పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : చంద్రుని ఆమంత్రణంబు

  •  
  •  
  •  

6-208-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హువిధముల బహుముఖముల
హురూపములైన ప్రజల హులోకములన్
హుళముగఁ జేసి మదిలో
హుమానము నొందఁ డయ్యె బ్రఖ్యాతముగన్.

టీకా:

బహు = అనేక; విధముల = రకముల; బహు = అనేకమైన; ముఖముల = ఉపాయములతో; బహు = అనేకమైన; రూపములు = స్వరూపములు గలిగినవి; ఐన = అయిన; ప్రజల = జీవులను; బహు = అనేకమైన; లోకములన్ = లోకములలో; బహుళముగన్ = అధికముగ; చేసి = సృష్టించి; మది = మనసు; లో = అందు; బహుమానము = తనివి; ఒందడయ్యెన్ = పొందకుండెను; ప్రఖ్యాతముగన్ = ప్రసిద్ధముగ.

భావము:

పెక్కు విధాలుగా, పెక్కు ముఖాలతో, పెక్కు రూపాలతో పెక్కులోకాలలో అనేక విధాలుగా సృష్టించి కూడా దక్షుడు సంతృప్తిని పొందలేదు.