పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : హంసగుహ్య స్తవరాజము

  •  
  •  
  •  

6-239.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రిణమింప విష్ణుఁ బాడుచుఁ దత్కీర్తి
రణి మ్రోయు మహతి సంఘటించి
నారదుండు గుణవిశారదుం డెందేనిఁ
నియెఁ దన్ను జగము న్నుతింప.

టీకా:

వినవు = వినుము; అయ్య = తండ్రి; భూపాల = రాజా; మునివరేణ్యుని = నారదుని {మునివరేణ్యుడు - మునులలో శ్రేష్ఠుడు, (ఇక్కడ) నారదుడు}; మాటలను = మాటలను; అనువొంద = అనుకూలముగా; తలపోసి = ఆలోచించుకొని; వినయము = వినయము; అలర = విలసిల్లగా; వలగొని = ప్రదక్షణములు ఆచరించి; అతని = అతని; కి = కి; వందనంబులు = నమస్కారములు; ఒనర్చి = చేసి; తిరిగి = వెనుకకు; ఎన్నడు = ఎప్పుడు; రాని = రానట్టి; తెరువుపట్టి = దారిపట్టి; చయ్యన = వేగముగ; ఏగిరి = వెళ్ళిరి; సహజ = సహజముగ; సత్త్వ = సత్త్వగుణము; బ్రహ్మ = బ్రహ్మముతో; మయము = నిండినది; ఐన = అయిన; పంకజనయను = నారాయణుని {పంకజనయనుడు - పంకజము (పద్మము)వంటి నయనుడు (కన్నులు గలవాడు), విష్ణువు}; పాద = పాదములు యనెడి; పద్మ = పద్మముల యొక్క; మరందంబు = మకరందమును; పానంబు = తాగుట; చేయుచు = చేస్తూ; మత్తిల్లి = మత్తెక్కి; నిలిచిన = ఉన్నట్టి; మానస =మానసము అను; అళి = తుమ్మెద; పరిణమింప = సంతోషించగా, పరవశించగా;
విష్ణున్ = నారాయణుని; పాడుచున్ = కీర్తించుతూ; తత్ = అతని; కీర్తి = యశస్సు; సరణిన్ = క్రమమును; మ్రోయు = పలికెడి; మహతి = మహతి యనెడి వీణ {మహతి - నారదుని వీణ యొక్క పేరు}; సంఘటించి = కూర్చి; నారదుండు = నారదుడు; గుణ = సుగుణముల; విశారదుండు = మిక్కిలి జ్ఞానము గలవాడు; ఎందేని = యథేచ్ఛగా, ఎక్కడకో; చనియె = వెళ్ళిపోయెను; తన్ను = తనను; జగము = లోకములు; సన్నుతింప = స్తుతించగా.

భావము:

రాజా! విను. ఆ హర్యశ్వులు నారద మునీంద్రుని హితోపదేశాన్ని శిరసావహించి భక్తితో అతనికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి తత్క్షణమే మోక్షమార్గాన్ని అవలంబించి కృతార్థులయ్యారు. సహజ మధురమైన శ్రీమన్నారాయణుని పాదకమల మకరందాన్ని పానం చేస్తూ, తన మానసమనే మధుకరం పరవశిస్తుండగా, గుణవిశారదుడైన నారదుడు శ్రీహరి లీలలను తన మహతీవీణపై మ్రోగిస్తూ, యథేచ్ఛగా వెళ్ళిపోయాడు.