పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : హంసగుహ్య స్తవరాజము

  •  
  •  
  •  

6-241-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లుచు నున్న వచ్చి కమలాసనుఁ డూఱడిలంగఁ బల్కె మున్
సిన లీలఁ బుత్రుల నపార గుణాఢ్యులఁ గాంచుమన్న నా
డఁతుక యందుఁ బల్వురను న్నుగఁ దా శబళాశ్వ సంజ్ఞలం
బెడఁగగు వారిఁ బుణ్యముల చేర్చినవారి సహస్ర సంఖ్యులన్.

టీకా:

అడలుచున్న = శోకించుతున్న; వచ్చి = వచ్చి; కమలాసనుడు = బ్రహ్మదేవుడు {కమలాసనుడు - కమలము ఆసనముగా గలవాడు, బ్రహ్మ}; ఊరడిలంగన్ = ఊరడించుటకు; పల్కె = పలికెను; మున్ = ఇంతకు ముందు; పడసిన = పొందిన; లీలన్ = విధముగ; పుత్రులన్ = కుమారులను; అపార = అంతులేని; గుణ = సుగుణముల; ఆఢ్యులన్ = శ్రేష్ఠులను; కాంచుము = పొందుము; అన్నన్ = అనగా; ఆ = ఆ; పడతుక = స్త్రీ; అందున్ = అందు; పల్వురను = అనేక మందిని; పన్నుగ = యుక్తిగ; తాన్ = తాను; శబళాశ్వ = శబళాశ్వ యనెడి; సంజ్ఞలన్ = పేర్లతో; బెడగు = చక్కనైనవారు; అగు = అయిన; వారిన్ = వారిని; పుణ్యములన్ = పుణ్యములను; చేర్చిన = కూడబెట్టిన; వారిన్ = వారిని; సహస్ర = వేల (1000); సంఖ్యులన్ = సంఖ్యలలో యున్నవారిని.

భావము:

దక్షుడు దుఃఖిస్తూ ఉండగా బ్రహ్మదేవుడు వచ్చి ఓదార్చి “పూర్వంలాగా అపార గుణవంతులైన కొడుకులను పుట్టించు” అని ప్రోత్సహించాడు. దక్షుడు తండ్రి ఆజ్ఞను పాటించి అసిక్ని యందు శబలాశ్వులు అను చక్కనివారు, పుణ్యాత్ములు అయిన వేలకొలది కుమారులను కన్నాడు.