాసులం దెచ్చి మహాయోగి యైన మయుండు సిద్ధరసకూపంబున వైచిన.

టీకా:

అనినన్ = అనగా; భక్తవత్సలుండు = పరమశివుడు {భక్తవత్సలుడు - భక్తులయెడ వాత్సల్యముగలవాడు, శివుడు}; అగు = అయిన; పరమేశ్వరుండు = పరమశివుడు {పరమేశ్వరుడు - పరమ (అత్యుత్తమమైన) ఈశ్వరుడు (ప్రభువు), శివుడు}; శరణ = శరణుగోరి; ఆగతులు = వచ్చినవారు; ఐన = అయిన; గీర్వాణులన్ = దేవతలను {గీర్వాణులు - శాపరూపమగు వాక్కు (బాణముగా) గలవారు, దేవతలు}; వెఱవకుండు = బెదరకండి; అని = అని; దుర్వార = వారింపశక్యముగాని; బలంబునన్ = శక్తితో; బాణాసనంబున్ = విల్లును; కేలన్ = చేతిలోకి; అందికొని = తీసుకొని; ఒక్క = ఒక; దివ్య = దివ్యమైన; బాణంబున్ = బాణమును; సంధించి = ఎక్కుపెట్టి; త్రిపురంబుల్ = త్రిపురముల; పయిన్ = మీద; ఏసిన = ప్రయోగించగా; మార్తాండ = సూర్య {మార్తాండుడు - బ్రహ్మాండము మృతి (రెండు చెక్కలగునప్పుడు) పుట్టినవాడు, సూర్యుడు}; మండలంబునన్ = మండలమునుండి; వెలువడు = వెలువడెడి; మయూఖ = కిరణముల; జాలంబుల = సమూహముల; చందంబునన్ = వలె; తత్ = ఆ; బాణము = బాణము; వలన = నుండి; దేదీప్యమానంబులు = మిక్కిలివెలుగుచున్నవి; ఐ = అయ్యి; అనేక = పలు; బాణ = బాణముల; సహస్రంబులు = వేలకొలది; సంభవించి = పుట్టి; భూ = భూమి; నభో = ఆకాశము; అంతరాళంబులు = మధ్యప్రదేశములు; నిండి = నిండిపోయి; మండి = కాలిపోయి; తెప్పలు = తుట్టలు; కాన్ = అయినట్లు; కుప్పలుకొని = గుంపులై; త్రిపురంబుల్ = త్రిపురముల; పయిన్ = మీద; కప్పెన్ = కప్పివేసెను; అప్పుడు = అప్పుడు; తత్ = ఆ; బాణ = బాణము యొక్క; పావక = అగ్ని; హేతి = మంటల; సందోహ = సమూహమునకు; దందహ్యమానులు = మిక్కిలి కాలిపోయినవారు; ఐ = అయ్యి; గతాసులు = పోయిన ఊపిరి గలవారు; అయిన = ఐనట్టి; త్రిపుర = త్రిపురములలో; నివాసులన్ = వసించెడివారిని; తెచ్చి = తీసుకొని వచ్చి; మహా = గొప్ప; యోగి = యోగబలముగలవాడు; ఐన = అయిన; మయుండు = మయుడు; సిద్ధరస = అమృతపు; కూపంబునన్ = బావిలో; వైచినన్ = వేయగా.

భావము:

అని ఇలా దేవతలు మొరపెట్టగా, పరమ భక్తవశంకరుడగు శంకరుడు కరుణించి, అభయహస్తం ఇచ్చాడు. అవక్రపరాక్రమంతో ధనుస్సు చేతపట్టాడు. దివ్యమైన అగ్నేయాస్త్రం గురిపెట్టి త్రిపురాలపైకి వేశాడు. ఆ బాణం వలన చండ ప్రచండమైన సూర్యమండలంలో వెలిగే కిరణాల సమూహాల వంటి అగ్నిశిఖలు సహస్రముఖాలుగా వెలువడి భూమ్యాకాశాలు నిండి, మండి, నిప్పులు తెప్పలు తెప్పలుగా కురుస్తూ త్రిపురాలను చుట్టుముట్టాయి. ఆ బాణాగ్ని శిఖల సందోహానికి దానవులు దహించుకు పోయి ప్రాణాలు విడిచారు. అపుడు మహాయోగి అయిన మయుడు తన యోగబలంతో, సిద్ధరసంతో నిండిన కూపంలో అసువులు బాసిన త్రిపుర వాసులైన అసురులను తెచ్చి వేశాడు.

7-398-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సిద్ధామృతరస మహిమను
శుద్ధమహావజ్రతుల్య శోభిత తను లై
వృద్ధిం బొందిరి దానవు
లుద్ధత నిర్ఘాత పావకోపము లగుచున్.

టీకా:

సిద్ధ = యోగసిద్ధమైన; అమృత = అమృతపు; రస = ద్రవము యొక్క; మహిమను = ప్రభావముచేత; శుద్ధ = స్వచ్ఛమైన; మహా = గొప్ప; వజ్ర = వజ్రముతో; తుల్య = సమానమైన; శోభిత = ప్రకాశించెడి; తనులు = దేహములుగలవారు; ఐ = అయ్యి; వృద్ధింబొందిరి = పెంపొందిరి; దానవులు = రాక్షసులు; ఉద్ధతన్ = అతిశయముతో; నిర్ఘాత = పిడుగులలోని; పావక = నిప్పులకు; ఉపములు = పోల్చదగినవారు; అగుచున్ = అగుచు.

భావము:

ఆ సిద్ధరస ప్రభావం వలన ఆ రక్కసులందరూ పునరుజ్జీవితులు అయ్యారు, వజ్రాల వంటి దృఢమైన దేహాలతో చిచ్చర పిడుగుల వలె బలసంపన్నులు అయ్యారు.

7-399-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కూపామృత రససిద్ధిని
దీపితులై నిలిచి యున్న దేవాహితులన్
రూపించి చింత నొందెడు
గోధ్వజుఁ జూచి చక్రి కుహనాన్వితుఁడై.

టీకా:

కూప = బావిలోని; అమృత = అమృతపు; రస = ద్రవము; సిద్ధిని = ఫలించుటచేత; దీపితులు = ప్రకాశించెడివారు; ఐ = అయ్యి; నిలిచి = బతికి; ఉన్న = ఉన్నట్టి; దేవాహితులన్ = రాక్షసులను; రూపించి = కనిపెట్టి; చింతన్ = విచారమును; ఒందెడు = పొందుచున్న; గోపద్వజునిన్ = పరమశివుని {గోపద్వజుడు – గోప (వృషభము) ధ్వజము (జండా) గా గలవాడు, శివుడు}; చూచి = చూసి; చక్రి = విష్ణుమూర్తి {చక్రి - చక్రాయుధము ధరించువాడు, విష్ణువు}; కుహన = మాయావిలాసముతో; ఆన్వితుండు = కూడినవాడు; ఐ = అయ్యి.

భావము:

మయుని సిద్ధరస కూపం ప్రభావం వల్ల రాక్షసులు ఇలా ప్రబలి విజృంభించటం, తన బాణశక్తి వ్యర్థం కావటం తెలిసి మహాశ్వరునకు బాధ కలిగింది. తన పరాక్రమానికి కళంకం ఏర్పడిందని, తన కీర్తికి మచ్చ కలిందని చింతించాడు. విష్ణుమూర్తి ఇది తెలుసుకుని ఉపాయం ఆలోచించాడు. మాయగాళ్ళను మాయల తోటే మట్టుపెట్టాలని నిశ్చయించుకున్నాడు

7-400-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

త్సాహంబున నొక్క పాఁడిమొదవై యూథంబు ఘ్రాణించుచున్
త్సంబై తనవెంట బ్రహ్మ నడవన్ వైకుంఠుఁ డేతెంచి యు
ద్యత్సత్త్వంబునఁ గూపమధ్య రసముం ద్రావెన్ విలోకించుచుం
త్సౌభాగ్యనిమగ్ను లై మఱచి రా దైత్యుల్ నివారింపఁగన్.

టీకా:

ఉత్సాహంబునన్ = వేడుకతో; ఒక్క = ఒక; పాడి = పాలిచ్చెడి; మొదవు = ఆవు; ఐ = అయ్యి; ఊథంబున్ = పొదుగును; ఘ్రాణించుచున్ = మూర్కొనుచు; వత్సంబు = దూడ; ఐ = అయ్యి; తన = తన; వెంటన్ = కూడ; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; నడవన్ = నడచిరాగా; వైకుంఠుండు = విష్ణుమూర్తి; ఏతెంచి = వచ్చి; ఉద్యత్సత్త్వంబునన్ = గొప్ప గడుసుదనముతో; కూప = బావి; మధ్య = లోనున్న; రసమున్ = సిద్ధరసమును; త్రావెన్ = తాగివేసెను; విలోకించుచన్ = చూచునుండి; తత్ = దాని; సౌభాగ్య = చక్కదనమునందు; నిమగ్నులు = తగుల్కొన్నవారు; ఐ = అయ్యి; మఱచిరి = మరచిపోయిరి; ఆ = ఆ; దైత్యుల్ = రాక్షసులు; నివారింపగన్ = అడ్డగించుటను.

భావము:

విష్ణుమూర్తి ఉత్సాహవంతమైన అందమైన పాడి ఆవు అయ్యాడు. బ్రహ్మదేవుడు ఆ పాడి ఆవు పొదుగు చుంబించే చిన్నారి ఆవుదూడగా మారాడు. ఆ ఆవుదూడలు జగన్మోహనంగా ఉన్నాయి. అవి మెల్లమెల్లగా వచ్చి ఆ సిద్ధబావిలోని సిద్ధరసం త్రాగుతున్నాయి. దానిని కాపలా కాస్తున్న రాక్షస భటులు వాటి అందచందాలు చూస్తూ వాటిని తోలటమే మరచిపోయారు. ఆవు దూడలు ఆ కూపంలోని సిద్ధరసం అంతా పూర్తిగా త్రాగేశాయి.

7-401-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు విష్ణుండు మోహనాకారంబున ధేను వయి వచ్చి త్రిపుర మధ్య కూపామృతరసంబు ద్రావిన నెఱింగి శోకాకులచిత్తు లయిన రసకూపపాలకులం జూచి మహాయోగి యైన మయుండు వెఱఁగుపడి దైవగతిం జింతించి శోకింపక యిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; విష్ణుండు = విష్ణుమూర్తి; మోహన = మోహింజేసెడి; ఆకారంబునన్ = ఆకారముతో; ధేనువు = ఆవు; అయి = అయ్యి; వచ్చి = వచ్చి; త్రిపుర = త్రిపురముల; మధ్య = నడిమి; కూప = బావియందలి; అమృత = అమృతపు; రసంబు = ద్రవమును; త్రావినన్ = తాగేయగా; ఎఱింగి = తెలిసికొని; శోక = దుఃఖముచే; ఆకుల = కలతబారిన; చిత్తులు = మనసులుగలవారు; అయిన = ఐన; రస = అమృతరసపు; కూప = బావి; పాలకులన్ = కాపలాదారులను; చూచి = చూసి; మహా = గొప్ప; యోగి = యోగబలముగలవాడు; ఐన = అయిన; మయుండు = మయుడు; వెఱగుపడి = ఆశ్చర్యపోయి; దైవగతిన్ = విధివిలాసమును; చింతించి = విచారించి; శోకింపక = దుఃఖింపక; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అలా విష్ణుమూర్తి మోహనాకారంలో పాడిఆవుగా వచ్చి త్రిపురాల మధ్య గల బావిలోంచి సిద్ధరసం అంతా త్రాగేసిన విషయం తెలుసుకుని, ఆ కూపపాలకులు గుండెలు బాదుకుని దుఃఖించారు. వారిని చూసి మహాయోగి అయిన మయుడు జరిగినది తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. అది విధివిలాసంగా గ్రహించి దుఃఖించక ఇలా అన్నాడు.

7-402-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"మరు లైన దనుజు లైనను నరు లైన
నెంత నిపుణు లైన నెవ్వరైన
దైవికార్థచయముఁ ప్పింపఁగా లేరు
లదు దనుజులార! గవ మనకు."

టీకా:

అమరులు = దేవతలు {అమరులు - మరణములేనివారు, దేవతలు}; ఐనన్ = అయినను; దనుజులు = రాక్షసులు {దనుజులు - కశ్యపునకు దనువు యందు కలిగిన సంతానము, రాక్షసులు}; ఐనను = అయినను; నరులు = మానవులు; ఐనన్ = అయినను; ఎంత = ఎంత; నిపుణులు = నేర్పరులు; ఐనన్ = అయినను; ఎవ్వరు = ఎవరు; ఐనన్ = అయినను; దైవిక = దైవమువలన ప్రాప్తించెడి; అర్థ = విషయముల; చయమున్ = సమూహములను; తప్పింపగా = తొలగించుటకు; లేరు = సమర్థులుకారు; వలదు = వద్దు; దనుజులారా = రాక్షసులూ; వగవన్ = దుఃఖపడుటకు; మన = మన; కున్ = కు.

భావము:

“రక్కసుల్లారా! దైవేచ్ఛ ఇలా ఉంది కాబోలు. దైవేచ్ఛను తప్పించటం ఎవరి తరమూ కాదు. అమరులైనా, అసురులైనా నరులైనా ఎంతటివారైనా విధివిలాసాన్ని మార్చలేరు కదా. దీనికి మనం దుఃఖించరాదు.”

7-403-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పలికె; నంత విష్ణుండు నైజంబు లైన ధర్మవిజ్ఞానవిద్యాతపో విరక్తి సమృద్ధి క్రియాశక్తివిశేషంబుల శంభునికిఁ బ్రాధాన్యంబు సమర్పించి రథసూత కేతు వర్మ బాణాసన ప్రముఖ సంగ్రామ సాధనంబులు చేసినం గైకొని.

టీకా:

అని = అని; పలికె = చెప్పెను; అంతన్ = అంతట; విష్ణుండు = విష్ణుమూర్తి; నైజంబులు = తనవి; ధర్మ = న్యాయము; విజ్ఞాన = విజ్ఞానము; విద్య = విద్య; తపస్ = తపస్సు; విరక్తి = వైరాగ్యము; సమృద్ధి = నిండుదనము; క్రియాశక్తి = కర్మసామర్థ్యముల; విశేషంబులన్ = అతిశయములను; శంభునికి = శివునికి; ప్రాధాన్యంబు = ముఖ్యత్వము; సమర్పించి = ఇచ్చి; రథ = రథము; సూత = సారథి; కేతు = జండా; వర్మ = డాలు; బాణాసన = విల్లు; ప్రముఖ = మొదలైన; సంగ్రామ = యుద్ధ; సాధనంబులు = పరికరములు; చేసినన్ = కలిగించగా; కైకొని = చేపట్టి.

భావము:

ఇలా పలికి మయుడు రాక్షసులను ఓదార్చాడు. అటుపిమ్మట విష్ణువు తన సహజశక్తులైన ధర్మం, జ్ఞానం, విద్య, తపస్సు, సమృద్ధి, క్రియాశక్తి విశేషాలతో రథం, సారథి, కేతనం, కవచం, విల్లు, అమ్ములు మున్నగు యుద్ధసామగ్రి అంతా సమకూర్చాడు. రథికుడైన శివుడు స్వీకరించాడు.

7-404-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రి యై కార్ముకి యై మహాకవచి యై న్నాహి యై వాహి యై
థుండై సనియంత యై సబలుఁడై త్కేతనచ్ఛత్రుఁ డై
మేశుం డొక బాణమున్ విడిచెఁ దద్బాణానలజ్వాలలం
బుముల్ కాలె ఛటచ్ఛటధ్వని నభోభూమధ్యముల్ నిండగన్.

టీకా:

శరి = బాణముగలవాడు; ఐ = అయ్యి; కార్ముకి = విల్లుధరించినవాడు; ఐ = అయ్యి; మహా = గొప్ప; కవచి = డాలుధరించినవాడు; ఐ = అయ్యి; సన్నాహి = పూనికగలవాడు; ఐ = అయ్యి; వాహి = వాహనమెక్కినవాడు; ఐ = అయ్యి; సరథుండు = రథముకూడినవాడు; ఐ = అయ్యి; సనియంత = రథసారథికూడినవాడు; ఐ = అయ్యి; సబలుడు = సైన్యముతో కూడినవాడు; ఐ = అయ్యి; స = మంచి; కేతన = జండా; ఛత్రుడు = గొడుగులుగలవాడు; ఐ = అయ్యి; పరమేశుండు = పరమశివుడు; ఒక = ఒక; బాణమున్ = బాణమును; విడిచెన్ = ప్రయోగించెను; తత్ = ఆ; బాణ = బాణము యొక్క; అనల = అగ్ని; జ్వాలలన్ = మంటలలో; పురముల్ = పురములు; కాలెన్ = కాలిపోయెను; ఛటఛట = ఛటఛట మనియెడి; ధ్వని = శబ్దము; నభః = ఆకాశము; భూ = భూమి; మధ్యముల్ = మధ్యప్రదేశములు; నిండగన్ = నిండిపోగా.

భావము:

పరమశివుడు కవచం ధరించాడు, విల్లు పట్టుకున్నాడు. అమ్ము అందుకున్నాడు. రథం నడపటానికి సారథి, జండా, గొడుగు, సైన్యం అన్నీ సిద్దం అయ్యాయి. పరమేశ్వరుడు రథం అధిరోహించాడు. సర్వసన్నాహాలతో యుద్ధానికి సిద్ధం అయ్యాడు. ఒక బాణాన్ని గురిచూసి ప్రయోగించాడు. ఆ బాణం నుండి అగ్ని జ్వాలలు వెలువడి చెలరేగాయి. ఆ మహా బాణాగ్ని జ్వాలలలో ఆ త్రిపురాలు మూడూ ఒక్కసారిగా భగ్గువ మండిపోయాయి. ఛటఛట ధ్వనులు చెలరేగి భూమ్యాకాశాల మధ్యభాగం అంతా నిండిపోయింది.

7-405-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు హరుండు దురవగాహంబు లైన త్రిపురంబుల నభిజిన్ముహూర్తంబున భస్మంబు చేసి కూల్చిన, నమర గరుడ గంధర్వ సాధ్య యక్ష వల్లభులు వీక్షించి జయజయశబ్దంబులు జేయుచుఁ గుసుమ వర్షంబులు వర్షించిరి; ప్రజలు హర్షించిరి; బ్రహ్మాదులు గీర్తించి; రప్సరసలు నర్తించిరి; దివ్య కాహళ దుందుభి రవంబులును మునిజనోత్సవంబులును బ్రచురంబు లయ్యె; నిట్లు విశ్వజనీనం బగు త్రిపురాసురసంహారంబున నఖిలలోకులును సంతసిల్లి యుండ; నయ్యవసరంబున.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; హరుండు = పరమ శివుడు; దురవగాహంబులు = చొరశక్యముగానివి; ఐన = అయిన; త్రి = మూడు; పురంబులన్ = పురములను; అభిజిన్ముహూర్తంబునన్ = మిట్టమధ్యాహ్నము {అభిజిన్ముహూర్తము - పగలు (సూర్యోదయమునుండి) పద్నాలుగు గడియల (సుమారు 14x30ని. అనగా ఒంటిగంట) సమయము, మిట్టమధ్యాహ్నము}; భస్మము = బూడిద; చేసి = చేసి; కూల్చినన్ = నాశనముచేయగా; అమర = దేవతల; గరుడ = గరుడుల; గంధర్వ = గంధర్వుల; సాధ్య = సాధ్యుల; యక్ష = యక్షుల; వల్లభులు = ప్రభువులు; వీక్షించి = చూసి; జయజయ = జయజయ యనెడి; శబ్దంబులు = ధ్వానంబులు; చేయుచున్ = చేయుచు; కుసుమ = పూల; వర్షంబులు = వానలు; వర్షించిరి = కురిసిరి; ప్రజలు = లోకులు; హర్షించిరి = సంతోషించిరి; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆదులు = మొదలగువారు; కీర్తించిరి = నుతించిరి; అప్సరసలు = అప్సరసలు; నర్తించిరి = నాట్యములుచేసిరి; దివ్య = దివ్యమైన; కాహళ = కాహళుల; దుందుభి = దుందుభుల; రవంబులును = శబ్దములు; మునిజనుల = మునులయొక్క; ఉత్సవంబులునున్ = వేడుకలు; ప్రచురంబులు = వెల్లడి; అయ్యెన్ = అయ్యెను; ఇట్లు = ఈ విధముగ; విశ్వజనీనంబు = ఎల్లజనులకు మేలుకొరకైనది; అగు = అయిన; త్రిపుర = త్రిపురములందలి; అసుర = రాక్షసులను; సంహారంబునన్ = నాశనమువలన; అఖిల = సమస్తమైన; లోకులును = ప్రజలు; సంతసిల్లి = సంతోషించి; ఉండన్ = ఉండగా; ఆ = ఆ; అవసరంబునన్ = సమయములో.

భావము:

అలా మహాదేవుడు దుర్భేధ్యాలయిన త్రిపురాలను మిట్టమధ్యాహ్న సమయంలో భస్మం చేసి కూల్చివేశాడు; ఇది చూసి దేవతలూ, గరుడులూ, గంధర్వులూ, సిద్ధులూ, సాధ్యులూ, యక్ష నాయకులు జయజయ నినాదాలు చేశారు; పూలవానలు కురిపించారు; బ్రహ్మదేవుడు మున్నగు వారంతా హరుని హర్షంతో ప్రస్తుతించారు; అప్సరసలు ఆనందంతో ఆడారు; మునిజనులు ఉత్సవం జరుపుకున్నారు; దివ్య కాహళుల, దుందుభుల శబ్దాలు మిన్నుముట్టాయి; ఇలా పరమేశ్వరుడు విశ్వకల్యాణకర మగునట్లు త్రిపురాసుర సంహారం చేయటంతో సకల లోకాల లోని ప్రజలూ సంతసించారు

7-406-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తృణకణముల భంగి ద్రిపురంబుల దహించి
రముఁ డవ్యయుండు ద్రయశుఁడు
శివుఁడు పద్మజాది జేగీయమానుఁ డై
నిజనివాసమునకు నెమ్మిఁ జనియె.

టీకా:

తృణ = గడ్డి; కణముల = పోచల; భంగిన్ = వలె; పురంబులన్ = పురములను; దహించి = కాల్చేసి; పరముడు = శ్రేష్ఠుడు; అవ్యయుండు = నాశములేనివాడు; భద్రయశుడు = శుభకీర్తిగలవాడు; శివుడు = పరమశివుడు; పద్మజ = బ్రహ్మదేవుడు; ఆది = మొదలగువారిచే; జేగీయమానుడు = స్తుతింపబడినవాడు; ఐ = అయ్యి; నిజనివాసమున్ = తనతావు (కైలాసము)న; కున్ = కు; నెమ్మిన్ = ప్రీతితో; చనియె = వెళ్ళెను.

భావము:

అగ్ని దేవుడు ఎండుగడ్డిని దహించినంత సుళువుగా; శాశ్వతుడు, భద్రయశుడు అయిన పరమేశ్వరుడు త్రిపురాలను కాల్చివేశాడు; పద్మసంభువు డైన బ్రహ్మదేవుడు మున్నగువారి పూజ లందుకుని తన నివాసమైన కైలాసానికి వెళ్ళాడు.

7-407-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు నిజమాయా విశేషంబున మర్త్యలోకంబున విడంబించుచున్న విష్ణుని పరాక్రమవిధానంబులు మునిజన వంద్యమానంబు లై సకల లోక కల్యాణ ప్రధానంబు లై యుండు" ననిన విని నారదునకు ధర్మనందనుం డిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; నిజ = తన; మాయ = మాయ; విశేషంబునన్ = అతిశయముచేత; మర్త్య = మానవ; లోకంబునన్ = లోకమున; విడంబించుచున్న = విరాజిల్లుతున్న; విష్ణుని = విష్ణుమూర్తి యొక్క; పరాక్రమ = పరాక్రమ; విధానంబులు = గతులు; ముని = మునులైన; జన = వారిచే; వంద్యమానంబులు = మొక్కబడినవి; ఐ = అయ్యి; సకల = సమస్తమైన; లోక = లోకములకు; కల్యాణ = మంగళ; ప్రధానంబులు = కలిగించెడివి; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; అనినన్ = అనగా; విని = విని; నారదున్ = నారదుని; కున్ = కి; ధర్మనందనుండు = ధర్మరాజు; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.

భావము:

ఇలా తన మాయా విశేషాలతో విష్ణుమూర్తి మానవలోకంలో విరాజిల్లు తున్నాడు. ఆ శ్రీహరి పరాక్రమ గతులు మునిజనులకు స్తుతిపాత్రాలు. లోక కల్యాణ కారకాలు.” అని నారదుడు ధర్మరాజునకు తెలియజెప్పాడు. అపుడు ధర్మరాజు ఇలా అన్నాడు.