సప్తమ స్కంధము : ఉపోద్ఘాతము
- ఉపకరణాలు:
- ^
శ్రీ మ ద్విఖ్యాతి లతా
క్రామిత రోదోంతరాళ! కమనీయ మహా
జీమూత తులిత దేహ
శ్యామల రుచిజాల! రామచంద్రనృపాలా!
టీకా:
శ్రీమత్ = సంపద్యుక్తమైన; విఖ్యాతి = కీర్తి యనెడి; లతా = తీగచే; ఆక్రామిత = అల్లుకొనబడిన; రోదస్ = భూమ్యాకాశములు; అంతరాళ = అందలి ప్రదేశములు గలవాడ; కమనీయ = చూడచక్కని; మహా = గొప్ప; జీమూత = మేఘములతో; తులిత = సరిపోలెడి; దేహ = శరీరపు; శ్యామల = నల్లని; రుచిర = కాంతుల; జాల = సమూహములు గలవాడ; రామచంద్ర = శ్రీరామచంద్ర; నృపాల = మహారాజ.
భావము:
చక్కటి కీర్తిలతలు లోకమంతా వ్యాపించిన వాడా! మనోహరమైన నీలి మేఘఛాయను పోలెడి మేను కలవాడా! శ్రీరామచంద్రమహారాజా! అవధరించు