పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : హంసగుహ్య స్తవరాజము

  •  
  •  
  •  

6-219.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఖిలలోక మోహనాకార యుక్తుఁడై
నాదాది మునులు జేరి కొలువఁ
దిసి మునులు పొగడ గంధర్వ కిన్నర
సిద్ధ గాన రవము చెవుల నలర.

టీకా:

కుండల = చెవికుండలముల; మణి = మణుల యొక్క; దీప్తి = కాంతులు; గండస్థలంబులన్ = చెంప లందు, చెక్కి ళ్ళందు; పూర్ణేందు = నిండుచంద్రుని; రాగంబు = వెలుగులు; పొందుపఱుప = చక్కగ కలుగ జేయగా దివ్య = దివ్యమైన; కిరీట = కిరీటము యొక్క; ప్రదీప్తులు = మిక్కిలి ప్రకాశవంతమైన కాంతులు; అంబర = ఆకాశము యనెడి; రమాసతి = లక్ష్మీదేవి; కిన్ = కి; కౌసుంభ = కుంకుమపువ్వు రంగు గల; వస్త్రంబు = బట్ట; కాగ = అవ్వగా వక్షస్థలంబు = రొమ్ము; పై = మీద; వనమాలికా = వనమాలికల {వనమాలిక - ఆకులు పువ్వులు చేర్చికట్టిన మాల}; శ్రీలు = శోభలు; శ్రీవత్స = శ్రీవత్సము {శ్రీవత్సము - విష్ణుమూర్తి రొమ్ముపై నుండెడి శ్రీవత్సము అనెడి పేరుగల పుట్టుమచ్చ}; కౌస్తుభ = కౌస్తుభముల యొక్క {కౌస్తుభము - విష్ణుమూర్తి వక్షస్థలమున ధరించెడి కౌస్తుభము అను పేరుగల ఒక మణి}; శ్రీలన్ = శోభలతో; ఒఱయన్ = పోటీపడుతుండగా; నీలాద్రిన్ = నీలగిరిని; పెనగొని = చుట్టుకొని; నిలిచిన = నిలబడినట్టి; విద్యుల్లతల = మెరపుతీగల; భాతిన్ = వలె; కనక = బంగారు; అంగదంబు = భుజకీర్తులు; మెఱయ = తళతళ లాడుచుండ; అఖిల = సమస్త; లోక = లోకములకు;
మోహన = మనోహరమైన; ఆకార = స్వరూపము; యుక్తుడు = కలవాడు; ఐ = అయ్యి; నారద = నారదుడు; ఆది = మొదలగు; మునులు = మునులు; చేరి = చేరి; కొలువన్ = కొలుస్తుండగా; కదిసి = సమీపించి; మునులు = మునులు; పొగడ = స్తుతించుచుండగ; గంధర్వ = గంధర్వుల; కిన్నర = కిన్నరల; సిద్ధ = సిద్ధుల; గాన = కీర్తనల; రవము = శబ్దము; చెవులన్ = చెవులను; అలర = అలరించుతుండగ.

భావము:

శ్రీమన్నారాయణుని కర్ణకుండలాల కాంతులు ప్రసరించి చెక్కిళ్ళు చంద్రబింబాలవలె తళతళ లాడుతున్నాయి. తలమీద ధరించిన కిరీటం తన దివ్యదీప్తులతో గగనలక్ష్మికి కుంకుమరంగు చీరను అలంకరిస్తున్నది. అతని వక్షఃస్థలంమీద విరాజిల్లే వనమాలిక శోభలు శ్రీవత్సంతోను, కౌస్తుభంతోను పోటీ పడుతున్నాయి. బాహువులకు చుట్టుకొని ఉన్న భుజకీర్తులు నీలగిరికి చుట్టుకొన్న మెరుపు తీగలవలె మెరుస్తున్నాయి. ఆ స్వామి సౌందర్యం సమస్తలోకాలను మోహంలో ముంచి తేలుస్తున్నది. నారదాది మహర్షులు చుట్టూ చేరి సేవిస్తున్నారు. దేవతా బృందాలు కైవారాలు సలుపుతున్నారు. గంధర్వులు, కిన్నరులు, సిద్ధులు వీనుల విందుగా గానం చేస్తున్నారు.